For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శాకాంబరి పూర్ణిమ రోజున సాయంకాలం చేయాల్సిన పనులేంటో ఇప్పుడే చూసెయ్యండి...!

శాకాంబరి పూర్ణిమ రోజున ముఖ్యంగా సాయంకాలం చేయాల్సిన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ క్యాలెండర్ ప్రకారం, పుష్య మాసంలో వచ్చే పౌర్ణమిని శాకాంబరి జయంతిగా జరుపుకుంటారు. ఇది శాకాంబరి నవరాత్రి ప్రారంభ రోజు.

Shakambhari Purnima 2021 : Importance and Puja vidhi

శాకాంబరి నవరాత్రి అష్టమి తిథి రోజున ప్రారంభమై పుష్య మాసంలో పూర్ణమి రోజున ముగుస్తుంది. దుర్గాదేవి యొక్క నిరపాయైన రూపంగా పరిగణించబడే శాకాంబరి దేవి జయంతి రోజున కొన్ని పనులను మనం కచ్చితంగా చేయకూడదు.

Shakambhari Purnima 2021 : Importance and Puja vidhi

అదే సమయంలో కొన్ని పనులను తప్పనిసరిగా చేయాలి. ఇలా ఈ పవిత్రమైన రోజున అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే, మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చడమే కాకుండా,

Shakambhari Purnima 2021 : Importance and Puja vidhi

మీకు ఎలాంటి కష్టాలు రాకుండా, ఉండాలంటే ఈ సాయంకాలం వేళ పూజను ఏ విధంగా చేయాలి.. అమ్మవారి అనుగ్రహం ఏ విధంగా చేయాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

టెంపుల్స్ లో ఎంత టెక్నాలజీ దాగి ఉందో తెలుసా...టెంపుల్స్ లో ఎంత టెక్నాలజీ దాగి ఉందో తెలుసా...

శాకాంబరి దేవత ఎవరు?

శాకాంబరి దేవత ఎవరు?

శాకాంబరి దేవత గురించి పురాణాల ప్రకారం అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ఒకటి భగవతి దేవి అవతారం శాకాంబరి దేవత. ఈ దేవతను ‘ది బేరర్ ఆఫ్ ది గ్రీన్స్' అని కూడా పిలుస్తారు. ఈ దేవత శాకాహార ఉత్పత్తులకు చాలా ప్రసిద్ధి అయిన దేవిగా భక్తులందరూ ఆరాధిస్తారు.

శాకాంబరి దేవి కథ..

శాకాంబరి దేవి కథ..

హిందూ పురాణాల ప్రకారం, ఒకప్పుడు ఓ రాక్షసుడు ఘోర తపస్సు చేసి, దుర్గాదేవి నుండి నాలుగు వేదాలు పొందిన తర్వాత దేవతలకు సమర్పించే ప్రార్థనలు మరియు ఆరాధానలన్నీ తన వద్దకు చేరాలని ఆశించాడు. అంతేకాదు అప్పటి నుండి ప్రతి ఒక్కరికీ ఇబ్బందులకు గురి చేసేవాడు. దీని ఫలితంగా ఆ సమయంలో అందరికీ కష్టాలు ఎదురయ్యాయి. సమయానికి వర్షాలు కురవలేదు. పంటలు పండలేదు. దీంతో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో రుషులు, ప్రజలు దేవతలందరూ నిరంతర యాగాలు, తపస్సు చేస్తారు. అప్పుడు వారి కష్టాలను విన్నత ఆ తల్లి ధాన్యాలు, పండ్లు, మూలికలు, పప్పుధాన్యాలు, కూరగాయలు మరియు ఆకుకూరలు కలిగి ఉన్న శాకాంబరి దేవతగా అవతరించింది. అప్పటి నుండే ఈ దేవికి శాకాంబరి దేవి అనే పేరు కూడా వచ్చింది. ప్రజల దుస్థితిని చూసి, శాకాంబరి దేవి కళ్ల నుండి తొమ్మిది రోజుల పాటు రాత్రి, పగలు నిరంతరం కన్నీళ్లు కారుతుండేవి. ఈ విదంగా కన్నీళ్లు నదిగా రూపాంతరం చెందాయని, దీని వల్ల కరువు ముగిసిందని శాస్త్రాలు చెబుతున్నాయి.

రాక్షసుడితో పోరాటం..

రాక్షసుడితో పోరాటం..

అదే సమయంలో దుర్గం అనే రాక్షసుడి క్రూరత్వం నుండి ప్రజలను విముక్తి చేయడానికి ఆ రాక్షసుడితో పోరాటం చేసింది. శాకాంబరి అవతారంలో వచ్చిన దేవి తన శక్తితో ఆ రాక్షసుడిని మట్టుబెట్టింది. దుర్గం అనే రాక్షసుడిని సంహరించడంతో ఆ దేవికి దుర్గా దేవి అని పేరు పెట్టారు. ఈ సమయం నుండి భక్తులు శాకాంబరి పూర్ణిమ రోజున విధిగా ఉపవాసం పాటిస్తారు. ఇలా చేస్తే ఆ దేవత ఆశీర్వాదాలతో పాటు, వారి ఇళ్లలో శ్రేయస్సు పొందుతుంది.

Vastu Shastra Tips : రోజూ సాయంకాలం వేళ ఈ పనులు చేస్తే కష్టాలను కొనితెచ్చుకున్నట్టే...!Vastu Shastra Tips : రోజూ సాయంకాలం వేళ ఈ పనులు చేస్తే కష్టాలను కొనితెచ్చుకున్నట్టే...!

శాకాంబరి దేవి ప్రాముఖ్యత..

శాకాంబరి దేవి ప్రాముఖ్యత..

భారతదేశంలో శాకాంబరి పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజున శాకాంబరి దేవి జయంతి. కాబట్టి మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో పుష్యపౌర్ణమిగా జరుపుకుంటారు. ఈరోజున పవిత్ర స్నానం చేసి, అమ్మవారిని దర్శించుకుని మోక్షాన్ని పొందుతారు.

ఏమి చేయాలి..

ఏమి చేయాలి..

శాకాంబరి పూర్ణిమ రోజున భక్తులందరూ విధిగా పేదలకు దానధర్మాలు ఇవ్వాలి.

శాకాంబరి దేవికి సాయంత్రం వేళ కూరగాయాలతో అలంకరించాలి.

పవిత్రమైన ఆహారాన్ని (ప్రసాదం) దేవతకు అర్పించాలి.

ఆ తర్వాత దానిని భక్తులందరికీ పంచిపెట్టాలి.

మీ సమీపంలోని ఆలయాలను సందర్శించి, ఆ దేవిని ఆరాధించాలి.

మీ సామర్థ్యం మేరకు మీకు తోచినంత విరాళాలు ఇవ్వాలి.

English summary

Shakambhari Purnima 2021 : Importance and Puja vidhi

Here we are talking about the Shakambhari Purnima 2021 : Importance and Puja vidhi. Read on.
Desktop Bottom Promotion