For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శివ తాండవ స్త్రోత్రం చదివి పరమేశ్వరుడ్ని పూజిస్తే అన్ని శుభాలు, వందలాది ప్రయోజనాలు, అవేమిటో చూడండి

|

పరమశివుడ్ని భక్తితో పూజిస్తే చాలు భక్తులపై కటాక్షం చూపుతాడు. ఆరోగ్యంగా ఉండేలా చేస్తాడు. వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాడు. ముక్కంటిని ప్రజంలంతా రకరకాలుగా పూజిస్తుంటారు. ఆయన కరణ కోసం ఏవేవో చేస్తుంటారు. భక్తులు ఏది చేసినా ఆయనకు ఇష్టమే.

అయితే పరమేశ్వరుడికి నచ్చే సోత్రం ఒక్కటి ఉంది. అదే శివ తాండవ సోత్రం. రావణుడు కూడా శివతాండవ సోత్రం ద్వారానే శివుడి కటాక్షం పొందాడు. రావణుడే దీన్ని రాసి పాడి శివుడికి వినిపించాడు. కానీ శివతాండవ సోత్రం అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టం. ఆ సోత్రాన్ని మీరు నిష్టగా పఠిస్తే మీకు చాలా ప్రయోజనాలు చేకూరుతాయి.

సంపద
 

సంపద

శివ తాండవ సోత్రం ద్వారా చాలా ప్రయోజనాలున్నాయి. అందులో ఒకటి మీ సంపద పెరగడం. ఈ సోత్రాన్ని పఠిస్తే మీ ఆదాయం పెరుగుతుంది. శివుడిపై మనస్సు లగ్నం చేసి ఆయన్ని మనసారా ప్రార్థించాలి. అలా చేస్తే మీ వ్యాపారంలో నష్టాలు పెద్దగా రాకపోవొచ్చు. కొన్ని రకాల విలాసాలను కూడా మీరు పొందుతారు.

భార్యాభర్తలకు..

భార్యాభర్తలకు..

శివ తాండవ సోత్రాన్ని చదివితే భార్యాభర్తలకు.. చాలా ప్రయోజనాలుంటాయి. మీ వైవాహిక జీవితం హ్యాపీగా ఉంటుంది. మీరు అనుకున్నవన్నీ నెరవెరే అవకాశం ఉంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆనందంగా జీవిస్తారు. భర్త, భార్య ఇద్దరూ స్తోత్రాన్ని పఠిస్తే ఇంకా మంచిది.

ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి

ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి

శివ తాండవ సోత్రం ద్వారా మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీరు ఎలాంటి ఫైనాల్స్ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. అప్పులన్నీ కూడా తీర్చగలరు. అలాగే భవిష్యత్తులో రుణాలపై ఆధారపడాల్సిన అవసరం కూడా రాదు.

పెళ్లికి సంబంధించిన సమస్యలు
 

పెళ్లికి సంబంధించిన సమస్యలు

మీరు యాభై-ఒక్కరోజుల పాటు రోజూ శివతాండవ శ్లోకాన్ని పఠిస్తే చాలు పెళ్లికి సంబంధించిన సమస్యలు ఏర్పడవు. మీకు త్వరగా వివాహం అవుతుంది.

Most Read : రాత్రిపూట పీడకలలు రాకుండా ఉండాలంటే ఇలా చెయ్యాలి, ఒక్క కల కూడా రాదు, ప్రశాంతంగా పడుకోవొచ్చు

వృత్తి పరంగా ఎదుగుదలకు

వృత్తి పరంగా ఎదుగుదలకు

శివ తాండవ సోత్రాన్ని రోజూ పఠిస్తే వృత్తి పరంగా కూడా మీరు ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. జాబ్ లో ఉన్నత స్థాయికి వెళ్తారు. మీరు 41 రోజుల పాటు శివతాండవ సోత్రాన్ని రోజూ పఠించాలి.

న్యాయసంబంధ విషయాలు

న్యాయసంబంధ విషయాలు

మీరు న్యాయపరమైన విషయాల్లో ఇబ్బందులుపడుతున్నా లేదంటే శత్రువులతో అవరోధాలు ఎదుర్కొంటున్నా శివ తాండవ సోత్రాన్ని పఠించడం ముఖ్యం. రోజూ సాయంత్రం 31 రోజుల పాటు ఈ స్తోత్రాన్ని మీరు పఠిస్తే న్యాయ సంబంధం విషయాల్లో విజయం సాధిస్తారు.

గ్రహణం సమయంలో

గ్రహణం సమయంలో

శివ తాండవ సోత్రాన్ని ఏ గ్రహణ సమయంలోనైనా పఠిస్తే ఇంకా మంచిది. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వచ్చినప్పుడు 1008 సార్లు ఈ సోత్రాన్ని పఠిస్తే మంచిది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి.

పిల్లలు లేని వారు

పిల్లలు లేని వారు

చాలా రోజులుగా పిల్లలు కలగని వారు కూడా శివ తాండవ సోత్రాన్ని పఠిస్తే మంచిది. శుక్ల పక్ష త్రయోదశి లేదా కృష్ణ పక్ష త్రయోదశిన ఇలా చేయడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం ఉంది.

Most Read : 2019లో ఈ రాశుల వారి జీవితాలు ఇలా ఉంటాయి, చాలా విషయాల్లో మార్పు వస్తుంది

నియమాలు

నియమాలు

జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే

గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్

డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం

చకార చండతాండవం తనోతు నః శివః శివమ్

అనే శివ తాండవ సోత్రం మొత్తాన్ని మీరు పఠించాల్సి ఉంటుంది. ఈ సోత్రాన్ని మీరు పుస్తకాలు లేదంటే నెట్ ద్వారా పొందవచ్చు.

1. శరీరం, మనస్సు రెండింటిని నిష్టంగా ఉంచుకుని శివతాండ స్తోత్రాన్ని జపించాలి.

2. మీ ఉచ్చారణ సరిగ్గా ఉండాలి. నెమ్మదిగా చదవాలి. హడావిడి చేయకండి. అలా చేస్తే ఉచ్చరణ తప్పు పలుకుతారు.

పఠించేటప్పుడు

పఠించేటప్పుడు

3. మీరు శివతాండవ స్త్రోత్రం పఠించేటప్పుడు ఎవరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండేలా చూసుకోండి. మధ్యలో మాట్లాడడం మంచిది కాదు.

4. మీరు స్తోత్రం సరిగ్గా శివుడి పటం లేదంటే విగ్రహం ఎదుట కూర్చొని చదివితే మంచిది.

English summary

Shiv Tandav Stotra All You Need To Know About It

Shiv Tandav Stotra All You Need To Know About It
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more