For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ధనుర్మాసంలో చేసే ఈ వ్రతంతో పెళ్లికాని వారి కోరికలు నెరవేరుతాయట...!

|

హిందూ పంచాంగం ప్రకారం.. శ్రావణ మాసం, కార్తీక మాసం, మాఘమాసాలు ఆధ్యాత్మికతకు అనువైనవిగా.. ఈ కాలంలో చాలా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయని చాలా మంది భావిస్తారు.

అయితే ధనుర్మాసంలో కూడా అనేక ఆధ్యాత్మిక ప్రయోజనాలు దాగి ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఈ మాసానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో ప్రతిరోజూ ఉదయం, సాయంకాలం వేళలో ఇంటిని శుభ్రం చేసుకుని, దీపారాధన చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మీ దేవి, విష్ణుమూర్తి కరుణ కటాక్షాలు లభించడంతో పాటు.. పెళ్లికాని వారు ఈ సమయంలో చేసే వ్రతాల వల్ల వారి కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.

ఈ సందర్భంగా ధనుర్మాసం యొక్క ప్రాముఖ్యత, ప్రత్యేకతతో పాటు ఈ కాలంలో విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలెందుకు చేస్తారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మార్గశిర మాసం.. ఎందుకని విలక్షణమైన మాసం అయ్యిందో తెలుసా...!మార్గశిర మాసం.. ఎందుకని విలక్షణమైన మాసం అయ్యిందో తెలుసా...!

ధనుర్మాసంలో..

ధనుర్మాసంలో..

ధనుర్మాసం అంటే శ్రీ మహా విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది. ఈ సమయంలో మన కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల కొండలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాల్లో అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని చిన్నారులకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు.

దేవతలకు కూడా..

దేవతలకు కూడా..

ఈ ధనుర్మాసం దేవతలకు కూడా బ్రహ్మ ముహుర్తం లాంటిది. ఈ ధనుర్మాసంలో మకర కర్కాటక సంక్రాంతులతో స్నాన, దాన, హోమం, వ్రతం మరియు పూజలు చేయడం వల్ల మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి.

దివ్య ప్రార్థనకు..

దివ్య ప్రార్థనకు..

ధనుర్మాసం అంటే దివ్యప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ఈ కాలంలో దేవాలయాల్లో ఆండాళమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదాకళ్యాణం ప్రసాదాలు వంటివి నిర్వహిస్తారు. ఈ సమయంలో తిరుమలలో సహస్రనామార్చనలో తులసీదళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు.

మీపై చంద్రుడు, శని గ్రహాల ప్రభావం పడకూడదంటే... ఈ పరిహారాలు పాటించండి...మీపై చంద్రుడు, శని గ్రహాల ప్రభావం పడకూడదంటే... ఈ పరిహారాలు పాటించండి...

మహాలక్ష్మీ అనుగ్రహం..

మహాలక్ష్మీ అనుగ్రహం..

ధనుర్మాసం కాలంలో ఉభయ సంధ్య వేళల్లో ఇంటిని శుభ్రం చేసుకుని.. దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం తప్పక లభిస్తుంది. మీ దరిద్రం తొలగి అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సూర్యుడు ధనస్సు నుండి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగిరోజు వరకు ఈ ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజుల పాటు విష్ణు దేవాలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.

గోదాదేవి వ్రతం..

గోదాదేవి వ్రతం..

మార్గశిర మాసంలో పౌర్ణమి తర్వాత పాఢ్యమి నుండి వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. పురాణాల ప్రకారం గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణుడిని కొలిచింది. ధనుసంక్రమణ రోజున నదీస్నానాలు, పూజలు, జపాలు చేయడం వల్ల శుభప్రదమైన ఫలితాలొస్తాయి.

కోరుకున్న వారు..

కోరుకున్న వారు..

ఈ మాసంలో శ్రీ మహా విష్ణుమూర్తిని మధుసూధనుడు పేరుతో పూజించి, తొలి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగం నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత 15 రోజులు దద్దోజనం నివేదించాలి. ఈ సమయంలో పెళ్లి వయసు వచ్చిన వారు తమ ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలతో పూజ చేయడం వల్ల కోరుకున్న వ్యక్తి లభిస్తారు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ఈ మాసమంతా పూజించడం వల్ల ఆమెకు మోక్షం లభించింది.

నారదునికి వివరణ..

నారదునికి వివరణ..

ధనుర్మాసంలో ప్రతిరోజూ శ్రీక్రిష్ణుడికి తులసి మాల సమర్పించే స్త్రీలకు నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుంది. ఈ వ్రతం గురించి మొట్టమొదట బ్రహ్మదేవుడు నారదునికి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ, ఆదిత్య పురాణాలు, భాగవతం, నారాయణ సంహితాల్లోనూ కనిపిస్తాయి.

English summary

Reasons to worship Lord Vishnu in dhanurmasam

Here we talking about the reasons to worship lord vishnu in dhanurmasam. Read on.
Story first published: Thursday, December 17, 2020, 16:20 [IST]