For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రామకోటి విశిష్టిత? రామకోటి రాయడానికి పాటించాల్సిన నియమాలు

|

చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం ఏకైన మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటే 'రామ' అనే పేర్లు లక్ష కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది. 'రామకోటి' రాయడం అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారం. చాలామంది శ్రీరామనవమినాడు రామకోటి రాయడం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమి నాడు ముగిస్తారు. శ్రీరామ నవమి రోజే కాకుండా ఎప్పుడైనా శ్రీరామకోటి రాయడం మొదలుపెట్టవచ్చు.

సమస్త పాపాలను హరించివేసి ... సకల పుణ్య ఫలాలను అందించే శక్తి ఒక్క రామ నామానికి మాత్రమే వుంది. రామ అనే రెండు అక్షరాలు ధర్మ మార్గాన్ని సూచిస్తాయి ... మోక్షమార్గాన పయనించడానికి కావలసిన అర్హతను సంపాదించి పెడతాయి. దేవుడు ఒక్కడే అయితే ఆ ఒక్కడూ రాముడేననిపిస్తుంది. దేవుడు పలు రూపాలు ధరిస్తే అందులో రాముడి రూపమే మనసుకు మరింత దగ్గరగా వుంటుంది.

శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారాలలో కొన్నింటి గురించి కొంతమందికి తెలియక పోవచ్చునేమో గానీ, రామావతారం గురించి తెలియని వారు వుండరు. అంతగా రాముడు అందరికీ దగ్గరయ్యాడు ... మది మదిలో మధురంగా మోగే మంత్రమయ్యాడు. అలాంటి రాముడి అనుగ్రహం కోసం పూర్వం 'రామకోటి' రాసేవారు. ఇలా రాసినవి ఆయా దేవాలయాలోని రామకోటి స్తంభాల్లో నిక్షిప్తం చేసేవారు.

జీవితమనే ప్రయాణంలో పెరిగిన వేగం వలన ఇప్పుడు రామకోటి రాసే వారి సంఖ్య తగ్గిందే గాని, పూర్తిగా కనుమరుగు కాలేదు. రామకోటి రాయడానికి ప్రతి రోజు ఒక సమయం పెట్టుకుని, తూర్పు దిశగా కూర్చుని రాయాలి. ప్రతి రోజు రామకోటి రాసే ముందు మనసులోనే ఆయనకు నమస్కరించాలి. అనుకున్నన్ని సార్లు రామకోటిని రాసి పూర్తి చేశాక, 'శ్రీ రామ శరణంమమ' అనే అష్టాక్షరీ మంత్రంతో ఉద్యాపన చెప్పుకోవాలి. వీటితో పాటు రామకోటి రాయడానికి మరికొన్ని నియమాలున్నాయి అవేంటో తెలుసుకుందాం..

మీరుకోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి?

మీరుకోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి?

రామకోటి రాయడానికి పూనుకోవడం ఓ మంచి కార్యం. అయితే రామకోటి రాయడానికి కొన్ని నియమాలు పాటించాలని పండితులు అంటున్నారు.

మీరుకోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి?

మీరుకోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి?

అలాగే రామకోటిని గ్రీన్ ఇంక్‌లో రాయడం సత్ఫలితాలను ఇస్తుంది. రామకోటి అంటే కోటి సార్లు కాకపోయినా వెయ్యి లేదా రెండు వేల సార్లు "శ్రీరామ జయం" అని రాయటం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. పచ్చరంగు శ్రేయస్సుకు సూచకమని అందుకే రామ కోటిని ఆ రంగు పెన్నులతో రాయాలని పండితులు సూచిస్తున్నారు.

మీరుకోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి?

మీరుకోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి?

రామకోటి రాయాలనుకునేటప్పుడు దేవుడి వద్ద మానసికంగా సంకల్పం చేసుకోండి. శ్రీరామ అని రాసే వీలున్న కోటి గళ్ళు ఉన్న పుస్తకం తెచ్చుకోండి. లేదా మీరే ఒక తెల్లకాగితాలతో పుస్తకం తయారుచేసుకోండి.

మీరుకోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి?

మీరుకోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి?

మంచి రోజు చూసుకుని పుస్తకానికి పసుపు, కుంకుమ రాసి దేవుని సన్నిధిలో ఉంచి పుష్పాలతో, శ్రీ రామ అష్టోత్తరశతనామావళితో పూజించండి. తరవాత పుస్తకం కళ్ళకద్దుకుని రాయడం ప్రారంభించండి.

మీరుకోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి?

మీరుకోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి?

రామకోటి రాసేటప్పుడు ఇతర వ్యాపకాలు, ఆలోచనలు పెట్టుకోకూడదు. మనస్సు స్థితిమితంగా శ్రీరామ అనుకుంటూ మనసును కేంద్రీకరించి రాయండి.

మీరుకోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి?

మీరుకోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి?

అనుకోకుండా మధ్యలో ఏదైనా పని మీద వెళ్ళవలసి వస్తే ఒక సరి సంఖ్యలో రాయడం ఆపి పుస్తకం మూసి నమస్కరించి వెళ్ళండి. పని అయిపోయిన తర్వాత కాళ్ళు , చేతులు కడుక్కొని శుచిగా మళ్ళీ రాయడం మొదలుపెట్టండి.

మీరుకోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి?

మీరుకోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి?

రామకోటి రాసే పుస్తకం జాగ్రత్తగా భద్రపరచండి. అందులో ఇతర విషయాలు ఏవీ రాయకూడదు. దానికి ఉపయోగించేకలాన్ని కూడా విడిగా ఉంచుకోవడం శ్రేయస్కరం.

మీరుకోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి?

మీరుకోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి?

రామకోటి రాయడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏదీ లేదు. కాని శుచి, శుభ్రత, పవిత్రత, ప్రశాంతత మాత్రం తప్పక పాటించాలి. ఒకవేళ ఎప్పుడైనా నిద్రవస్తుంది అనుకుంటే బలవంతంగారాయకుండా ఆపేయాలి.

మీరుకోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి?

మీరుకోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి?

ప్రతి లక్ష నామాలకు ప్రత్యేక పూజ, నివేదన చేసి ప్రసాదాన్ని పంచాలి. రామకోటి రాయడం పూర్తీ అయిన తర్వాత శక్తి అనుసారంగా పూజ, నివేదనలు సమర్పించి ఆరాధన చేయడం మంచిది.

మీరుకోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి?

మీరుకోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి?

పూర్తయిన రామకోటి పుస్తకాన్ని పసుపు బట్టలో కట్టి భద్రాచలంలోని రామచంద్రుడికి సమర్పించాలి. లేదా ఏదైనారాముని గుడిలో సమర్పించండి. లేదంటే నదిలో వదలండి.

మీరుకోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి?

మీరుకోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి?

ఇలా రామకోటిని నిష్ఠతో రాస్తే మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు.

మీరుకోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి?

మీరుకోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి?

ఏదైనా ఒక కార్యం పూర్తవ్వాలని సంకల్పించుకుని రామకోటి రాయడం ప్రారంభిస్తే అది తప్పక జరిగి తీరుతుందని పురోహితులు అంటున్నారు.

మీరుకోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి?

మీరుకోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి?

శుచిగా లేని సమయాల్లోను ... మైల సమయాల్లోనూ రామకోటి రాయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.

English summary

Rules and Regulations of Sri Ramakoti Writing

Writing name of Sri Rama one crore times(rama koti) or Likhita Japam is a mantra meditation.Likhitam Japam is an extremely effective spiritual practice that consists of writing down a fixed amount of ‘Sri Rama Jayam’ mantra or the name of Lord Sri Rama in a book.
Story first published: Friday, July 29, 2016, 16:26 [IST]
Desktop Bottom Promotion