For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Shani Amavasya 2022 :శని దోష నివారణకు ఈ పరిహారాలు పాటించండి...

శని అమావాస్య 2022 సందర్భంగా చేయాల్సిన మరియు చేయకూడని పనులతో పాటు శని దేవుని ఆశీస్సుల కోసం ఏమి చేయాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

పురాణాల ప్రకారం, శని దోషం నుండి తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యపడదు. శని ప్రభావం మనపైనా దేవతలపైనా ఉంటుందని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.

Shani Amavasya 2022 : Dos and Donts to Get Shani dev Blessings in Telugu

ఈ నేపథ్యంలోనే హిందూ క్యాలెండర్ ప్రకారం, వైశాఖ బహుళ అమావాస్య 2022 సంవత్సరంలో ఏప్రిల్ 29వ తేదీన అంటే శనివారం నాడు అర్ధరాత్రి 12:57 గంటలకు ప్రారంభమవుతుంది. హిందూ పురాణాల ప్రకారం, ఈ రోజు నుండే వైశాఖ మాసం ప్రారంభమవుతుంది.

Shani Amavasya 2022 : Dos and Donts to Get Shani dev Blessings in Telugu

ఏప్రిల్ 30వ తేదీ అర్థరాత్రి 1:57 గంటలకు పూర్తవుతుంది. ఇలా శనివారం రోజున శని అమావాస్య వచ్చింది. హిందూ మత విశ్వాసాల ప్రకారం శనివారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది. దీనినే శని అమావాస్య అని కూడా అంటారు. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి, శని దేవుని అనుగ్రహం పొందడానికి ఈరోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.

Shani Amavasya 2022 : Dos and Donts to Get Shani dev Blessings in Telugu

మరోవైపు ఈరోజు ఎలాంటి పనులు చేపట్టినా అవి విజయవంతంగా పూర్తి కావు అని చాలా మంది నమ్ముతారు. అయితే ఈ సమయంలో శని ప్రభావం నుండి తప్పించుకోవడానికి కొన్ని పరిహారాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా శని దేవుని అనుగ్రహం పొందేందుకు ఏయే పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Shani Amavasya 2022: శని అమావాస్య ఎప్పుడు? పూజా విధానాలేంటో చూడండి...Shani Amavasya 2022: శని అమావాస్య ఎప్పుడు? పూజా విధానాలేంటో చూడండి...

శని దోష నివారణకు ఈ పరిహారాలు పాటించండి...

శని దోష నివారణకు ఈ పరిహారాలు పాటించండి...

ఈ ఏడాది వైశాఖ అమావాస్య శనివారం రోజున వచ్చింది. దీన్నే శని అమావాస్య అని కూడా అంటారు. ఇదే రోజున సూర్య గ్రహణం కూడా ఏర్పడుతుంది. అయితే ఈ సమయంలోనే శని దోష నివారణకు అనుకూలంగా ఉంటుంది. ఎవరి జాతకంలో అయినా శని దోషం ఉంటే దాన్ని నివారించేందుకు ఈరోజు తప్పకుండా ప్రయత్నించాలి. లేదంటే ఇబ్బందులు మరింతగా పెరుగుతాయి.

దానం చేయాలి..

దానం చేయాలి..

శని దోషం ఉన్నవారు శని అమావాస్య రోజున కచ్చితంగా స్నానం చేయాలి. అలాగే అవసరం ఉన్న వారికి లేదా పేదలకు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీరు శని దోషం నుండి కొంత ఉపశమన పొందుతారని పండితులు చెబుతున్నారు. అలాగే మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధించొచ్చు.

ఉపవాసం ఉండాలి..

ఉపవాసం ఉండాలి..

శని అమావాస్య రోజున కచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ పవిత్రమైన రోజున శనిదేవుడిని శాస్త్రోక్తంగా పూజించాలి. శని దేవుని ఆలయానికి వెళ్లి శనైశ్వర అభిషేకం నువ్వుల నూనె, నల్ల నవ్వులను సమర్పిస్తే, శని దేవుని అనుగ్రహం పొందొచ్చు. అలాగే శని దోషం నుండి ముక్తిని కూడా పొందొచ్చు.

