Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
గణేష చతుర్థిన బుక్స్ పూజిస్తే జ్ఝాపకశక్తి పెరుగుంది, బ్రెయిన్ షార్ప్ గా ఉంటుంది.!
గణేశుని ప్రతిమ నుంచి పత్రిని సేకరించి పూజించడం వరకూ... వినాయకచవితి ప్రతి అంశంలోనూ భక్తి మాత్రమే కాదు, విజ్ఞానమూ ఉంది. ప్రకృతి స్పృహ ఉంది. అందుకే ఇది పిల్లలకు పాఠాలు చెప్పే పండుగ. కంప్యూటర్ ఓపెన్ చేసి, మౌస్‌తో క్లిక్ చేస్తే చాలు మనం కావాలనుకున్న చోటికి వెళ్లిపోతాం. ప్రపంచమంతా మౌస్ మీద నడుస్తోంది. నేడే కాదు పురాణకాలంలో కూడా మౌస్ (ఎలుక) దే ఆధిపత్యం. వినాయకుని వాహనం అయిన మౌస్ (ఎలుక) ఎక్కడికి కావాలంటే అక్కడకు అయనను తీసుకువెళ్లేది. కంప్యూటర్ మౌస్ పిల్లలకు ఎంత అవసరమో, మౌస్ వాహనంగా ఉన్న వినాయకుడి ముందు భక్తి శ్రద్ధలతోఉండడం అంతే అవసరం. సర్వవిఘ్నాలను విఘ్నేశ్వరుడు తొలగిస్తాడు. అందుకే వినాయకచవితి పెద్దలకే కాక పిల్లల పండుగ కూడా అయింది.
తుండమునేకదంతము దోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడిపార్వతీ తనయ యోయి గణాధిపా నీకు మ్రొక్కెదన్...
అంటూ పిల్లల చేత గణనాయకునికి ప్రార్థనలు చేయిస్తారు. ఆరంభించిన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని ముందుగా గణనాయకుడిని ప్రార్థించండం మన సంప్రదాయం. పిల్లలు అత్యుత్సాహంతో జరుపుకునే పండుగ వినాయకచవితి. పండుగనాడు ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకుని, వినాయకుడిని ఎంతో అందంగా అలంకరిస్తారు. విగ్రహాన్ని రకరకాలుగా తయారుచేసుకుంటారు. కంప్యూటర్ ముందు కూర్చున్న వినాయకుడు, రకరకాల కూరగాయలతో వినాయకుడు, ఆకులతో, పండ్లతో, డ్రైఫ్రూట్స్‌తో... ఎవరికి తోచిన ఆకృతిలో వారు ఆ గణనాయకుని పూజిస్తారు.ప్రతిమను ఉంచే గదిని సైతం తీర్చిదిద్దుతారు. గణేశ్ బర్త్‌డే అంటే పిల్లలకి అంత క్రేజ్ మరి. నేపాల్, చైనా, జపాన్, జావా దేశాలలో, ఇంకా జైన బౌద్ధులు సైతం వినాయకుడిని కొలుస్తారు.

పూజలోని ఆంతర్యం...
విద్యార్థులకు చదువులో ఎన్నో ఆటంకాలు కలుగుతుంటాయి. వాటిని అధిగమించడానకి వినాయకుని తలను పూజించాలి. మెదడు ఎంత చురుకుగా పనిచేస్తే విద్య అంత చక్కగా ఒంటపడుతుంది. అందుకే తలను పూజించాలని చెబుతారు. చిన్న చిన్న విషయాలను జాగ్రత్తగా వింటూ అర్థం చేసుకునే శక్తి కోసం ఆయనకున్న చిన్న కళ్లను పూజించాలి. దేనినైనా సూక్ష్మంగా చూడవలసి వచ్చినప్పుడు క ళ్లను చిన్నవిగా చేస్తాం. అందుకే గణనాథుని కళ్లు చింతాకులంత చిన్నవిగా ఉంటాయి.

పుస్తక పూజ...
విద్యార్థులు తమ పుస్తకాలన్నిటినీ వినాయకుడి దగ్గర ఉంచుతారు. వాటి మీద పసుపుతో స్వస్తిక్ గుర్తును రాసి పూజ చేస్తారు. ఇలా చేయడం వల్ల చదువు బాగా వస్తుందని పెద్దల నమ్మకం. అయితే ఏదో మొక్కుబడిగా కాకుండా, పండుగలోని సామాజికస్పృహను, అంతరార్థాన్ని పెద్దలు పిల్లలకు వివరించి చెప్పాలి.

వినాయకునికున్న చేటంత చెవులను పూజించాలి.
అన్ని విషయాలను ఏకాగ్రతతో వినడానికి వినాయకునికున్న చేటంత చెవులను పూజించాలి. అందుకే ఎవరైనా ఏదైనా విషయం చెప్పేటప్పుడు, ‘చెవుల్ని చేటల్లా చేసుకుని విను' అనే మాట వాడుకలోకి వచ్చింది. పిల్లలు ఎప్పుడూ తమను తాము కించపరచుకోకుండా ఉండే లక్షణం కోసం ఆత్మగౌరవ చిహ్నమైన తుండాన్ని పూజించాలి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కనుక ఆ లక్షణాన్ని వినాయకుని ద్వారా తెలుసుకోవడానికి నోటిని పూజించాలి.

ధర్మార్థ కామ మోక్షాలను సాధించడానికి
వినాయకుడి నోరు తొండం కింద దాగి ఉంటుంది. అంటే నోటిని అదుపులో ఉంచుకోమని చెప్పడమేనని అర్థం చేసుకోవాలి. చదువుకునేటప్పుడు, ‘నేర్చుకున్నది చాలులే' అని తృప్తి చెందక మరింత జ్ఞానాన్ని సంపాదించడానికి ఆయన బొజ్జను అర్చించాలి. ధర్మార్థ కామ మోక్షాలను సాధించడానికి ఆయనకున్న నాలుగు చేతులను పూజించాలి. ఆటంకాలు కలిగినప్పుడు కుంగిపోకుండా, మనోబలం చేకూరాలంటే విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుని ధ్యానించాలి.

వాహనం...
అన్నిటి కంటె విచిత్రమైన విషయం వినాయకుడి వాహనం అయిన ఎలుక. మిగతా దేవ తల వాహనాలతో పోలిస్తే అతి సామాన్యమైన వాహనం. అనవసరమైన కోర్కెలను అదుపులో ఉంచుకోవడం అలవర్చుకోవడం కోసం ఆ ఎలుకను తప్పనిసరిగా ప్రార్థించాలి.



Click it and Unblock the Notifications
