For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాకులకు పిండప్రదానాలను ఆహారంగా ఎందుకు పెడతారో తెలుసా...

కాకులు పిండాలను ఎందుకు తింటాయో కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

మన దేశంలో హిందూ సంప్రదాయం ప్రకారం అనేక పద్ధతులు, ఆచారాలు ఇప్పటికీ మనుగడలో ఉన్నాయి. అంతేకాదు ఇవి శాస్త్రీయంగా సరైనవని చాలా సందర్భాల్లో నిరూపించబడింది కూడా.

Reasons why crows eat flour in Telugu

ఈ పద్ధతుల వల్ల మానవుల జీవితంలో అనేక ప్రయోజనాలు కూడా ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో మన ఇంట్లో ఎవరైనా పెద్దలు చనిపోయిన మూడో రోజు నుండి పదిరోజులలోపు కాకులకు పిండ ప్రదానం పెట్టడం..

Reasons why crows eat flour in Telugu

అలాగే పితృపక్షాల కాలంలో.. ఏదైనా నదికి పుష్కరాలు వచ్చిన సమయంలోనూ చాలా మంది కాకులకు పిండప్రదానాలు పెట్టడాన్ని మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా కాకులు వాలితే దోషమని.. కాకి కాలితో తంతే వారికి చాలా పెద్ద సంకోభం ఎదురువుతుందని చాలా మంది భయపడిపోతూ ఉంటారు. అంతేకాదు.. కాకి ఇంటి దగ్గర గోడపై వాలి అరిస్తే.. ఇంటికి బంధువులు వస్తారని చాలా మంది నమ్ముతారు.

Reasons why crows eat flour in Telugu

దీని గురించి చాలా మందికి చాలా రకాల సందేహాలు ఉన్నాయి. ఇవన్నీ నిజమేనా.. మూఢనమ్మకాలా అన్న విషయంలో మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ సందర్భంగా కాకులకు పిండప్రదానాన్ని ఎందుకని ఆహారంగా పెడతారు.. అవి కూడా వాటిని ఇష్టంగా ఎందుకని తింటాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మార్గశిర మాసం.. ఎందుకని విలక్షణమైన మాసం అయ్యిందో తెలుసా...!మార్గశిర మాసం.. ఎందుకని విలక్షణమైన మాసం అయ్యిందో తెలుసా...!

కాకి రూపంలో..

కాకి రూపంలో..

మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు వారి ఆత్మలు కాకి రూపంలో వస్తాయని చాలా మందికి నమ్మకం. అంతేకాదు వారు కాకి రూపంలో వచ్చి ఆహారాన్ని తీసుకుంటారని నమ్ముతారు. ఈ ఆనవాయితీని పురాణాల కాలం నుండే పాటిస్తున్నారు.

కర్మకాండలు..

కర్మకాండలు..

మన కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు వారి పేరిట పిండం పెట్టడం అనేది మన ముత్తాతల కాలం నుండి ఒక ఆనవాయితీగా వస్తోంది. కర్మకాండలలో భాగంగా.. కాకులకు ఆహారం పెడుతూ ఉంటారు.

కాకి తింటే..

కాకి తింటే..

అయితే మనం పెట్టిన ఆహారాన్ని కాకులు పూర్తిగా తింటే.. మన పెద్దలు సంతృప్తిగా ఉన్నారని.. ఒకవేళ కాకులు వచ్చి మనం పెట్టిన ఆహారాన్ని ముట్టకపోతే.. వారి కోరికలను మనం నెరవేర్చకపోయింటామని, వారు ఇంకా అసంతృప్తితో ఉంటారని భావిస్తుంటారు. అవేంటో తెలుసుకుని ఆ కోరికలను తీర్చేందుకు ప్రయత్నిస్తారు.

రోలు, రోకలి, తిరుగలిని వివాహ వేడుకలో ఎందుకు ఆరాధిస్తారో తెలుసా...రోలు, రోకలి, తిరుగలిని వివాహ వేడుకలో ఎందుకు ఆరాధిస్తారో తెలుసా...

పురాణాల ప్రకారం..

పురాణాల ప్రకారం..

పురాణాల ప్రకారం రామాయణంలో కాకి గురించి ఓ కథ ఉంది. పూర్వం రావణుడికి భయపడిన యముడు కాకులకు అనేక వరాలు ఇస్తాడు. తాను అందరికీ హాని చేస్తుంటాడు గనుక.. తానే స్వయంగా కాకి రూపం ధరించాడు.

యమలోకంలో..

యమలోకంలో..

యమలోకంలో నరకబాధలను అనుభవించే వారు.. బంధువులు, కుటుంబసభ్యులు ఎవరైనా అలా మరణించి వారికి సమర్పించే ఆహారాన్ని కాకులు తిన్నప్పుడే.. వారికి విముక్తి కలుగుతుంది. యముడు స్వయంగా కాకులకు ఇలాంటి వరాలు ఇవ్వడం వల్లనే.. ఇప్పటికీ చాలా మంది పితృకర్మల సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.

పక్షి జాతికి ఆహారం..

పక్షి జాతికి ఆహారం..

అంతేకాదు.. దీని వెనుక ఓ పరమార్థం కూడా దాగి ఉంది. ఇలా పితృకర్మలు, కర్మకాండల సమయంలోనే కాకుండా.. ఇతర సమయాల్లో కూడా పక్షి జాతులకు ఆహారం అందించాలనే ఈ పద్ధతిని పెట్టారు. అప్పట్లో కాకులే ఎక్కువగా జీవించేవి. అందుకే మన పెద్దలు పిండ ప్రదానం సమయంలో కాకులకు ఎక్కువగా ఆహారాన్ని సమర్పించేవారు. ఇదే ఆనవాయితీ నేటికీ కొనసాగుతోంది.

రాముడి వరం..

రాముడి వరం..

రామాయణం ప్రకారం.. రాముడు ఓ భక్తుడికి ఇలా వరం ఇస్తాడు. మీ పూర్వీకులు కాకి రూపంలో వస్తారని.. వారికి ఆహారం పెడితేనే మీకు పూర్వజన్మ సుక్రుతం లభిస్తుందని చెబుతాడు. రాముడి వరం ప్రకారమే నేటికీ ఆహారం పెడుతూ ఉంటారు.

English summary

Reasons why crows eat flour in Telugu

Here we talking about the reasons why crows eat flour in telugu. Read on,
Story first published:Wednesday, December 16, 2020, 18:02 [IST]
Desktop Bottom Promotion