For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శని జయంతి 2020 : ఈరోజున ఈ పనులను ఎందుకు చేయరాదంటే...

శని జయంతి రోజున ఏయే పనులు ఏయే పనులు చేయాలో, ఏవి చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం...

|

హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ చతుర్దశి అనంతరం వచ్చే అమావాస్య రోజున శని జయంతిని జరుపుకుంటారు. సాధారణంగా మనకు ఉన్న ఏడు రోజుల్లో వారంలో ఒకరోజు అంటే శనివారం నాడు శనీశ్వరుడు శని గ్రహాన్ని పాలిస్తుంటాడు. సూర్యదేవ భగవానుడి కుమారుడైన శని.. శనిగ్రహం స్వరూపం.. ఈ దేవుడిని ఆరాధించడం వల్ల వారి జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులన్నీ సులభంగా పూర్తవుతాయని అనేక మంది భక్తులు నమ్ముతారు.

Shani Jayanti 2020 : Dos and Donts on Shani Jayanti

అంతేకాదు శని దేవుని ఆశీర్వాదం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని కూడా హిందువులలో చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తారు. సూర్యదేవుని కుమారుడైన శని పుట్టినరోజు సందర్భంగా శని జయంతిని ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మానవుల జీవితంపై శని తీవ్ర ప్రభావం చూపుతాడు. అంతేకాకుండా శని గ్రహానికి రాజు ఆయనే. జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో శని దేవుడికి పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్మకం. అయితే ఈ శని జయంతి నాడు కొన్ని పనులను అస్సలు చేయకూడదట. అంతేకాదు మరికొన్ని పనులు కచ్చితంగా చేయాలంట. అలా చేస్తే భక్తులు కష్టాలు, సమస్యల నుండి విముక్తి పొందుతారట. అలాగే దుష్ట, చెడు ప్రభావాల నుండి ఉపశమనం సైతం లభిస్తుందట.

శని జయంతి తేదీ

శని జయంతి తేదీ

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జ్యేష్ట మాస అమావాస్య రోజున ప్రతి సంవత్సరం శని జయంతిని జరుపుకుంటారు. ఈ 2020 సంవత్సరంలో మే నెలలో 22వ తేదీన అంటే శుక్రవారం నాడు శని జయంతి వచ్చింది.

శని జయంతి ముహూర్తం..

శని జయంతి ముహూర్తం..

శని జయంతి ముహుర్తం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే మే 21వ తేదీ రాత్రి 9.35 గంటలకు మొదలై తిరిగి 22వ తేదీ ఉదయం 11:30 గంటల వరకు ఉంటుంది.

శని దేవుని ఆరాధన..

శని దేవుని ఆరాధన..

మనం ఇతర దేవతలను ఎలాగైతే పూజిస్తామో.. శని జయంతి రోజున అలాగే శని దేవుడిని ఆరాధించాలి. ముఖ్యంగా ఈరోజున ఉపవాసం ఉండాలనుకున్న వారు ఉపవాసం ఉండొచ్చు. అంతకంటే ముందు ఉదయాన్నే లేచి స్నానం చేయాలి. అనంతరం మంచి రంగులు ఉన్న వస్త్రాలను ధరించాలి. వీలైతే కొత్త వస్త్రాలను లేదా శుభ్రమైన నల్లటి దుస్తులను ధరించాలి.

శని దేవుని చిత్రపటం..

శని దేవుని చిత్రపటం..

శని దేవుని విగ్రహం లేదా చిత్రపటాన్ని ఉంచి, దాని ఎదుట స్వచ్ఛమైన దీపం వెలిగించాలి. కుంకుమ, సింధూరం, మంచి సువాసన గల అగర్ బత్తిలను వెలిగించి, శని దేవునికి నీలం లేదా నలుపు రంగులో పువ్వులను సమర్పించాలి. ఐదు రకాల పండ్లను దేవుని వద్ద ఉంచి శని దేవుడిని ఆరాధించాలి. ఈ ఆరాధన సందర్భంగా శని చాలీసా పఠించండి. చివరిగా హారతి ఇచ్చి శని పూజను ముగించండి.

ఏయే పనులు చేయాలంటే..

ఏయే పనులు చేయాలంటే..

శని దేవుడిని సంతోషపెట్టేందుకు నూనెను దానం చేయాలి.

మీ సామర్థ్యం మేరకు పేదవారికి సహాయం చేయాలి.

మీకు వీలైతే గుర్రపు ఉంగరాన్ని ధరించడం లేదా ఇంటికి బయట దాన్ని వేలాడదీయడం వంటివి చేయాలి.

శని స్తోత్రాన్ని నిత్యం పఠిస్తే ఆశీర్వాదం లభిస్తుంది.

నలుపు రంగు వస్త్రాలను దానం చేయాలి.

నలువు రంగు వస్త్రాలు లేకపోతే, ఆవాలు నూనెను కూడా దానం చేయొచ్చు.

ఇవి చేయకూడదు..

ఇవి చేయకూడదు..

శని జయంతి రోజున మద్యం మరియు మాంసాహారం తీసుకోకూడదు.

శని దేవుని ఆరాధన సమయంలో మీ ద్రుష్టిని ఎట్టిపరిస్థితుల్లో మరల్చకూడదు. లేదంటే ఇబ్బందులు తప్పవు.

శని దేవుని ఆరాధనలో ఎరుపు రంగును వాడకూడదు.

ఎందుకంటే ఎరుపు రంగు అంగారకుడిని సూచిస్తుంది.

ఇది శని యొక్క శత్రువుగా పరిగణించబడుతుంది.

English summary

Shani Jayanti 2020 : Do's and Dont's on Shani Jayanti

Shani Jayanti is a Hindu festival it will be celebrated on 22nd May in 2020. Lets know the rituals of Shani Jayanti and puja shubh muhurat etc.
Story first published:Thursday, May 21, 2020, 20:19 [IST]
Desktop Bottom Promotion