For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Shani Amavasya Upay 2022 :శని అమావాస్య రోజున ఇలా చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయట...!

2022లో ఏప్రిల్ మాసంలో శని అమావాస్య సందర్భంగా శని దేవుని అనుగ్రహం పొందడానికి ఈ పరిహారాలు పాటించండి.

|

హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి క్రిష్ణ పక్షం చివరి తేదీ రోజున అమవాస్య వస్తుంది. అమావాస్య రోజున జాబిల్లి ఆకాశంలో కనిపించకుండా పూర్తిగా మాయమవుతాడు. హిందూ మత విశ్వాసాల ప్రకారం శనివారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది. 2022లో ఏప్రిల్ 30వ తేదీన వైశాఖ అమావాస్య వచ్చింది.

Shani Amavasya Upay 2022: Astrological Remedies to get rid of Shani Sade Sati and Dhaiya in Telugu

దీనినే శని అమావాస్య అని కూడా అంటారు. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి, శని దేవుని అనుగ్రహం పొందడానికి ఈరోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ శని అమావాస్య రోజునే సూర్య గ్రహణం, త్రిగ్రాహి కలయిక వంటి అరుదైన సంఘటనలు జరగనున్నాయి.

Shani Amavasya Upay 2022: Astrological Remedies to get rid of Shani Sade Sati and Dhaiya in Telugu

ఇదిలా ఉండగా.. హిందూ క్యాలెండర్ ప్రకారం, వైశాఖ బహుళ అమావాస్య 2022 సంవత్సరంలో ఏప్రిల్ 29వ తేదీన అంటే శనివారం నాడు అర్ధరాత్రి 12:57 గంటలకు ప్రారంభమవుతుంది. హిందూ పురాణాల ప్రకారం, ఆరోజు నుండే వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 30వ తేదీ అర్థరాత్రి 1:57 గంటలకు పూర్తవుతుంది. ఈ సందర్భంగా శని అమావాస్య రోజున ఏర్పడే త్రిగ్రాహి యోగ ప్రభావం మనపై ఎలా ఉంటుంది. ఈ సమయంలో మనం శని దేవుని అనుగ్రహం పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Shani Amavasya 2022 :శని దోష నివారణకు ఈ పరిహారాలు పాటించండి...Shani Amavasya 2022 :శని దోష నివారణకు ఈ పరిహారాలు పాటించండి...

త్రిగ్రాహి కలయిక..

త్రిగ్రాహి కలయిక..

ఈ ఏడాది శని అమావాస్య సూర్య గ్రహణం రోజున అరుదైన సంఘటనలు ఏర్పడనున్నాయి. ఏప్రిల్ 30న ఏర్పడే సూర్య గ్రహణ ప్రభావం మన దేశంపై అంతగా ఉండదు. ఇది పాక్షిక గ్రహణం కాబట్టి సూతక కాలం కూడా చెల్లదు. అదే విధంగా ఈ శని అమావాస్య రోజున మేషరాశిలో సూర్యుడు, చంద్రుడు, రాహువు కలయిక వల్ల తిగ్రాహి కలయిక ఏర్పడుతుంది. ఇది చాలా అరుదైన సందర్భాల్లో జరుగుతుందని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతున్నారు.

శని అనుగ్రహం కోసం..

శని అనుగ్రహం కోసం..

* శని అమావాస్య రోజున శని దేవుని అనుగ్రహం కోసం ఆవాల నూనె, నల్ల నువ్వులు, నీలి రంగు పువ్వులు సమర్పించాలి.

* శని దోషం నుండి విముక్తి పొందడానికి, శని ప్రభావం నుండి ఉపశమనం పొందడానికి శని అమావాస్య రోజున శని దేవుని మంత్రాలను పఠించాలి.

*పేదలకు ఆహారం అందించడం, మీ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయడం వల్ల శని దేవుని అనుగ్రహం పొందొచ్చు.

శని ఆరాధనతో..

శని ఆరాధనతో..

* శని అమావాస్య రోజున శని దేవుని ఆరాధించడం వల్ల వ్యాపారులకు వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. ఉద్యోగులకు ఉన్నత స్థానం లభిస్తుంది.

* శని అమావాస్య రోజున కుటుంబ సభ్యులందరూ ఆవనూనెతో దీపారాధన చేసి, హనుమాన్ చాలీసా పఠించాలి.

* ఇలా చేయడం వల్ల అన్ని ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతారు

Shani Amavasya 2022: శని అమావాస్య ఎప్పుడు? పూజా విధానాలేంటో చూడండి...Shani Amavasya 2022: శని అమావాస్య ఎప్పుడు? పూజా విధానాలేంటో చూడండి...

పూర్వీకుల బాధ..

పూర్వీకుల బాధ..

వైశాఖ మాసంలోని శని అమావాస్య రోజున ఉపవాసం ఉంటే.. అనేక ప్రయోజనాలు చేకూరతాయని చాలా మంది నమ్మకం. ఈరోజున ఉపవాసం ఉంటే.. మన పూర్వీకుల బాధలను తీర్చడమే కాక.. రాహువు బలహీనత మరియు ఇతర సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతారు. అలాగే శని దేవుని ప్రసన్నం చేసుకోవచ్చని పండితులు చెబుతారు.

ఆవ నూనెతో స్వీట్లను..

ఆవ నూనెతో స్వీట్లను..

శని అమావాస్య రోజున శని మంత్రాన్ని 5, 7, 11 లేదా 21 సార్లు జపించండి మరియు శని చాలీసాను కచ్చితంగా పఠించాలి. చివరగా శని దేవునికి హారతి ఇవ్వడం మరచిపోవద్దు. ఈ పవిత్రమైన రోజున ఆవనూనెతో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించాలి.

దాన ధర్మాలు..

దాన ధర్మాలు..

శని అమావాస్య రోజున నల్ల నువ్వులు, నల్ల ఉసిరి, నల్లని గుడ్డలు, ఏదైనా ఇనుము వస్తువులు మరియు ఆవనూనె మొదలైన వాటిని అవసరాన్ని బట్టి లేదా పేదవారికి దానం చేయాలి. అనంతరం శని స్తోత్రాన్ని మూడుసార్లు పఠించండి. ఇలా చేయడం వల్ల మీకు శని మహాదశ బాధలు తగ్గడంతో పాటు శని దేవుని అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతారు.

FAQ's
  • 2022లో శని అమావాస్య ఎప్పుడొచ్చొంది? శుభ ముహుర్తం ఎప్పుడు?

    హిందూ క్యాలెండర్ ప్రకారం, వైశాఖ బహుళ అమావాస్య 2022 సంవత్సరంలో ఏప్రిల్ 29వ తేదీన అంటే శనివారం నాడు అర్ధరాత్రి 12:57 గంటలకు ప్రారంభమవుతుంది. హిందూ పురాణాల ప్రకారం, ఆరోజు నుండే వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 30వ తేదీ అర్థరాత్రి 1:57 గంటలకు పూర్తవుతుంది. ఈరోజున దేవుళ్లకు పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. జీవితంలో సుఖ సంతోషాలొస్తాయని భక్తుల విశ్వాసం.

English summary

Shani Amavasya Upay 2022: Astrological Remedies to get rid of Shani Sade Sati and Dhaiya in Telugu

Here we are talking about the shani amavasya upay 2022:Astrological remedies to get rid of shani sade sati and dhaiya in Telugu. Read on
Desktop Bottom Promotion