For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శివుని కంఠం ఎందుకు నీలి రంగులో ఉంటుందో తెలుసా...

కల్పవృక్షం, చింతామణి పీఠాన్ని దేవేంద్రుడు తీసుకున్న తర్వాత క్షీర సాగర మదనంలో విషం బయటకు వచ్చింది.

|

పురాణాల ప్రకారం దేవుళ్లకు ఎప్పటికీ దెయ్యాలు శత్రువులే. మనం ఏ కథను గమనించినా లేదా ఏ యుద్ధాన్ని గమనించినా దేవుళ్లతో ఎందరో రాక్షసులు తలపడేవారు. అయితే ఒకసారి దాయాదులు పోరాటం మానేసి కలిసి పని చేయడానికి అంగీకరించుకున్నారు.

Lord Shivas Throat

ఆ సమయంలో క్షీర సాగర మదనం చేశారు. అందులో నుండి తొలుత కామధేనువు వచ్చింది. అది వశిష్టుడికి ఇచ్చారు. ఆ తర్వాత కల్పవృక్షం వచ్చింది. దానిని దేవేంద్రుడు తీసుకున్నాడు. మరోసారి చింతామణి పీఠం వచ్చింది.

Lord Shivas Throat

దాన్ని కూడా దేవేంద్రుడే తీసుకున్నాడు. మరోసారి చంద్రుడు వచ్చాడు. ఆకాశానికి పంపించేశారు. ఆ తర్వాత ఏమి వచ్చింది? అప్పుడే శివుడు ఎందుకు వచ్చాడు? అప్పటి నుండి శివుడి కంఠం ఎందుకు నీలి రంగులో మారిందో తెలుసుకోవడానికి ఈ స్టోరీని పూర్తిగా చూడండి...

శివుడు యొక్క 19 అవతారాలు మీకు తెలుసా?శివుడు యొక్క 19 అవతారాలు మీకు తెలుసా?

శివుడి నివాసం..

శివుడి నివాసం..

పురాణాల ప్రకారం శివుని నివాసం కైలాస పర్వతం మీద ఉంటుందని అని అందరూ నమ్ముతారు. అయితే అది నిజం కాదని కొందరు చెబుతున్నారు. శివుడి నివాసం మనోమయ అనే ప్రదేశంలో ఉంటుందట. ఇది విశ్వం యొక్క సరిహద్దులో ఉందని మరి కొందరు నమ్ముతున్నారు. అయితే కైలాస పర్వతం అనేది శివుడు మానవులపై నిఘా ఉండచే వేసవి తిరోగమనం లాంటిదట.

మనోమయ అంటే..

మనోమయ అంటే..

శివుడు ధ్యానం చేస్తున్న సమయంలో, అతను మనోమయంలో నివసిస్తున్నాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇంతకీ మనోమయ అంటే

ఏమిటంటే విపరీతమైన సంకల్ప శక్తి అని అర్థం.

విషం బయటకు..

విషం బయటకు..

కల్పవృక్షం, చింతామణి పీఠాన్ని దేవేంద్రుడు తీసుకున్న తర్వాత క్షీర సాగర మదనంలో విషం బయటకు వచ్చింది. దీన్ని చూసి

భయపడిన దేవళ్లందరూ తమను కాపాడమని శివుడిని వేడుకుంటారట.

మహా శివుడు పార్వతికి పెళ్ళైన తర్వాత యోగ నేర్పించాడు. అలా యోగా మొదట ఆవిర్భవించింది అని మీకు తెలుసా?</p><p>మహా శివుడు పార్వతికి పెళ్ళైన తర్వాత యోగ నేర్పించాడు. అలా యోగా మొదట ఆవిర్భవించింది అని మీకు తెలుసా?

శివుడి కంఠం నీలంగా..

శివుడి కంఠం నీలంగా..

అయితే తనను నమ్మి వచ్చిన వారికి న్యాయం చేయాలని ఉద్దేశ్యంతో శివుడు వెంటనే ఆ విషాన్ని మింగేస్తాడట. అయితే అది విషం కాబట్టి కిందకు వెళ్లలేదు. పైకి కూడా రాలేదట. అది శివుడి కంఠంలో అలా ఉండిపోవడం వల్లే శివుడి కంఠం నీలంగా మారిపోయిందట. అప్పటి నుండి శివుడికి నీలకంఠుడు అని పేరు కూడా వచ్చిందట.

అర్ధనాదీశ్వరుడు...

అర్ధనాదీశ్వరుడు...

శివుడు ఒక సమయంలో బ్రహ్మకు ఉపదేశం కలిగించడానికి తను అర్థనాదీశ్వర రూపాన్ని ప్రదర్శించాడట. అందులో పార్వతీ దేవికి సగానికి సగభాగం స్థానం ఇచ్చేస్తాడట. దీని ద్వారా ఆడ, మగవారు ఐక్యత గురించి తెలియజేస్తాడట. అలాగే పునరుత్పత్తి ప్రక్రియని కొనసాగించమని ఆదేశిస్తాడట.

<strong>శివ భగవానుడి గురించి తెలియజేసే 10 వాస్తవాలు!</strong>శివ భగవానుడి గురించి తెలియజేసే 10 వాస్తవాలు!

కొన్ని గ్రంథాలలో..

కొన్ని గ్రంథాలలో..

అయితే కొన్ని గ్రంథాలలో ఇలా ఉంది.శివుడు విషం తీసుకున్న పరిస్థితి చూసి అంతా సర్వనాశనం అయ్యిందట. ఈ సమయంలో పార్వతీదేవి తన మెడను పట్టుకుని విషం ఒళ్లంతా వ్యాపించకుండా అడ్డుకుంటుందట.

ఇందులో నీతి...

ఇందులో నీతి...

శివుడి నీలి కంఠం మనకు ఏమి తెలియజేస్తుందంటే.. జీవితంలో ప్రతి సమస్యను భరించాల్సిన అవసరం లేదు. లేదా విస్మరించాల్సిన అవసరం లేదు. దేన్ని అయినా సమర్థవంతంగా నియంత్రించవచ్చు. హలహాల జీవితంలో ఆ సమస్యను సూచిస్తుంది. హలహాలాన్ని విస్మరిస్తే ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసే అవకాశం ఉంది. మరోవైపు శివుడు విషాన్ని పూర్తిగా తినేస్తే అతను చనిపోయే అవకాశం ఉంది. శివుడి గొంతులో పార్వతీ దేవి ఈ విషాన్ని సమర్థవంతంగా నియంత్రించింది. అంతేకాదు పార్వతీ దేవి ప్రపంచాన్ని మరియు ఆమె భర్తను కూడా కాపాడుతుంది.

English summary

Reasons Why Lord Shiva's Throat To Be Blue

Here are the reasons why lord shiva's throat to be blue. Take a look
Story first published:Friday, January 17, 2020, 18:11 [IST]
Desktop Bottom Promotion