శనిమహాత్మున్ని మెప్పించడానికి హోం రెమెడీస్

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

మీరు జ్యోతిష్కుడిని సందర్శించినపుడు, “మీ చార్ట్ ప్రకారం శని (సాటర్న్) ప్రభావం ఎక్కువగా ఉంది” అనే అత్యంత సాధారణ విషయాన్నీ చెప్తారు. హిందూమతంలో, చాలామంది ప్రజలు సాడే సాత్ (7 న్నర సంవత్సరాలు) శనిదశ ప్రభావాన్ని కలిగి ఉంటారు. ఈ సాడే సాత్ 7 న్నర సంవత్సరాలు ఉంటుంది.

ఈ సమయంలో, ఒక వ్యక్తీ ఒత్తిడికి, బద్ధకం, ఆరోగ్య సమస్యలు, జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కుంటాడు. అయితే, ఈ సాడే సాత్ ని జ్యోతిష్కులు ఎక్కువ ప్రచారం చేసారు.

shani dev

ఒక వ్యక్తికి సాడే సాత్ నడుస్తుంటే, అతను/ఆమె శని దేవుని మెప్పించి, మనసు గెలుచుకోవాలని సూచిస్తారు. జపాలు, మంత్రాలే కాకుండా, శనిదేవుడిని మెప్పించే మరికొన్ని పరిష్కారాలను ప్రయత్నించాలి...

1. ఆవనూనేను దానం చేయడం:

1. ఆవనూనేను దానం చేయడం:

ఆవనూనె శనిదేవునికి ఇష్టం. శనివారం రోజు, రావిచెట్టు దగ్గరికి వెళ్లి, వాటి కొమ్మలపై ఆవనూనె ను పోయండి. హిందువులు రావిచేట్టును పూజిస్తారు ఎందుకంటే ఇది శనిదేవునికి ప్రతీక. సూర్యోదయం ముందే ఈ చెట్టును పూజిస్తే శనిదేవుడు శాంతిస్తాడని నమ్మకం. కాబట్టి, ప్రతి శనివారం, రావిచెట్టు దగ్గరకు వెళ్లి, ఆవనూనేను పోయండి. మీరు నల్ల నువ్వులను కూడా ఇవ్వొచ్చు.

2. పేదలపట్ల శ్రద్ధ:

2. పేదలపట్ల శ్రద్ధ:

పేద, అవసరమైన ప్రజలకు సేవ చేయడాన్ని శనిదేవుడు ఇష్టపడతాడు. మీకు చేతైతే సహాయం చేయండి. ముఖ్యంగా శనివారం రోజు డబ్బు లేదా బట్టలు లేదా మీ బడ్జెట్ లో ఏదైనా సరే. పేదలకు, అవసరంలో ఉన్న ప్రజలకు నల్ల బట్టలను కూడా ఇవ్వొచ్చు.

3. హనుమంతుడిని పూజించడం:

3. హనుమంతుడిని పూజించడం:

శనిదేవుడిని మెప్పించే పరిష్కారాలలో ఒకటి హనుమంతుడు. హిందూ పురాణాల ప్రకారం, రామాయణంలో, హనుమంతుడు రావణుని బారినుండి శనిని రక్షించాడని నానుడి. హనుమంతుని ఆరాధించిన వ్యక్తులకు శనిదేవుని దుష్ప్రభావాలు ఉండవని శని వాగ్దానం చేసాడు. శని దేవుడు చేసిన ఈ వాగ్దానం హనుమంతుని పూజి౦చడం ద్వారా శని హృదయాన్ని గెలుచుకోవడానికి సహాయపడతాయి.

4. నలుపు ధరించడం:

4. నలుపు ధరించడం:

నలుపు శనిదేవుని రంగు. శని నల్ల రంగులో కనిపిస్తాడు. ఆయన విగ్రహాలు నల్లరంగులో ఉంటాయి. శనివారం రోజు నలుపు లేదా ముదురు నీలం దుస్తులు ధరించండి. హిందీ లో శని అంటే శనివారం, అది శనిదేవుని రోజు అని అర్ధం.

5. మందు మానేయండి:

5. మందు మానేయండి:

శనిదేవుడిని మెప్పించే పరిష్కారాలలో మందు మానేయడం కూడా ఒకటి. ఈయనని న్యాయానికి అధిపతిగా భావిస్తారు. ధూమపానం, మద్యపానం లేదా శనిదేవునికి కోపం తెప్పించే నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినడం వంటివి చెడు లక్షణాలు. కాబట్టి, కనీసం సాడే సాత్ సమయంలో నైనా ఈ అలవాట్లను మానేయండి.

6. నిజాయితీగా ఉండడం:

6. నిజాయితీగా ఉండడం:

న్యాయాధిపతిగా, మీ జీవితంలో మీరు నిజాయితీగా ఉండండి. ప్రజలను మోసం చేయడం లేదా బాధపెట్టడం మానేయండి. ఇది ప్రతి వ్యక్తీ గుర్తుంచుకోవాల్సిన ఒక పాఠం.

ఇవే శనిదేవుడిని మెప్పించే కొన్ని పరిష్కారాలు. ఇవికాకుండా, శనివారం రోజు లెదర్, నలుపు రంగు వస్తువులను కొనడం మానేయండి.

English summary

Shani Dev | Impress Shani Dev | Shani Bhagwan

However, this saade saati has been hyped by most of the astrologers. When an individual is going through saade saati, he/she is advised to impress Shani Dev and win his heart. Apart from japs and mantras, you can try few remedies to impress Shani bhagwan.