Navagraha Stotram in Telugu : మీ జాతకంలో దోషాలు తొలగిపోవాలంటే.. నవగ్రహ స్తోత్రాలను పఠించండి...!Navagraha Stotram in Telugu : మీ జాతకంలో దోషాలు తొలగిపోవాలంటే.. నవగ్రహ స్తోత్రాలను పఠించండి...!

నీటితో అభిషేకం..

నీటితో అభిషేకం..

శని అమావాస్య రోజున శని దేవాలయంలో నీటితో అభిషేకం చేయాలి. పురాణాల ప్రకారం, శని దేవుడు హనుమంతుని భక్తులకు ఎప్పటికీ ఇబ్బందులు కలగజేయడు. కాబట్టి అమావాస్య రోజున మల్లెపువ్వులు, దీపదానం చేయాలి. ఈరోజు హనుమాన్ చాలీసా, సుందర కాండ పఠించడం వల్ల శనిదోషం నుండి ఉపశమనం పొందొచ్చు.

ఇవి చేయకూడదు..

ఇవి చేయకూడదు..

శని అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అలా చేయడం వల్ల మీ ఇబ్బందులు పెరుగుతాయి. ఈరోజున ఎవరిపైనా కోపం వ్యక్తం చేయకూడదు. ప్రశాంతంగా ఉండాలి. ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు. మాంసం తినడం, మద్యం తాగడం వంటివి చేయరాదు.

శని దేవుని అనుగ్రహం కోసం..

శని దేవుని అనుగ్రహం కోసం..

శని అమావాస్య రోజున శని మంత్రాన్ని 5, 7, 11 లేదా 21 సార్లు జపించండి మరియు శని చాలీసాను కచ్చితంగా పఠించాలి. చివరగా శని దేవునికి హారతి ఇవ్వడం మరచిపోవద్దు. ఈ పవిత్రమైన రోజున ఆవనూనెతో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించాలి. శని అమావాస్య రోజున నల్ల నువ్వులు, నల్ల ఉసిరి, నల్లని గుడ్డలు, ఏదైనా ఇనుము వస్తువులు మరియు ఆవనూనె మొదలైన వాటిని అవసరాన్ని బట్టి లేదా పేదవారికి దానం చేయాలి. అనంతరం శని స్తోత్రాన్ని మూడుసార్లు పఠించండి. ఇలా చేయడం వల్ల మీకు శని మహాదశ బాధలు తగ్గడంతో పాటు శని దేవుని అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతారు.

FAQ's
  • 2022లో శని అమావాస్య ఎప్పుడొచ్చొంది? శుభ ముహుర్తం ఎప్పుడు?

    హిందూ క్యాలెండర్ ప్రకారం, వైశాఖ బహుళ అమావాస్య 2022 సంవత్సరంలో ఏప్రిల్ 29వ తేదీన అంటే శనివారం నాడు అర్ధరాత్రి 12:57 గంటలకు ప్రారంభమవుతుంది. హిందూ పురాణాల ప్రకారం, ఆరోజు నుండే వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 30వ తేదీ అర్థరాత్రి 1:57 గంటలకు పూర్తవుతుంది. ఈరోజున దేవుళ్లకు పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. జీవితంలో సుఖ సంతోషాలొస్తాయని భక్తుల విశ్వాసం.

  • శని అమావాస్య రోజున చేయకూడని పనులేంటి?

    శని అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అలా చేయడం వల్ల మీ ఇబ్బందులు పెరుగుతాయి. ఈరోజున ఎవరిపైనా కోపం వ్యక్తం చేయకూడదు. ప్రశాంతంగా ఉండాలి. ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు. మాంసం తినడం, మద్యం తాగడం వంటివి చేయరాదు.

English summary

Shani Amavasya 2022 : Do's and Don'ts to Get Shani dev Blessings in Telugu

Here we are talking about the Shani Amavasya 2022: Do's and don'ts to get shani dev blessings in Telugu. Read on
Story first published:Wednesday, April 27, 2022, 14:09 [IST]
Desktop Bottom Promotion