For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీపావళి రోజున ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీ దేవి కటాక్షం మీ సొంతం..

|

హిందూ సంస్కృతి, సాంప్రదాయాలలో దీపాలకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. మన దేశంలో హిందువులందరు దీపాలను వెలిగించకుండా ఏ ఒక్క పూజా కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయలేరు. ఏ పూజ చేసే సమయంలో అయినా హిందువులు కచ్చితంగా దీపాలను వెలిగించి తీరతారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న దీపాల పండుగను దీపావళి అని కూడా పిలుస్తారు. మనం వెలిగించే ప్రతి ఒక్క దీపం జ్ఞానంతో నిండిన ఆత్మను సూచిస్తుంది. మనకు జ్ఞానం ఉన్నప్పుడల్లా మన ఆత్మ కాంతితో నిండి ఉంటుందని, ఏదైనా క్లిష్ట పరిస్థితిని సులభంగా ఎదుర్కోగలమని నమ్ముతారు. కాని జ్ఞానం యొక్క కాంతి ఆత్మలో లేనప్పుడు జీవితంలో చీకటి అలముకుంటుంది.

Diwali

ఇక ఈ పండుగను జరుపుకునేందుకు హిందువులందరు దీపాలను వెలిగించి తమ ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. లక్ష్మీదేవి మరియు విఘ్నేశ్వరుని కటాక్షం కోసం ఎదురుచూస్తారు. కానీ, మీరు వెలిగించే దీపాల విధానం అందులో మీరు ఉపయోగించే నూనె సానుకూలతను ప్రభావితం చేస్తాయని మీకు తెలుసా? అంతేకాదు లక్ష్మీదేవిని సైతం ప్రసన్నం చేసుకోవడంలో ఇవి కీలకం అని మీకు తెలుసా? అయితే మీకు సహాయం చేసేందుకు మేము ఈరోజు అద్భుతమైన విషయాలతో మీ ముందుకు వచ్చాం. దీపావళి సందర్భంగా దీపాలను ఎలా వెలిగించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించుకుందాం.

1) దీపాలలో ఉపయోగించాల్సిన నూనె రకాలు..

1) దీపాలలో ఉపయోగించాల్సిన నూనె రకాలు..

దీపావళి పండుగ సమయంలో దీపాలను వెలిగించేందుకు చాలా మంది అనేక రకాల నూనెలను ఉపయోగిస్తుంటారు. ప్రతి ఒక్క నూనెకు ఒక ప్రాముఖ్యత ఉంది. అవేంటో ఈరోజు తెలుసుకుందాం.

2) నెయ్యి..

2) నెయ్యి..

హిందువులు నెయ్యిని పవిత్రంగా భావిస్తారు. దీపాలను వెలిగించేందుకు చాలా మంది నెయ్యిని ఉపయోగిస్తారు. ఇది మీ కుటుంబంలో వెలుగులు నింపి, ఆరోగ్యం, ఆనందం మరియు శ్రేయస్సును నిర్ధారిస్తుంది. కాబట్టి మీ కుటుంబంలో ఆనందం లేకుండా, చీకట్లు వంటివి ఏమైనా అలుముకుంటే మీరు నెయ్యితో కూడిన దీపాలను వెలిగించవచ్చు.

3) నువ్వుల నూనె..

3) నువ్వుల నూనె..

దీపావళి పండుగకు ఈ నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే మీ జీవితంలో మిమ్మల్ని వెంటాడే సమస్యలు మరియు అన్ని రకాల అడ్డంకులు మరియు చెడు ప్రభావాలు తొలగిపోయేందుకు సహాయపడతాయి. తమకు ఎలాంటి శని దరి చేరకుండా ఉండేందుకు నువ్వుల నూనెను ఉపయోగిస్తారు. అలాగే మీరు దీపావళి సమయంలో లక్ష్మీదేవి, గణేశుడి ఆశీస్సులు కూడా పొందవచ్చు.

3) ఆముదం నూనె..

3) ఆముదం నూనె..

ఈ పండుగ సమయంలో మీరు ఈ నూనెను వాడితే మీకు విజయం మరియు కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ దీపావళికి ఆముదం నూనెను ఉపయోగించడం మంచిది. ఈ నూనెను వాడటం ద్వాారా ఆనందం పొందడంలో మరియు మనశ్శాంతిని పొందడంలో సహాయపడుతుంది.

4) కొబ్బరినూనె..

4) కొబ్బరినూనె..

కొబ్బరినూనె విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం. ఇది వినాయక స్వామిని సంతోషపెట్టడానికి మరియు ఆ దేవుని ఆశీర్వాదం పొందడంలో మీకు సహాయపడుతుంది. అంతేకాదు తన భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తొలగిపోయేలా ఆ దేవుడు సహాయపడతారు.

5) వేప నూనె..

5) వేప నూనె..

మీ కుటుంబ సభ్యులు కఠిన సమయాన్ని ఎదుర్కొంటుంటే దీపాలను వెలిగించేందుకు ఈ వేప నూనెను వాడండి. దీని వల్ల మీ ఇంట్లో ప్రతికూలతలు తొలగిపోవడమే కాకుండా, గణేశుడిని ప్రసన్నం చేసుకోవడం కూడా ఇది మీకు సహాయపడుతుంది.

6) దీపంలో ఉపయోగించాల్సిన వత్తులు..

6) దీపంలో ఉపయోగించాల్సిన వత్తులు..

పై భాగంలో దీపాలకు ఎలాంటి నూనెను ఉపయోగించుకున్నారో తెలుసుకున్నారు కదా. అలాగే ఇప్పుడు ఆ నూనెకు తగ్గట్టు దీపానికి కావాల్సిన వత్తులు తయారు చేసుకోవాలి. అవి కూడా చాాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. వాటి ద్వారా కూడా లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవచ్చు.

