For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సశక్తి శివ నవకం: మీ కోరికలన్నింటినీ నేరవేర్చగలిగే ప్రార్థన ఇది

ఓ పరమేశ్వరా, నాకు విశ్లేషణా నైపుణ్యాలతోపాటు, అన్ని విభాగాలలో ప్రధానంగా విజ్ఞాన శాస్త్రంలో నైపుణ్యం ప్రసాదించు. గణిసేతుచ సర్వాగ్య దేహీ మే పరమేశ్వర్ సమ్యక్ జ్ఞానం జగన్నాథ్, ఐమ్ నామ్ క్లీం శివాయ

|

శివుని భోళాశంకరుడు అని పిలవడం జరుగుతుంది, అనగా మనసు నిండా పరమేశ్వరుని నింపుకుని ద్యానించిన ఎడల, మిగిలిన దేవుళ్ళతో పోల్చినప్పుడు అతి తక్కువ కాలంలోనే శివుని సంతోషపరచవచ్చునని చెప్పబడింది. క్రమంగా కొన్ని శ్లోకాలు, అర్పణలతోనే శివ కటాక్షం సిద్దిస్తుందని భక్తుల విశ్వాసం.

Sasakti Shiva Navakam: One Prayer For All Your Wishes

శివుని హృదయం భావోద్వేగాల గనిగా చెప్పబడుతుంది. క్రమంగా భక్తులకు ఎటువంటి కష్టం కలుగనీయకుండా, వారి కోర్కెలను తీరుస్తూ కాపాడుతూ ఉంటాడని విశ్వాసం. అందుకే శివుని భోలే నాథ్ అని కూడా పిలుస్తారు. క్రమంగా నిజమైన భక్తి ప్రపత్తులతో కొన్ని ప్రత్యేకించబడిన మంత్రాలతో ఆరాదించే భక్తులను నిరాశపరచకుండా, వారి కోరికలను నెరవేర్చే కొంగు బంగారంగా కీర్తించబడుతాడని చెప్పబడింది. అటువంటి అనేక శ్లోకాల సంకలనం నుండి సేకరించిన, మరియు శివునికి అంకితం చేయబడిన అత్యంత ప్రసిద్ది చెందిన శ్లోకాలలో ఒకదాన్ని ఇచ్చట పొందుపరచడం జరిగింది. ఈ శ్లోకాన్ని క్రమం తప్పకుండా అనుసరిస్తూ శివుని ద్యానించిన ఎడల, వారి కోరికలు తీరగలవని నమ్మబడింది.

సశక్తి శివనవకం అర్ధం ప్రకారం, పరమేశ్వరునికి ప్రత్యేకించి అంకితం చేయబడిన ఐo, క్లీం వంటి శబ్దాలను అనువదించడం మాత్రం జరగదని తెలుసుకోవడం ముఖ్యం. వివిధ రంగాలలో నిష్ణాతులు అవ్వాలనుకునేవారికి ఈ శ్లోకం ప్రత్యేకంగా సహాయపడుతుంది.

వేద శాస్త్ర పురాణేతిహాస కళాదీసు విజ్ఞానందేహి మే, ఐo నాం క్లీం శివాయ

వేద శాస్త్ర పురాణేతిహాస కళాదీసు విజ్ఞానందేహి మే, ఐo నాం క్లీం శివాయ

ఓ పరమేశ్వరా, నాకు వేదాలు, శాస్త్రాలు, చరిత్ర, సాహిత్యం, వైజ్ఞానికం గురించిన జ్ఞానాన్ని ప్రసాదించు తండ్రీ.

2. చతుర్దసాశు విద్యాశు, చతుష్షష్టి కళౌ చ చతురం దియం దేహి, ఐo నాం క్లీం శివాయ

2. చతుర్దసాశు విద్యాశు, చతుష్షష్టి కళౌ చ చతురం దియం దేహి, ఐo నాం క్లీం శివాయ

ఓ పరమేశ్వరా, నాకు పద్నాలుగు రకాల విద్యలు, మరియు అరవై నాలుగు రకాల కళల్లో నైపుణ్యాన్ని ప్రసాదించు.

3. మిమ్యాసాం సమస్త్రతం సబద్ శస్త్రే విశేసాత్ దేహి మే దేవ్ సంబ్రగ్నం ఐo నాం క్లీం శివాయ

3. మిమ్యాసాం సమస్త్రతం సబద్ శస్త్రే విశేసాత్ దేహి మే దేవ్ సంబ్రగ్నం ఐo నాం క్లీం శివాయ

ఓ పరమేశ్వరా, నాకు విశ్లేషణా నైపుణ్యాలతోపాటు, అన్ని విభాగాలలో ప్రధానంగా విజ్ఞాన శాస్త్రంలో నైపుణ్యం ప్రసాదించు.

4. గణిసేతుచ సర్వాగ్య దేహీ మే పరమేశ్వర్ సమ్యక్ జ్ఞానం జగన్నాథ్, ఐమ్ నామ్ క్లీం శివాయ

4. గణిసేతుచ సర్వాగ్య దేహీ మే పరమేశ్వర్ సమ్యక్ జ్ఞానం జగన్నాథ్, ఐమ్ నామ్ క్లీం శివాయ

ఓ పరమేశ్వరా, నాకు గణితంలో పూర్తి పరిజ్ఞానం మరియు పూర్తి అవగాహనను ప్రసాదించు.

