For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోలు, రోకలి, తిరుగలిని వివాహ వేడుకలో ఎందుకు ఆరాధిస్తారో తెలుసా...

వివాహ వేడుక సమయంలో రోలు మరియు రోకలిని ఎందుకు ఆరాధిస్తారో కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

పెళ్లి(Marriage).. అనే బంధంతో ఇద్దరు వ్యక్తులు ఏడడుగులు వేసి ఒక్కటయ్యే అద్భుతమైన ఘట్టం. ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఓ ముఖ్యమైన తంతు అని చెప్పుకోవచ్చు.

Reasons why Rolu and Rokali Are Worshiped during the Wedding Ceremony

అయితే పెళ్లి పేరేత్తగానే.. ఒక్కో చోట ఒక్కో రకమైన సంప్రదాయం ఉండటం మనం చూస్తుంటాం. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే పెళ్లి అంటే ఎంగేజ్ మెంట్, ఇంటి దేవుళ్లను పూజించడం.. గౌరీపూజ, జీలకర్ర బెల్లం, కన్యాదానం, పాణిగ్రహణం, మధుపర్కం, మంగళసూత్ర ధారణ, బ్రహ్మముడి, సప్తపది, నాగవల్లి, అరుంధతీ నక్షత్రం, అప్పగింతలు వంటి ఎన్నో పద్ధతులూ ఉంటాయి.

Reasons why Rolu and Rokali Are Worshiped during the Wedding Ceremony

Image Courtesy

ఇవన్నీ మనలో చాలా మందికి తెలిసిన విషయాలే అయినప్పటికీ.. పెళ్లి సందర్భంగా రోలు మరియు రోకలిని ఆరాధించడం వంటి విషయాల గురించి అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు.

Reasons why Rolu and Rokali Are Worshiped during the Wedding Ceremony

అయితే మన సనాతన ధర్మం ప్రకారం ప్రతి పద్ధతి వెనుక ఆచార, శాస్త్రీయ కారణాలు అనేకం ఉన్నాయి. ఈ సందర్భంగా పెళ్లి సమయంలో రోలు మరియు రోకలిని ఎందుకు ఆరాధిస్తారనే కారణాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అంగారకుడు ఎరుపు రంగులో ఉండటానికి గల కారణాలేంటో తెలుసా...అంగారకుడు ఎరుపు రంగులో ఉండటానికి గల కారణాలేంటో తెలుసా...

సజావుగా సాగుతుందో..

సజావుగా సాగుతుందో..

సనాతన ధర్మం ప్రకారం ‘ఏ ప్రవర్తనా నియమావళి.. మూలసూత్రాలు మరియు ఏ న్యాయం చేత వ్యక్తిగత, సామాజిక, మతపర జీవితం సజావుగా సాగుతుందో దానికి కారణం సర్వ జీవజాలం. ఈ నేచర్ లోని ప్రతి పదార్థం, శక్తి ఒకదానితో ఒకటి అనుసంధానించబడి మనుగడ సాధిస్తాయి.

దేనికి సంకేతాలంటే..

దేనికి సంకేతాలంటే..

ఇక మన తెలుగు రాష్ట్రాల్లో వివాహ వేడుకలో రోలు మరియు రోకలిని విరిగిగా ఉపయోగిస్తుంటారు. అలాగే వాటిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకంటే రోలు, రోకలి, తిరుగలి ఈ మూడు మానవ జీవితంలో ముడిపడి ఉన్నవి. ధాన్యం, జొన్నలు, సజ్జలు, రాగులు, తైదలు, కొర్రలు తదితర ధాన్యాలను బాగా దంచి వంటకు అనువుగా చేసుకుని వండుతారు.

పిండి వంటలను..

పిండి వంటలను..

ఇక కందులు, పెసలు, శనగలు, మినుములను తిరుగలితో విసిరి పప్పులు చేసుకుంటారు. రుబ్బురోలుతో మినపప్పు, ఇతర వాటిని రుబ్బుకుని పిండివంటలు చేసుకుంటారు. ఉదయాన్నే లేచి విసురుకోవటం.. ధాన్యం దంచుకోవడం.. మిరపకాయలు కారం కొట్టుకోవడం.. పసుపు కొమ్మలు, పసుపు కొట్టుకోవడం ఇవన్నీ రెగ్యులర్ గా జరుగుతాయి. ఇలా చేయడం అనేది ఆరోగ్య సూత్రాలలో భాగం. అందుకే అప్పటితరం వారికి రోగాలనేవి ఎక్కువగా వచ్చేవి కావు.

పెళ్లికి ముందే..

పెళ్లికి ముందే..

మన తెలుగు సంప్రదాయం ప్రకారం.. ఎవరి ఇంట్లో అయినా పెళ్లి సెట్ అయ్యిందంటే.. వారి కనీసం రెండు నెలల ముందునుండే వడ్లు దంచుకోవడం, కారం, పసుపు కొట్టుకోవడం, అరిసెల పిండి తయారు చేయడం వంటి వాటిని పది మంది కలిసి చేసేవారు.

ఇప్పుడేమో..

ఇప్పుడేమో..

అయితే ఇప్పుడు మాత్రం అందరూ ఎలక్ట్రానిక్ మెషిన్లపై ఆధారపడుతున్నారు. ప్రతిదీ మార్కెట్ లో మనకు రెడీమెడ్ గా దొరుకుతున్నాయి. కారం, పసుపు, పిండి, చివరికిగా పచ్చడి కూరలు దుకాణాలలోనే కొంటున్నాం. అయితే వారు అందులో ఎంత కల్తీ చేస్తారో.. దాని వల్ల మన ఆరోగ్యానికి ఎంత కష్టం వస్తుందో తెలియదు. అంతేకాదు మందులు వాడిన పంటలను మనం తిని దాంతో పాటు మెడిసిన్ కూడా వాడుతున్నాం.

స్వయంగా సిద్ధం చేసుకోండి..

స్వయంగా సిద్ధం చేసుకోండి..

అందుకే వివాహం, ఉపనయనం వంటి తదితర శుభకార్యాలలో మన సంప్రదాయాన్ని గుర్తు చేయడం, స్వయంగా అన్నింటినీ సిద్ధం చేసుకోవడం వంటివి చేస్తూ ఆరగించేవారు. అలాగే మీరు తినండి.. పది మందికి పెట్టండి అనే రోలు, రోకలి, తిరుగలిని ఆరాధించేవారు. బలరాముడు నాగలిని, రోకలిని ఆయుధాలుగా ధరించాడు.

నిజమైన రైతుకు..

నిజమైన రైతుకు..

నాగలితో భూమిని దున్ని పంటను పండించి, ఆ పంటను రోకలితో దంచి భుజించండి అని చెప్పిన బలరాముడు నిజమైన అన్నదాతకు ప్రతినిధి. రోలు లక్ష్మీదేవి, రోకలి నారాయణుడు, తిరుగలి శివుడు. దాని పిడి పార్వతి ఇలా ఆయా అధిష్టాన దేవతలను ఆరాధించి ధనధాన్యం సమ్రుద్ధిగా కలగాలని ప్రార్థించేవారు.

English summary

Reasons Why Rolu and Rokali Are Worshipped during the Wedding Ceremony

Here we talking about the reasons why rolu and rokali are worshiped during the wedding ceremony. Read on.
Desktop Bottom Promotion