7) రోజ్ వాటర్ విక్..

7) రోజ్ వాటర్ విక్..

ఈ రంగులో ఉండే వత్తి(విక్) మీకు శాంతిని కలిగించడంలో సహాయపడుతుంది. అంతేకాక లక్ష్మీదేవిని ఆనందపరుస్తుంది. ఈ రకమైన వత్తుల కోసం మీరు రోజ్ వాటర్లో తెల్లటి కాటన్ వస్త్రాన్ని ముంచాలి. ఆ తరువాత మీరు వస్త్రాన్ని ఆరబెట్టి దాని నుండి వత్తిని తయారు చేయాలి. ఆ తర్వాత దీనితో దీపాలను వెలిగించండి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. మీరు ఆనందంగా ఉండండి.

8) అరటి వత్తులు..

8) అరటి వత్తులు..

మీరు ఎప్పుడైనా అనుకోకుండా ఏవైనా పొరపాట్లు లేదా తప్పులు చేసినప్పుడు క్షమాపణ కోరడానికి మరియు పూర్వీకుల శాపాల నుండి విముక్తి పొందడానికి, మీరు అరటి కాండం యొక్క ఫైబర్ తో తయారైన వత్తులను ఉపయోగించవచ్చు.

9) కాటన్ విక్..

9) కాటన్ విక్..

ఈ దూదితో తయారైన వత్తులు దాదాపు అందరి ఇళ్లలోనూ పుష్కలంగా లభిస్తాయి. వీటి కోసం మీరు చేయాల్సిన పని గురించి మీకు ఇది వరకే తెలిసింటుంది. కానీ తెలియని వారి కోసం ఈ విషయం చెబుతున్నాం. మీరు శుభ్రమైన పత్తి లేదా దూదిని తీసుకుని వత్తిని తయారు చేసుకోవాలి. దీని ద్వారా దీపాలను వెలగించాలి.

10) పసుపు, ఎరుపు వత్తులు

10) పసుపు, ఎరుపు వత్తులు

మీరు వైవాహిక జీవితంలో ఆనందం కావాలని కోరుకుంటే పసుపు వత్తుల దీపాలను వెలిగించాలి. ఇవి అన్ని రకాల సమస్యలను తొలగించడంలో మీకు సహాయపడతాయి. అలాగే మీరు వివాహ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే, మీకు సంతానం లేకపోతే ఎర్రటి వస్త్రంతో తయారు చేసిన వత్తులను ఉపయోగించాలి. వీటి వల్ల మీకు ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి.

11) దీపాలను ఉంచాల్సిన దిశలు..

11) దీపాలను ఉంచాల్సిన దిశలు..

ఉత్తర దిక్కున : పైవన్నీ పూర్తయ్యాక దీపాలను మీరు ఏ దిశలో ఉంచుతున్నారో ముందుగానే నిర్ధారించుకోవాలి. దీపాలను ఉత్తర దిశలో దీపాలను వెలిగించి ఉంచినప్పుడు మీరు లక్ష్మీ దేవి నుండి సంపద మరియు శ్రేయస్సును పొందుతారు. అలాగే ఆమె తన భక్తులకు అష్ట ఐశ్వర్యాలు కలిగేలా ఆశీర్వదిస్తుంది.

12) తూర్పు దిశలో..

12) తూర్పు దిశలో..

ఈ దిశలో దీపాలను వెలిగించి ఉంచడం ద్వారా మీరు ఏదైనా అనారోగ్యానికి నిరంతరం గురవుతుంటే వాటి నుండి బయటపడటానికి ఇవి దోహదం చేస్తాయి. అలాగే మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది.

13) పశ్చిమ దిశలో..

13) పశ్చిమ దిశలో..

మీరు దీపాలను పశ్చిమ దిశలో ఉంచినప్పుడు మీరు మీ శత్రువులపై విజయం పొందేలా ఆశీర్వదించబడతారు.

14) దక్షిణ దిశలో..

14) దక్షిణ దిశలో..

దీపావళి పండుగ సమయంలోనే కాదు ఏ సమయంలో అయినా దీపాలను పొరపాటున కూడా ఈ దిశలో ఉంచకండి. ఎందుకంటే ఈ దిశలో దీపాలను పెడితే దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది. అందువల్ల ఈ దిశలో ఎప్పటికీ దీపాలను పెట్టకండి. అలాగే పొద్దుతిరుగుడు మరియు వేరుశనగ నూనెలను దీపాలకు వాడకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఇవి వాడితే పేదరికం మరియు మీ కుటుంబంలో విభేదాలు రావొచ్చు. ఇంకా మీ చేతుల్లో మిగిలిన నూనెను రుద్దడం, దీపాలను వెలిగించిన తర్వాత మీ వెంట్రుకలు పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఇది సంపదను కోల్పోవడాన్ని సూచిస్తుంది. దీని కోసం మీరు నూనెను తుడుచుకునేందుకు ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ ను ఉపయోగించాలి.

మీరు ఈ దీపావళి ఆనందంగా మరియు ఘనంగా జరుపుకోవడానికి పై సమాచారం మీకు సహాయపడుతుందని భావిస్తున్నాం. ముందుగా బోల్డ్ స్కై తెలుగు తరపున దీపావళి శుభాకాంక్షలు

English summary

Diwali 2019: Rules To Follow While Lighting Diyas To Please Goddess Lakshmi On Deepawali

Diya signifies soul filled with wisdom and it is believed that whenever we have knowledge our soul is full of light and we can deal with any difficult situation easily, but whenever light of wisdom is not present in the soul, darkness comes in life. Therefore, the practice of lighting diyas is symbolical.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more