For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Shravana Masam 2022: శ్రావణ మాసంలో శివుడిని ఇలా పూజిస్తే.. కచ్చితంగా ఫలితమొస్తుందట...!

శ్రావణ మాసంలో శివ పూజ విశిష్టత మరియు శివుడిని ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ మతంలో ముక్కోటి దేవుళ్లు ఉన్నారని పండితులు చెబుతుంటారు. అయితే ముల్లోకాల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే ముఖ్యమైన వారని.. వీరిలో శివుని ఆదేశం లేనిదే చీమైనా పుట్టదని చెబుతారు.

Shiv Puja Importance and Benefits in Shravan Month in Telugu

అందుకే ఆ పరమేశ్వరుడిని ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శివుడిని రెండు రూపాల్లో పూజిస్తారు. ఒకటి లింగారాధన.. ఇది విశ్వ శక్తిని సూచిస్తుంది. శివలింగ ఆరాధన అనేది శక్తి శివపార్వతుల ఐక్యతను సూచిస్తుంది.

Shiv Puja Importance and Benefits in Shravan Month in Telugu

దీని ఫలితంగానే విశ్వం ఏర్పడుతుంది. అందుకే మనలో చాలా మంది శివుడిని లింగ రూపంలో పూజిస్తారు. మరో రూపంలో విగ్రహారాధన చేస్తారు. ఇదిలా ఉండగా.. శివుడిని శ్రావణ మాసంలో ఎలా పూజించాలి... శివునికి ఈ మాసం అంటే ఎందుకని ప్రీతికరమైనది.. ఈ నెలలో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి అనే పూర్తి వివరాలను ఇప్పడు తెలుసుకుందాం...

Shravan Masam 2021: ఈ ఏడాది శ్రావణ మాసం ఎప్పుడు? ఈ మాసంలో ఉపవాసముంటే కోరికలన్నీ నెరవేరుతాయట...!Shravan Masam 2021: ఈ ఏడాది శ్రావణ మాసం ఎప్పుడు? ఈ మాసంలో ఉపవాసముంటే కోరికలన్నీ నెరవేరుతాయట...!

శివుని ఆరాధనలో..

శివుని ఆరాధనలో..

కైలాస అధిపతి అయిన పరమేశ్వరుడి ఆరాధనలో ప్రధానమైనది అభిషేకం. మారేడు ఆకులతో శివుడిని పూజించడం అనే ఆచారం ఆనాటి నుండి అనాదిగా వస్తుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు శివుడిని పూజించే పువ్వులకు కూడా చాలా ప్రత్యేకతలున్నాయి.

పువ్వులతో శివుని పూజ..

పువ్వులతో శివుని పూజ..

మీరు శ్రావణ మాసంలో మనసులో ఎలాంటి కోరికలు లేకుండా పువ్వులతో పూజ చేస్తే మీకు కచ్చితంగా విముక్తి లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు.

శివుడిని ఇలా పూజిస్తే..

శివుడిని ఇలా పూజిస్తే..

మీకు ఆదాయ పరంగా మెరుగైన ఫలితాలు కావాలంటే.. శివుడిని పద్మాలు, మారేడు దళాలతో పూజించాలి. బియ్యపు గింజలతో శివుడిని ఆరాధించినా ఇలాంటి ఫలితం వస్తుంది.

ఈ పూలను వాడొద్దు..

ఈ పూలను వాడొద్దు..

మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడటానికి శివలింగానికి జలాభిషేకం చేయాలి. అలాగే శత్రు నాశనానికి తైలాభిషేకం చేయాలి. ఆరోగ్యం కావాలనుకునే వారు సుమారు 59 వేల రకాల పువ్వులతో పూజ చేయాలని.. అదే సమయంలో సంపంగి, మొగలిపువ్వులతో మాత్రం శివుడిని అస్సలు ఆరాధించడకూడదట. ఇలా మీరు ఒక్కో పూజతో శివుడిని ఆరాధించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి.

Shravana maasam 2021: శ్రావణ మాసంలో ఎన్ని ప్రత్యేకతలో మీరే చూడండి...Shravana maasam 2021: శ్రావణ మాసంలో ఎన్ని ప్రత్యేకతలో మీరే చూడండి...

రుద్రాక్షలతో..

రుద్రాక్షలతో..

ఆ పరమేశ్వరుడిని రుద్రాక్షల ప్రతిరూపాలుగా భావించి అందరూ కొలుస్తుంటారు. రుద్రాక్షలు మహా శక్తివంతమైనవి. తాము అనుకున్న పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయ్యేందుకు.. సమస్త దరిద్రాలు తొలగిపోయి సుఖసంతోషాలతో నడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుక రుద్రాక్ష. రుద్రాక్షలను రుషులు భూమికీ, స్వర్గానికీ మధ్య వారధిగా భావిస్తారు.

రుద్రాక్షలను ధరిస్తే..

రుద్రాక్షలను ధరిస్తే..

తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడేవారు రుద్రాక్షలను ధరిస్తే వారికి అతి తక్కువ కాలంలోనే పరిష్కారం లభిస్తుందని పెద్దలు చెబుతారు. అంతేకాదు చెడు అలవాట్ల బారిన పడిన వారు తాము చేసేది తప్పు అని తెలిసి బయటపడలేకపోయినా రుద్రాక్షలను ధరిస్తే కచ్చితం మంచి ఫలితం ఉంటుందట.

శ్రావణ సోమవారం..

శ్రావణ సోమవారం..

శ్రావణ సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈ పవిత్రమైన రోజున రుద్రాక్షను తెచ్చి నీటితో స్నానం చేయించి.. శుద్ధి చేసి శివుడిని ఆరాధించాలి. ఆ తర్వాతే మీరు రుద్రాక్షను ధరించాలి. అయితే రుద్రాక్షను ధరించిన వెంటనే ఫలితం ఆశించకూడదు. కోరుకున్న కోరికలు నెరవేరాలని రుద్రాక్షను ధరించే వారు పూర్తి విధానంతో, సాధనతో, గురువు సమక్షంలో ధరించాలి.

ఉపవాసం ఉండాలి..

ఉపవాసం ఉండాలి..

శ్రావణ మాసంలో సోమవారాలలో ఉపవాసం ఉండి చాలా పవిత్రంగా గడపాలి. ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి. సమీపంలోని శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేయాలి. అనంతరం మరుసటి రోజున ఉపవాస దీక్షను విరమించాలి. ఇలా చేయడం శివుని అనుగ్రహం మీకు తప్పక లభిస్తుందని పండితులు చెబుతారు.

English summary

Shravana Masam 2022: Shiv Puja Importance and Benefits in Shravan Month in Telugu

Here we are talking about the shiv puja importance and benefits in sharavan month in Telugu. Have a look
Desktop Bottom Promotion