For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంక్రాంతి స్పెషల్ 2020 : బరిలో దిగే పందెం కోళ్లను ఎలా సిద్ధం చేస్తారో తెలుసా...

ఈసారి పోటీలకు విదేశీ కోళ్లను కూడా బరిలోకి దింపనున్నారు. ఇక ఉత్తరాంధ్ర ప్రజలు ఈ కోడి పుంజులలో కొన్నింటిని మన పక్క రాష్ట్రమైన ఒడిశా రాష్ట్రం నుండి వేల రూపాయలను వెచ్చించి మరీ తెచ్చుకుంటారు.

|

మన దేశంలో హిందువులకు సంక్రాంతి పండుగ అంటే రంగు రంగుల ముగ్గులు. గొబ్బెమ్మలు.. హరిదాసులు.. పిండి వంటలు..కొత్త బట్టలు ఇంకా ఎన్నెన్నో ఉంటాయి. అయితే ఉత్తరాంధ్ర, కోనసీమ జిల్లాల్లో మాత్రం వీటితో పాటు కోళ్ల పందాలు, గుండాటలు జోరుగా సాగుతాయి.

Sankranti Special 2020

అక్కడ కోడి పందేలను సంప్రదాయ క్రీడగా భావిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలను నిర్వహిస్తారు.

Sankranti Special 2020

భోగి, సంక్రాంతి, కనుమ పండుగ రోజులలో ఆ ప్రాంతాల్లో కోళ్ల పందేల పోటీలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ పోటీలకు ఏయే జాతి కోళ్లను వాడతారు? వాటిని ఎక్కడి నుండి తెప్పిస్తారు? వాటికి ఎలాంటి ఆహారం ఇస్తారు అనే విషయాలను ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం...

కోడి పుంజుల్లో జాతులు..

కోడి పుంజుల్లో జాతులు..

ఆంధ్రప్రదేశ్ లో పందెం కోళ్లలో దాదాపు 50 రకాల జాతులు ఉన్నాయి. అవి ఏంటంటే.. కాకి రాయి, ఎర్ర నెమలి, కాకి నెమలి, డేగ, మైలా, రాసింగి, పచ్చకాకి, కాకి, నెమలి, పర్ల, సేతువు, పూల, పింగళి, కౌజు, నల్లమచ్చల, సేతువు, ఎర్రబోరా, నల్లబోరా, కొక్కిరాయి, నల్ల సవలతో పాటు ఇంకా అనేక రకాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ప్రాంతాల్ని బట్టి పేర్లు మారిపోతూ ఉంటాయి. అయితే వీటిలో కాకి, డేగ, నెమలి వంటి జాతులను ఎక్కువగా పందెం బరిలోకి దింపుతుంటారు. వీటి ధర 5 వేల నుండి లక్షల రూపాయల వరకు పలుకుతున్నాయి.

విదేశాల నుంచి..

విదేశాల నుంచి..

అయితే ఈసారి పోటీలకు విదేశీ కోళ్లను కూడా బరిలోకి దింపనున్నారు. ఇక ఉత్తరాంధ్ర ప్రజలు ఈ కోడి పుంజులలో కొన్నింటిని మన పక్క రాష్ట్రమైన ఒడిశా రాష్ట్రం నుండి వేల రూపాయలను వెచ్చించి మరీ తెచ్చుకుంటారు. ఉత్తర జాతికి చెందిన కోడి పుంజుల ధరలు 15 వేల నుండి 20 వేల రూపాయల వరకు పలుకుతాయి. అలాగే జాతిని బట్టి కోళ్ల ధర ఉంటుంది.

పచ్చకాకి ఫేమస్..

పచ్చకాకి ఫేమస్..

ఈ కోళ్ల పుంజులు అన్నింటిలో కెల్లా పచ్చకాకి పుంజు చాలా ఫేమస్. అందుకే దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. ఇది విజయం సాధించడంలో చాలా దూకుడుగా ఉంటుందని అక్కడి వారి నమ్మకం.

స్వదేశీ కోళ్లా.. విదేశీ కోళ్లా...

స్వదేశీ కోళ్లా.. విదేశీ కోళ్లా...

