For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీవితంలో విజయం సాధించేందుకు శివుడు చెప్పిన రహస్యాలేంటో తెలుసా...!

జీవితంలో విజయం సాధించేందుకు శివుడు చెప్పిన రహస్యాలేంటో తెలుసుకుందాం...

|

ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్క జీవి ఏదో ఒక సమయంలో కష్టాలను ఎదుర్కొంటారు. అది పని సంబంధించి కావచ్చు.. పరీక్షలలో ఫెయిల్ అవ్వడం.. ప్రేమలో విఫలమవ్వడం.. ఆర్థిక పరంగా.. ఆరోగ్య పరంగా.. కుటుంబ పరంగా.. సామాజిక పరంగా.. ఇలా ఏదో ఒక విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.

Secrets of success by lord shiva in telugu

అయితే ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ.. మనం వాటన్నింటినీ అధిగమించి ముందుకు ఎలా వెళ్లాలి అనేది కేవలం మన చేతుల్లోనే ఉంటుంది.అయితే ఇలా జీవితంలో విజయం సాధించేందుకు అవసరమయ్యే రహస్యాలను ఆ పరమేశ్వరుడు వెల్లడించారు. అందరికీ ప్రేరణ కలిగించే ఆ దేవుని బోధనలు ఎంతో పవిత్రమైనవి.

Secrets of success by lord shiva in telugu

పురాణాల ప్రకారం శివుడు.. తన భాగస్వామి అయిన పార్వతీదేవితో తరచుగా ఈ విషయాల గురించి ఎక్కువగా చర్చించేవారట. అందులో పార్వతీదేవికి శివుడు చెప్పిన రహస్యాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవి మన జీవితంలో విజయం సాధించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి.

మీ లక్ష్యం పట్ల..

మీ లక్ష్యం పట్ల..

మనం చేసే ప్రతి పనిలో పట్టుదల మరియు సంకల్పం ఉన్నంతవరకు, మనం వాటిని మరింత మెరుగ్గా చేయగలం. ఏదైనా ప్రయత్నం బాగా జరగాలని మీరు కోరుకుంటే, మీరు మనస్సులో దృఢమైన నిబద్ధత కలిగి ఉండాలి. సంకల్పం తప్ప మరేది అవసరం లేదు.

ఇతరులు ఏమనుకుంటున్నారో..

ఇతరులు ఏమనుకుంటున్నారో..

సమాజం మీ గురించి కొన్ని మంచి లేదా చెడు విషయాలను కచ్చితంగా చెబుతుంది. అయితే సమాజంలోని కొందరు చెప్పే మంచి విషయాల వల్ల మీలో అహం పెరగొచ్చు. వారు చెప్పే చెడు విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఈ రెండూ మీ పతనానికి దారి తీస్తాయి. అందుకే ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో చూసి కలవరపడటం మానేయాలి. సమాజంలోని కొందరు మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తినా.. వినయంగా ఉండాలి. వాటిని అతిగా నమ్మకండి. అప్పుడే మీ లక్ష్యాలపై మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టగలరు.

గురువుల పట్ల గౌరవం..

గురువుల పట్ల గౌరవం..

మీకు గురువులతో ఉన్న సంబంధం మంచిది అయినా.. చెడ్డది అయినా, వారిపై ఎప్పుడూ మీరు గౌరవం కలిగి ఉండాలి. వారు మీకు నేర్పిన పాఠాలు పరీక్షల్లో రాకపోయినా.. జీవితంలో మాత్రం కచ్చితంగా ఉపయోగపడతాయి. వారి సహాయం మరియు మార్గదర్శకత్వం వల్లనే మనం ముందుకు సాగే అవకాశం ఉంటుంది.

బ్యాలెన్స్ గా ఉండండి..

బ్యాలెన్స్ గా ఉండండి..

ఒక గొప్ప యోగి మరియు తత్త్వవేత్త, శ్రీశ్రీ ఆనందమూర్తిజీ ఈ విషయాల గురించి ఇలా అన్నారు.‘మీరు ఎలాంటి న్యూనత, ఆధిపత్యం లేదా ఓటమివాద సముదాయం లేదా నిస్సహాయత మరియు నిరాశ సంక్లిష్టతతో బాధపడకూడదు' మీ మనస్సు కంటే ఈ ప్రపంచంలో మంచి శక్తి మరొకటి లేదని మీరు మొదట అర్థం చేసుకోవాలి. ఏ ప్రత్యామ్నాయ ఆలోచన లేకుండా మీ మనస్సులో కనిపించిన చర్యను అమలు చేయడం ద్వారా, మీరు మీ జీవితాన్ని మరియు ప్రపంచాన్ని మార్చవచ్చు. కాబట్టి, ఇతరుల అభిప్రాయాల వల్ల మీ మనస్సు కలుషితం కావడానికి అనుమతించవద్దు. మీరు ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యక్తి అని మీరు మొదట నమ్మాలి. అలాగే, ఎప్పుడూ ఎక్కువగా ఆలోచించవద్దు. బ్యాలెన్స్ గా ఉండేందుకు ప్రయత్నించండి.

స్వీయ నియంత్రణ(Self Control)

స్వీయ నియంత్రణ(Self Control)

మన సమాజంలో ఇతరులు ఏదో అన్నారని.. తమను తాము తక్కువగా ఊహించుకుని బలహీనులుగా మారిపోతుంటారు. అదే సమయంలో తమకు తెలిసిన వాటిని కూడా మరచిపోయి పొరపాట్లు చేయొచ్చు. కాబట్టి మీరు మిమ్మల్ని బలహీనపరిచే చర్యలను ఎప్పటికీ చేయకండి. ఏ పరిస్థితిలో అయినా ఆత్మవిశ్వాసంతో ఉండాలి. అలాగే ఆత్మనియంత్రణ ఉన్నవారు మాత్రమే ప్రతి ఒక్క దానిలో విజయం సాధిస్తారు.

సరైన ఆహారం..

సరైన ఆహారం..

మనం తీసుకునే ఆహారం సరైనదా కాదా అనేది ముందుగా తెలుసుకోవాలి. ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి ప్రయత్నించండి. అనారోగ్యకరమైన ఆహారాన్ని ఎప్పుడూ తినకూడదు. మీ జీవిత లక్ష్యాన్ని సాధించడానికి, మీ శరీరానికి శక్తి అవసరం. కాబట్టి, మీరు ఆ శక్తిని పొందాలంటే, మీరు పోషకమైన ఆహారాన్ని తినాలి. శివుడు చెప్పిన ఈ జీవిత రహస్యాలు పాటిస్తే ప్రతి ఒక్కరూ జీవితంలో సులభంగా గెలవగలరు.

మీరు ఈ రహస్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలనుకుంటున్నారనేది పూర్తిగా మీ ఇష్టం. మీరు ఈ రహస్యాలను మీ పడకగది గోడపై అతికించుకోవడం లేదా పుస్తకాల్లో రాసుకోవడం.. లేదా మొబైల్ నోట్ బుక్ లో రాసుకుని.. దీన్ని క్రమం తప్పకుండా చూడండి.. మీ జీవితంలో విజయానికి చేరుకునే దిశగా కచ్చితంగా పయనించొచ్చు.

English summary

Secrets of success by lord shiva in telugu

Here are some secrets of success by lord shiva in telugu. Read on..
Desktop Bottom Promotion