Most Read :2019 లో వివాహాది శుభకార్యాలకు సూచించదగిన పవిత్రమైన రోజులుMost Read :2019 లో వివాహాది శుభకార్యాలకు సూచించదగిన పవిత్రమైన రోజులు

5. శ్రాక్లేష్వాపి కావ్యేషు, సస్కాల్సు కదాసు చ సాహిత్యం దేహి మే వచం, ఐమ్ నామ్ క్లీం శివాయ

5. శ్రాక్లేష్వాపి కావ్యేషు, సస్కాల్సు కదాసు చ సాహిత్యం దేహి మే వచం, ఐమ్ నామ్ క్లీం శివాయ

ఓ పరమేశ్వరా, సాహిత్యం మరియు చరిత్ర కథలన్నింటిలో నాకు విశిష్టమైన జ్ఞానాన్ని మరియు సాహితీ శ్రేష్టతను ప్రసాదించు స్వామీ.

6. హృదయం బొరుహే నిత్యం వాస్ మే గ్యగదీశ్వర్ హర్ మే దురిత్త సస్వాద్ ఐమ్ నామ్ క్లీం శివాయ

6. హృదయం బొరుహే నిత్యం వాస్ మే గ్యగదీశ్వర్ హర్ మే దురిత్త సస్వాద్ ఐమ్ నామ్ క్లీం శివాయ

ఓ పరమేశ్వరా, దయచేసి నా మనసులోనే కొలువుదీరి, ప్రశాంతతను నెలకొల్పి, అచటనున్న అన్ని రకాల బాధలను సమూలంగా తొలగించు స్వామీ.

 7. జన్మాంతహార్ కర్తాం పాపం, బుదేర్ జాడ్యకారం శివ జహి జంతసు, నినాదం చ ఐమ్ నామ్ క్లీం శివాయ

7. జన్మాంతహార్ కర్తాం పాపం, బుదేర్ జాడ్యకారం శివ జహి జంతసు, నినాదం చ ఐమ్ నామ్ క్లీం శివాయ

పరమేశ్వరా, జన్మ కారణంగా గతంలో నేను తెలిసో, తెలియకో అనేక పాపాలను చేసి ఉండవచ్చు, ఆ పాపాలు నా మనసున కలవరానికి కారణం అయి ఉండవచ్చు, కావున ఈ పాపాలను దయచేసి క్షమించి, పాపవిముక్తుడిని చేయి తండ్రీ. అదేవిధంగా ఏ ఇతర మానవుల చెడు దృష్టి నా వైపు కలిగి ఉండకుండా, చెడు ఆలోచనలు ఉద్దేశ్యాలు, మరియు అనారోగ్యాలు దరిచేరకుండా కాపాడు స్వామీ.

8. విశ్యేషు విరక్తిం చ, వివిదేషు విదేహి మే వినతేష్తాద్ విశ్వేష్, ఐమ్ నామ్ క్లీం శివాయ

8. విశ్యేషు విరక్తిం చ, వివిదేషు విదేహి మే వినతేష్తాద్ విశ్వేష్, ఐమ్ నామ్ క్లీం శివాయ

ఓ పరమేశ్వరా, నాకు ఈ భౌతిక ప్రాపంచిక సంబంధిత విషయాలు మరియు సమాజంతో గల అనారోగ్యకర సంబంధాలను త్యజించేందుకు శక్తిని ప్రసాదించు స్వామీ.

Most Read :ముఖ కవళికలు, లక్షణాల ఆధారితంగా కూడా వివాహాలు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయా?Most Read :ముఖ కవళికలు, లక్షణాల ఆధారితంగా కూడా వివాహాలు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయా?

9. ముక్తి మార్గ పరం చిత్తం కురు మే గ్యగదీశ్వర్ ముగ్ధ చంద్ర కళా చూడ, ఐమ్ నామ్ క్లీం శివాయ

9. ముక్తి మార్గ పరం చిత్తం కురు మే గ్యగదీశ్వర్ ముగ్ధ చంద్ర కళా చూడ, ఐమ్ నామ్ క్లీం శివాయ

తలపై నెలవంక చంద్రుని ధరించిన ఓ పరమేశ్వరా, ఆత్మ విమోచనం వైపుగా నన్ను తీసుకొని వెళ్తూ, నా మనస్సుకు స్వాంతన చేకూర్చవలసినదిగా ప్రార్దిస్తున్నాను.

10. ఇత్యేతాద్ నవకం నిత్యం భక్తితో య పడెన్ నర్ పరరంభస్మస్య సిద్యంతి ప్రార్థిథాoచాపి, సిధ్యాతి.

10. ఇత్యేతాద్ నవకం నిత్యం భక్తితో య పడెన్ నర్ పరరంభస్మస్య సిద్యంతి ప్రార్థిథాoచాపి, సిధ్యాతి.

పైన చెప్పిన ఈ తొమ్మిది శ్లోకాలు, భక్తి ప్రపత్తులతో నీకు సమర్పిస్తున్నాను పరమేశ్వరా.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, సౌందర్య, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, మాతృత్వ, శిశు సంబంధ, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

sasakti shiva navakam lyrics and meaning

Sasakti Shiva Navakam: One Prayer For All Your Wishes
Desktop Bottom Promotion