ఈసారి విదేశాలలోని అసిల్ జాతికి చెందిన కోళ్లను కూడా బరిలో దింపనున్నారు.అసిల్ అంటే నాణ్యమైన జాతి కోడి అర్థం. అందుకు తగ్గట్టుగానే అవి చాలా బలంగా, పెద్ద సైజులో ఉంటాయి. బరువు మాత్రం తక్కువగా ఉంటాయి. అయితే అవి గాల్లోకి ఎక్కువ ఎత్తుకు ఎగరగలవు. మామూలుగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కోళ్లు 3 నుండి 5 కేజీల వరకు బరువు ఉంటాయి. అసిల్ జాతి మాత్రం 3 కేజీలకు మించి బరువు పెరగవు. అయితే అవి బరిలోకి దిగాయంటే విజయం సాధించేంతవరకు గట్టిగా పోరాడగలవు.

నెల ముందు నుంచే..

నెల ముందు నుంచే..

మామూలుగా సంక్రాంతి పండుగ పంట చేతికి వచ్చిన సమయం అని అందరూ చెబుతుంటారు. అయితే కోనసీమలో మాత్రం పందెం కోళ్ల పండుగ. ఇందుకోసం చాలా రోజుల ముందు నుంచే సన్నాహాలు జరుగుతాయి. కొన్ని కుటుంబాలు అయితే ఈ కోళ్ల పెంపకానికి అంకితం చేయబడ్డాయి. వీటికి సీజన్లో రూస్టర్లుగా శిక్షణ కూడా ఇస్తారు.

ప్రత్యేక ఆహారం..

ప్రత్యేక ఆహారం..

బరిలోకి దిగే కోళ్లకు ప్రత్యేకమైన ఆహారం ఇస్తారు. సాధారణ కోళ్లకు ఇచ్చే మాదిరిగా వీటికి ఆహారాన్ని ఇవ్వరు. వీటికి కాల్చిన జీడిపప్పు మరియు బాదం పెడతారు. ఇవి తిన్న కోడి పుంజు శరీర బరువు బాగా పెరిగి, అవి ఆరోగ్యవంతంగా తయారవుతాయి. ఆ తర్వాత బరిలోకి దిగి ప్రత్యర్థి పుంజులను మట్టి కరిపిస్తాయి.

ఈ కోళ్లకు వ్యాయామం..

ఈ కోళ్లకు వ్యాయామం..

ఈ కోళ్లకు రన్నింగ్ మరియు ఫ్లయింగ్ వంటి వ్యాయామాలు కూడా చేయిస్తారు. అలాగే మరింత బలంగా తయారయ్యేందుకు తక్కువ మోతాదులో ఆల్కహాల్ సైతం ఇస్తారు.

ఓడిపోయిన కోడిని..

ఓడిపోయిన కోడిని..

ఒకవేళ పందెంలో కోడి ఓడిపోతే దానిని వేలం పాట పాడతారు. స్థానిక పరిభాషలో ‘కోసా‘ అని పిలువబడే ఈ పోరాటాన్ని ఓడిపోయిన పక్షిని దాని యజమాని వేలం వేస్తారు. ఆ తర్వాత ఆ కోడిని కాస్త చికెన్ పకోడిగా లేదా నాటు కోడి పులుసుగా వంటకం తయారు చేసి అందరూ ఆనందంగా ఆరగిస్తారు.

బెట్టింగులు..

బెట్టింగులు..

సంక్రాంతి పండుగ రోజున కోళ్ల పందేల వద్ద పెద్ద ఎత్తున బెట్టింగులు జరుగుతాయి. హైదరబాద్, బెంగళూరు వంటి నగరాల నుండి అనేక మంది వచ్చి కోళ్ల పుంజులపై బెట్టింగులు నిర్వహిస్తారు.

English summary

Sankranti Special 2020 : How to prepare cocks for fighting in Andhra Pradesh

Here we talking about Sankranti Special 2020 : How to prepare cocks for fighting in Andhra Pradesh. Read on
Story first published:Tuesday, January 7, 2020, 17:07 [IST]
Desktop Bottom Promotion