For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నరకం నుండి తప్పించుకోవడానికి శివుడు కార్తీకేయకు చెప్పిన రహస్యాలేంటో తెలుసా..

ప్రజలు తమ పనులను సక్రమంగా పూర్తిచేస్తే కైలాసానికి వచ్చి మోక్షాన్ని సాధించగలరా అని శివుడిని అడగగా, అప్పుడు శివుడు చెప్పిన విషయం వింటే చాలా మందికి ఆశ్చర్యమేస్తుంది.

|

హిందూ మతంలో అత్యధిక మంది పూజించే దేవుళ్లలో శివుడు ఒకరు. ఈ దేవుడికి భోళా శంకరుడు, అమరేశ్వరస్వామి, దక్షిణామూర్తితో పాటు ఇంకా ఎన్నో రకాల పేర్లతో ఈ దేవుడిని పూజిస్తారు. ఈ స్వామి అనుమతి లేనిదే చీమ అయినా కుట్టదు అని పురాణాల్లో పేర్కొనబడింది. అందరికీ రెండు కళ్లు ఉంటే శివుడికి మాత్రం మూడు కళ్లు ఉంటాయి. కానీ ఆ దేవుడు ఆ కన్నును ఇప్పటివరకు తెరవలేదని పురాణాల ద్వారా తెలిసింది. కానీ ఒకవేళ ఆ కన్ను తెరిస్తే మొత్తం భస్మం అవుతుందని పండితులు చెబుతారు.

 Lord Shiva

ఇక విషయానికొస్తే శివపార్వతీ దేవి చిన్న కుమారుడైన సుబ్రమణ్యం స్వామికి అమర జీవితం యొక్క మోక్షం యొక్క రహస్యాలు చెప్పినట్టు చాలా మందికి తెలియదు. కొద్దిమందికి మాత్రమే తెలుసు. సుబ్రమణ్యం స్వామికి కార్తీకేయ అని, మురుగన్ అనే పేర్లు కూడా ఉన్నాయి. తమిళనాడులో మురుగన్ అని ఆ దేవుడిని కొలుస్తారు. శివుడు తన రెండో కుమారుడు అయిన సుబ్రమణ్యం స్వామికి ఏమేమి రహస్యాలో చెప్పాడో.. ఎందుకు చెప్పాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మోక్షం పొందాలంటే..

మోక్షం పొందాలంటే..

ప్రజలు తమ పనులను సక్రమంగా పూర్తిచేస్తే కైలాసానికి వచ్చి మోక్షాన్ని సాధించగలరా అని శివుడిని అడగగా, అప్పుడు శివుడు చెప్పిన విషయం వింటే చాలా మందికి ఆశ్చర్యమేస్తుంది. ఇంతకీ శివుడు ఏమి చెప్పాడంటే స్వచ్ఛమైన భక్తితో పవిత్ర స్థలాలకు వెళ్లే వారంతా మోక్షాన్ని పొందవచ్చని శివుడు చెప్పాడు.

పాపాలను కడిగేయాలంటే..

పాపాలను కడిగేయాలంటే..

ఏయే ప్రదేశాలు మంచివి. ఏ కోరికలు, ఆలోచనలు స్వచ్ఛమైనవి సుబ్రమ్మణ్యం స్వామి శివుడిని అడిగాడు. ఇందుకు గాను శివుడు బదులిస్తూ ‘‘నదులన్నీ పవిత్ర గంగానదిలో పుట్టుకొచ్చాయి. కాబట్టి ప్రతి నది తీర్థయాత్ర ప్రదేశం మంచిది. ఎవరైనా తమ పాపాలను కడిగేయాలంటే.. మొదట ఈ నదుల నీటిలో స్నానం చేయాలి. లేదా ఈత కొట్టాలి. తర్వాత పవిత్ర త్రిమూర్తుల ఆశ్రయాలను సందర్శించాలి‘‘ అని చెప్పాడు.

కష్టాల నుండి విముక్తి కావాలంటే..

కష్టాల నుండి విముక్తి కావాలంటే..

కష్టాల నుండి విముక్తి కావాలంటే లేదా ఏదైనా తప్పు చేసి ఒప్పుకొన్నప్పుడు కాశీ, అయోధ్య, ద్వారక, మధుర, రామ్ దీర్త్, పుష్కర్ లో బ్రహ్మ, విష్ణు, తన వద్ద లొంగిపోతే వారి పాపాలను క్షమించడానికి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయరు. ఈ ప్రదేశాలను సందర్శించడం వల్ల ప్రపంచంలోని అన్ని కష్టాల నుండి విముక్తి పొందుతారని శివుడు చెప్పాడు. ఇక్కడ తప్పుచేసిన వారంతా తమకు తాము లొంగిపోయి దేవుని ఆశ్రయం పొందవచ్చు.

బానిసత్వం నుండి విముక్తి కావాలంటే..

బానిసత్వం నుండి విముక్తి కావాలంటే..

ఎవరైనా బానిసత్వం నుండి విముక్తి కావాలంటే ఏమి చేయాలని సుబ్రహ్మణ్యస్వామి శివుడిని అడగగా ‘‘ ‘‘గోమతి నది పవిత్ర స్నానం, వారణాసిలో జనన, మరణ చక్రాల్లో స్మరించడం, విశ్వనాథ్ వందనం వంటి వాటిని సందర్శిస్తే బానిసత్వం నుండి విముక్తి లభిస్తుంది‘‘ అని శివుడు చెప్పాడు.

నరకం నుండి తప్పించుకునే మార్గం..

నరకం నుండి తప్పించుకునే మార్గం..

మన పవిత్ర పుస్తకాల్లో చెప్పినట్టుగా, శివుడు మన పూర్వీకులకు నువ్వులు మరియు పవిత్ర నదిపై నీరు ఇస్తే నరకం యొక్క హింస నుండి మనల్ని కాపాడుతుందని శివుడు చెప్పారు. మహాకాళేశ్వర్ ను ఆరాధించడం వల్ల మనిషి చేసి అన్ని పాపాలు తొలగిపోతాయని శివుడు చెప్పాడు.

శ్రీ కృష్ణుడు చెప్పిన రహస్యం..

శ్రీ కృష్ణుడు చెప్పిన రహస్యం..

ఒక వ్యక్తి తన జీవితంలో తీర్థయాత్రలు పూర్తి చేసినప్పుడు, అతను గంగోత్రి మరియు యమునోత్రికి వెళ్లాలి. అక్కడ అతను పవిత్ర జలం తీసుకుని బద్రీనాథ్ కు వెళ్లి లొంగొపోయి, చివరకు కేదారానాథ్ లో ఆశీర్వాదం పొందాలి. కృష్ణుడు చనిపోయే ముందు తీర్థయాత్రకు వెళ్లిన పాండవులకు ఈ రహస్యం చెప్పబడింది.

English summary

Secrets Which Lord Shiva Revealed To Karthikeya

Read to know that lord shiva revealed to karthikeya, the secret to attaining moksh in kaliyuga
Story first published:Friday, October 4, 2019, 20:14 [IST]
Desktop Bottom Promotion