For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ మంత్రాలను 1100 సార్లు జపిస్తే.. ధనకటాక్షంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయట...!

|

పురాణాల్లోని రామాయణం ప్రకారం రావణుడు ఎంతటి దుర్మార్గుడుగా చిత్రీకరించబడ్డాడో అందరికీ తెలిసిందే. అయితే అత్యంత శక్తివంతమైన, తెలివైన వారిలో రావణుడు కూడా ప్రముఖుడే.

హిందూ పురాణాల ప్రకారం లంకాధిపతి అయిన రావణడు ఎలాంటి శక్తులకు లొంగని రాజుగా వివరించాయి. అంతేకాదు రావణుడు గొప్ప పండితుడుగా, పరమ శివుని భక్తుడిగా, సంగీత విద్వాంసుడిగానూ ఎంతో కీర్తి ప్రతిష్టలను పొందాడు.

అయితే రామాయాణంలో రావణునికి ఒక అపకీర్తి కూడా ఉంది. అదే తన సోదరి మాటలు విని సీతను అపహరించడంతో ఒక్కసారిగా విలన్ గా మారిపోయాడు.

అయితే రావణుడు ఎంత నీచమైన పని చేసినప్పటికీ, తన మేధస్సు, తన రాజకీయ చతురత, పరాక్రమంతో పాటు జ్యోతిష్యశాస్త్రంపై అవగాహనతో ప్రశంసలు అందుకున్నాడు.

ఇలాంటి గుణమే తనకు అపార సంపదలు, దేవతలపై అధిపత్యానికి పండితులు చెబుతుంటారు. అంతేకాదు విశ్వంలోని జ్ణానంతో పాటు అన్ని వేదాలు, శాస్త్రాలను కూడా అవకోశన పట్టాడు. అలాగే తాంత్రిక, జ్యోతిష్యశాస్త్రాలను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ఈ విషయాలన్నీ రావణ సంహితలో వివరించబడ్డాయి.

వాస్తు ప్రకారం ఇవి మీ ఇంటిలో తప్పనిసరిగా ఉంచండి...

వేద ప్రమాణాలను..

వేద ప్రమాణాలను..

బ్రహ్మదేవుని కుమారుడిగా పుట్టిన రావణుడు, సప్త రుషుల్లో ఒకరైన పులస్త్య మహర్షికి స్వయాన మనవడు కూడా. అయితే బ్రహ్మాణుడైన ఈ రావణుడు విక్రుతంగా ఉండటానికి ఆసక్తి చూపాడు. తన విధేయతతో అనేక విజయాలు సాధించడమే కాదు.. అనేక తాంత్రిక, వేద ప్రమాణాలను ప్రదర్శించాడు.

ధనం, కీర్తి..

ధనం, కీర్తి..

రావణ సంహితలో వేద, తాంత్రిక విషయాలను చర్చించాడు. ఎవరైతే భక్తితో వీటిని అనుసరిస్తారో వారికి డబ్బు, గెలుపు, అష్టఐశ్వర్యాలతో పాటు కీర్తి, ప్రతిష్టలు, అధికారం లాంటివి కచ్చితంగా ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంటాయని వెల్లడించాడు.

పవిత్రమైన రావి చెట్టు వద్ద

పవిత్రమైన రావి చెట్టు వద్ద

ఎవరైతే ఆర్థిక పరమైన, సామాజిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో.. వారు ఓ పండితుడి సహాయంతో మంచి ముహుర్తంలో ఈ పూజను నిర్వహించాలని తెలిపాడు. పవిత్రమైన నది లేదా కోనేరు సమపీంలోని రావి చెట్టు కింద పూజను ప్రారంభించాలని వివరించాడు.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మీరు ఎలాంటి వివాహం చేసుకుంటారో మీకు తెలుసా?

1100 సార్లు ఈ మంత్రాన్ని..

1100 సార్లు ఈ మంత్రాన్ని..

పూజ ప్రారంభానికి ముందు పవిత్రమైన నీటిలో స్నానం చేసి రావి చెట్టు కింద కూర్చుని ‘‘ఓం హ్రీం క్లీం నమః ద్వాహ ద్వాహ స్వాహా'' అనే మంత్రాన్ని 1100 సార్లు జపించాలి. ఇలా 21 రోజుల పాటు ఎలాంటి అంతరాయం లేకుండా చేయాలి. ఒకవేళ మధ్యలో ఆపితే, మళ్లీ మొదటి నుండి ఆరంభించాలి.

నిర్మలమైన భక్తితో..

నిర్మలమైన భక్తితో..

ఉత్తరేణి మొక్క విత్తనాలను నూర్పిడి చేసి, అందులోకి మేక పాలను కలిపి శరీరానికి రాసుకుంటే, మంచి సువాసన వస్తుంది. ఇది దేవతలను ఆకర్షిస్తుంది. అంతేకాదు ఈ ప్రపంచం నుండి మిమ్మల్ని వేరు చేస్తుంది. ఆ సమయంలో మీరు నిర్మలమైన భక్తితో శ్రీసూక్త పాఠాన్ని పఠించాలి.

లక్ష్మీకటాక్షం..

లక్ష్మీకటాక్షం..

ఎవరైతే భక్తి పారవశ్యంతో శ్రీసూక్తాన్ని పఠించినవారికి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఇది పూర్తయిన తర్వాత నాలుగు నుండి ఏడు మారేడు దళాలు లేదా తమలపాకులను శివలింగానికి సమర్పించాలి.

21 రోజుల పాటు..

21 రోజుల పాటు..

ఇలా 21 రోజుల పాటు ఎలాంటి ఆటంకం లేకుండా చేయాలి. ఒకవేళ ఇలా చేయడానికి వీలుపడని వాళ్లు జిల్లేడు పూలను, తెల్ల ఆవుపాలతో కలిపి నుదుటిపై తిలకంగా పెట్టుకోవాలి. జిల్లేడు పూలు దొరకకపోతే గరికపూసలు, ఆవుపాలను కలిపి రోజూ తిలకంగా పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

English summary

Remedies to growth your wealth and social status

Here are the remedies to growht your wealth and social status.Take a look.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more