For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Saraswati Puja 2021 :సరస్వతీ పూజ వేళ.. ఈ వస్తువులు కచ్చితంగా ఉండాలట...!

2021లో నవరాత్రి వేళ సరస్వతీ పూజా తేదీ, శుభముహర్తం, ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ సంప్రదాయం ప్రకారం, నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజుల పాటు తిమ్మిది రూపాల్లో అమ్మవారిని వివిధ అవతరాల్లో కొలుస్తారు. చెడుపై మంచి విజయం సాధించిన కారణంగా దసరా పండుగను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.

Saraswati Puja 2021: Date, Significance, Shubh Muhurat and Puja Vidhi During Navratri in Telugu

పురాణాల ప్రకారం, దుర్గాదేవి రాక్షసుడిని సంహరించిన రోజు అని.. మరోవైపు రాముడు రావణసురుడిని మట్టుబెట్టిన సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇదిలా ఉండగా నవరాత్రుల వేళ దక్షిణ భారతదేశంలో కేరళ, తమిళనాడు, కర్నాటక ప్రాంతాల్లో ఆరో రోజు లేదా తొమ్మిదో సరస్వతీదేవిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు.

Saraswati Puja 2021: Date, Significance, Shubh Muhurat and Puja Vidhi During Navratri in Telugu

అలాగే సరస్వతి పూజా వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 2021 అక్టోబర్ లో నవరాత్రుల సమయంలో సరస్వతి పూజను ఎప్పుడు జరుపుకుంటారు. శుభ ముహుర్తం ఎప్పుడు? సరస్వతీ పూజా విధానం, ప్రాముఖ్యత గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

నవరాత్రి 2021: దుర్గా మాత ఆశీస్సులు పొందడానికి దేవిని ఈ విధంగా పూజించండి...నవరాత్రి 2021: దుర్గా మాత ఆశీస్సులు పొందడానికి దేవిని ఈ విధంగా పూజించండి...

సరస్వతి పూజా సమయం..

సరస్వతి పూజా సమయం..

* అక్టోబర్ 12వ తేదీ మంగళవారం నాడు ఉదయం 11:27 గంటలకు ఆషాఢ నక్షత్రం శుభ ముహుర్తం ప్రారంభమవుతుంది.

* అక్టోబర్ 13వ తేదీ బుధవారం నాడు ఉదయం 10:19 గంటల ఆషాఢ నక్షత్రం ముహుర్తం ముగుస్తుంది.

* అక్టోబర్ 11వ తేదీన సోమవారం రోజున సరస్వతీ దేవి ఆవాహానాన్ని సూచిస్తుంది.

* అక్టోబర్ 14వ తేదీన గురువారం నాడు సరస్వతీ విసర్జనను చేయాలి.

పూజా విధానం..

పూజా విధానం..

నవరాత్రుల వేళ సూర్యోదయానికి ముందే తలస్నానం చేయాలి. మీ ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసుకుని, ఉతికిన బట్టలను ధరించాలి. వీలైతే తెల్లనిదుస్తులు లేదా పట్టుబట్టలు ధరించాలి. సరస్వతి పూజ సమయంలో, ప్రజలు సరస్వతి విగ్రహం లేదా చిత్రపటం ముందు పూజ చేయాలి. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఇంట్లో తెల్లని పువ్వులను సరస్వతీ దేవి సమర్పించాలి. అలాగే ఆ దేవి ముందు పుస్తకాలు, కలం ఉంచి పూజించాలి.

ఈ మంత్రాలను చదవాలి..

ఈ మంత్రాలను చదవాలి..

సరస్వతీ పూజా సమయంలో ఈ మంత్రాలను కచ్చితంగా పఠించాలి.

* శ్రీ సరస్వతీ కవచం

* ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా శిరోమేపాతుసరస్వతః

* ఓం హ్రీం సరస్వత్యై స్వాహేతిశ్రోత్రేపాతు నిరస్తరమ్

* ఓం శ్రీం హ్రీం భగవత్యై సరస్వత్యై స్వాహా నేత్రయుగ్మం సదావతు ఐం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా నాసాంమే సర్వదా వతు ఓం హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహా ఓష్ఠం సదా వతు ఐం ఇత్యేకాక్షరో మంత్రోమమ కంఠం సదావతు

* ఓం శ్రీం హ్రీం పాతుమే గ్రీవాం స్కంధౌమే శ్రీం సధా వతు * ఓం హ్రీం విద్యాధిషాంతృదేవ్యై స్వాహా వక్షః సదా వతు

* ఓం హ్రీం హేతి మమహస్తౌ సదావతు

వీటితో పాటు మరికొన్ని మంత్రాలను పఠించాలి. అలాగే నవరాత్రుల వేళ అమ్మవారికి అష్టోత్తర నామాలు, సహస్ర నామాలు చదువుతూ పూజించాలి. అలాగే దేవాలయాల్లో ప్రదక్షిణలు చేయాలి.

మీకు ధనవంతులు కావాలనే కోరిక ఉందా? నవరాత్రిలో 9 రోజులు ఈ పని చేయండి...మీకు ధనవంతులు కావాలనే కోరిక ఉందా? నవరాత్రిలో 9 రోజులు ఈ పని చేయండి...

నివేదన ఎలా..

నివేదన ఎలా..

సరస్వతీ పూజా సందర్భంగా అమ్మవారికి ఆవు నెతితో దీపాన్ని వెలిగించి దీపారాధన చేయాలి. అలాగే అమ్మవారికి క్షీరాన్నం, పాలతో బెల్లం నెయ్యి వంటి పదార్థాలు కలిపి చేసిన వాటిని నివేదించాలి. అలాగే చలివిడి వడపప్పు పానకం వంటివి ప్రత్యేక నైవేద్యాలు, నానబెట్టి మొలకలు ఎత్తించిన పెసర్లు, శనగలు వంటి పదార్థాలు సమర్పిస్తే శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు.

ఉపవాసం ఎవరుండాలి..

ఉపవాసం ఎవరుండాలి..

సరస్వతీ పూజ చేసే సమయంలో పెద్దవారు మాత్రమే ఉపవాసం ఉండాలి, అంటే 15 సంవత్సరాలలోపు పిల్లలు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. వీరు ఏమీ తినకుండా అమ్మవారిని పూజించకూడదు. మిగిలిన వారు ఏమీ తినకుండా అమ్మవారిని పూజించాలి.

FAQ's
  • నవరాత్రుల వేళ సరస్వతి పూజను ఎప్పుడు జరుపకుంటారు?

    హిందూ క్యాలెండర్ ప్రకారం దక్షిణ భారతదేశంలో నవరాత్రుల వేళ ఆరో రోజు లేదా తొమ్మిదో రోజున జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 12వ తేదీన లేదా 15వ తేదీన సరస్వతీ దేవి పూజను జరుపుకుంటారు. మరికొన్ని చోట్ల మూడు రోజుల పాటు సరస్వతీ దేవి పూజా వేడుకలను నిర్వహిస్తారు.

English summary

Saraswati Puja 2021: Date, Significance, Shubh Muhurat and Puja Vidhi During Navratri in Telugu

Here we are talking about the saraswati puja 2021: date, significance, shubh muhurat and puja vidhi during navratri in Telugu. Read on
Desktop Bottom Promotion