బాల గోపాలుడ్ని పూజించటానికి ఆచారాలు

Posted By: Deepthi TAS
Subscribe to Boldsky

చాలామంది హిందూ ఇళ్ళలో బాల గోపాలుడ్ని పూజించటం ఆనవాయితీగా ఉంటుంది. ఈ చిన్ని శ్రీ కృష్ణుడ్ని తమ ఇంటిలోని సభ్యుడిగానే భావిస్తారు. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులను ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో, దేవుడ్ని కూడా అలానే చూడాలి.

శ్రీ కృష్ణ భగవానుడి బాల్య రూపం బాల గోపాలుడు లేదా లడ్డూ గోపాలుడు. ఆయన కుటుంబంలో అందరికన్నా అందంగా, ముద్దుగా కన్పించే బాబు. అందుకే ప్రతి కుటుంబంలో పిల్లల్ని ఎంత అపురూపంగా చూస్తారో అంత బాగా తనని కూడా చూస్తారు. ఇంట్లో బాల గోపాలుడి ఆనవాయితీ ఉంటే, అతన్ని పూజించటానికి మీరు అన్ని విధానాలు, సంప్రదాయాలు పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే బాల గోపాలుడు శ్రీ కృష్ణభగవానుడి రూపమే మరియు అతను మన కుటుంబాలలో మొదటి సభ్యుడు కదా!

బాల గోపాలుడ్ని పూజించటానికి మీరు మొదట అతనికి స్నానం చేయించి, పిల్లల లాగానే నైవేద్యం తినిపించాలి. ఇక్కడ ఇంట్లో లడ్డూ గోపాలుడ్ని పూజించే కొన్ని ఆచారాలు రాయబడ్డాయి. అవేంటో చదివి పాటించండి.

లడ్డూ గోపాల్ కి స్నానం

లడ్డూ గోపాల్ కి స్నానం

బాల గోపాలుడ్ని రోజూ స్నానం చేయించి తయారుచేయాలి. దేవతా విగ్రహాన్ని రోజూ స్నానం చేయించటం కుదరకపోతే, కనీసం వారంలో ఒకసారైనా చేయండి. ప్రతి నెలా ఏకాదశి నాడు బాలగోపాలుడ్ని తయారుచేసి పూజించాలి.

స్నానానికి అవసరమైన వస్తువులు

స్నానానికి అవసరమైన వస్తువులు

మీ బాల గోపాలుడి స్నానానికి అవసరమైన వస్తువులు ఏంటంటే ;

గంగా జలం లేదా గంగా నది నుంచి నీరు

తులసి ఆకు

గంధం పేస్టు

పంచామృతం

సుగంధ నూనె

కాటన్ దూది లేదా తువ్వాలు

అద్దం

నగలు

దేవతా విగ్రహానికి దుస్తులు

పువ్వులు

అగరుబత్తులు

నెయ్యి దీపం

భోగ్ లేదా నైవేద్యం

బట్టలు

లడ్డూ గోపాల్ ను గంగా జలం, తులసి ఆకు, పంచామృతం, నూనె మరియు గంధంతో స్నానం చేయించాక, శుభ్రమైన తువ్వాలు లేదా దూదితో తుడవండి. దాని తర్వాత కొత్త బట్టలు వేసి, నగలతో అలంకరించండి. తయారుచేసాక తనకి అద్దాన్ని చూపించాలి. అప్పుడు తన కోసం తయారుచేసిన నైవేద్యాలు సమర్పించండి.

నైవేద్యం

నైవేద్యం

భోగ్ అంటే నైవేద్యం పెట్టడానికి చేసిన ఆహార వంటకాలు. భగవాన్ శ్రీ కృష్ణుడికి పాలంటే చాలా ఇష్టం కనుక, ఇతర పదార్థాలన్నిటితో పాటు పాలను ఒక గిన్నెలో తప్పక సమర్పించండి.

దీపం వెలిగించటం

దీపం వెలిగించటం

నైవేద్యం పెట్టేసాక, దేవతా విగ్రహం ముందు నేతి దీపాన్ని, అగరుబత్తులతో పాటు వెలిగించాలి. ఇంకా ఈ కింది

మంత్రాన్ని జపించాలి.

మంత్రాన్ని జపించాలి.

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

హరే రామ్ హరే రామ్ రామ్ రామ్ హరే హరే

English summary

Bal Gopal Worship | Laddu Gopal Worship | Worship Bal Gopal At Home

For Bal Gopal worship you have to bathe Him and feed Him like a child. Here are a few rituals you should follow for Laddu Gopal worship at home. Take a look.
Story first published: Tuesday, February 6, 2018, 13:00 [IST]