For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ద్రౌపది గర్భం నుంచి పుట్టలేదా !? మరి ఎలా పుట్టింది ?

By Swathi
|

హిందూ పురాణాల్లో మహాభారతం చాలా గొప్పది. మహాభారం గురించి చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది. కానీ కొన్ని విషయాలు మాత్రం మహాభారతంలో మిస్టరీగా మిగిలాయి. ఈ పురాణ గాధలో ప్రతి ఒక్కటి చాలా ఆసక్తికర వాస్తవాలను ఇమిడి ఉంటుంది. అందుకే ఏ ఒక్క విషయాన్ని పూర్తీగా, వివరణాత్మంగా చెప్పలేం. పాత పుస్తకాలను ఎవరైతే చదివి ఉంటారో వాళ్లకు మహాభారతంలోని ప్రతి విషయం తెలిసి ఉంటుంది.

రావణుడు రాక్షసుడని తెలుసు.. మరి ఎవరి భక్తుడో తెలుసా ?

శాస్త్రాల్లో మహాభారతం ఐదవ వేదం. దీన్ని వేదవ్యాసుడు రాశాడు. మహాభారతంలోని ప్రతి పాత్రను చాలా కూలంకశంగా వివరించారు. ఐదుగురు పాండవుల భార్య ద్రౌపది గురించి చాలా విషయాలు మహాభారతం ద్వారా తెలుసుకోవచ్చు. వేదవ్యాసుడు రాసిన పుస్తకం ద్వారా ద్రౌపది గురించి కొన్ని ఆసక్తికర వాస్తవాలు మీకు వివరించబోతున్నాం. ఆమె పాండవుల భార్యగానే చాలామందికి తెలుసు. కానీ.. ఆమె జీవితం, పుట్టుక, తల్లిదండ్రులు, స్నేహితుల గురించి చాలా ఆశ్చర్యకర విషయాలు ఉన్నాయి.

యగ్నసేని

యగ్నసేని

ద్రౌపది తల్లి గర్భాశయం నుంచి జన్మించలేదు. ఈమె అగ్ని నుంచి పుట్టింది. అది కూడా శిశువుగా పుట్టలేదు. యుక్తవయస్సుతో పుట్టింది. ఒక్కసారి ఊహించుకోండి.. చిన్నతనం లేకుండా.. ఒకేసారి యుక్తవయస్సులో పుట్టడం, వారసత్వ లక్షణాలు పొందడం అంటే చాలా ఆసక్తిగా ఉంది కదూ. పాంచాల రాజు అయిన ద్రుపదుడుకి అగ్ని ద్వారా జన్మించింది. ఆ కాలంలో ద్రౌపది చాలా అందమైన మహిళ.

కూతురే కాదు, యువరాణి కూడా

కూతురే కాదు, యువరాణి కూడా

మహాభారతం సమయంలో ద్రౌపది ఒక శక్తివంతమైన రాజ్యానికి యువరాణి. ఒకప్పుడు అమ్మాయిగా ఉండి, తర్వాత జెండర్ మార్చుకున్న.. షిఖండి సోదరి ద్రౌపది.

రాణి

రాణి

పాండవులకు భార్య అయిన తర్వాత ద్రౌపది ఐదుగురు భర్తలను పొందింది. ఆమె వాళ్ల అత్తగారింట్లో అడుగుపెట్టిన తర్వాత తన భర్తలు నిరంతర ముప్పులో ఉన్నట్టు తెలుసుకుంది. ఆఖరికి రాణి అయిన తర్వాత తన రాజ్య ప్రజలు ప్రశాంతంగా ఉండేలా చేసింది.

తల్లి

తల్లి

ప్రతి భర్తతో ఒక కొడుకుని కనింది ద్రౌపది. అంటే ఐదుగురు కొడుకులకు తల్లి ద్రౌపది. వాళ్లను ఉప పాండవులు అంటారు.

స్నేహితుడు

స్నేహితుడు

శ్రీకృష్ణుడుకి ప్రాణ స్నేహితురాలు ద్రౌపది. ఆమె పేరు కూడా కృష్ణుడే కదా. భక్తి, దృఢత్వం, నీతితో ద్రౌపది శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందింది.

రకరకాల పేర్లు

రకరకాల పేర్లు

ద్రౌపదికి పాంచాలి, యగ్నసేని, మహాభారతి, సైరాంధ్రి అనే పేర్లు ఉన్నాయి. పాంచాల రాజ్యానికి రాణి కావడం వల్ల పాంచాలి అనే పేరు, అగ్ని దేవుడి ద్వారా జన్మించడం వల్ల యగ్నసేని అనే పేరు, ఐదుగురికి భార్య అవడం వల్ల మహాభారతి అనేపేర్లు వచ్చాయి.

ద్రౌపదికి 14మంది భర్తలు ఉండాల్సినది..

ద్రౌపదికి 14మంది భర్తలు ఉండాల్సినది..

ద్రౌపది పూర్వ జన్మలో 14 లక్షణాలున్న వ్యక్తిని భర్తగా కావాలని శివుడిని కోరిందట. అయితే ఎవరికీ 14 క్వాలిటీలు లేకపోవడంతో.. 5మందికి నీకు కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయని శివుడు చెప్పాడట. ధర్మం, శక్తి, బాణం వేయడంలో నైపుణ్యం, అందం, ఓర్పు ఉన్న వ్యక్తిని ప్రసాదించమని కోరింది. అప్పుడు ఒక్కో గుణం ఒక్కొక్కరిలో ఉండటంతో.. పాండవులను పెళ్లాడింది ద్రౌపది.

మరో కథనం

మరో కథనం

రెండవ జన్మలో ద్రౌపది కాశీరాజు కూతురిగా జన్మించింది. చాలాకాలం కన్యగా ఉన్న ఈమె శివుని అనుగ్రహం కోసం తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా పతి కావాలని ఐదుసార్లు కోరింది. శివుడు తధాస్తు అన్నాడు. తర్వాత శివుడు ఇంద్రున్ని ఐదు మూర్తులుగా రూపొందించి మానవులుగా పుట్టాలని శాసించాడు. ఆ పంచేంద్రియాలే ధర్ముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వినులు. వారి ద్వారా పంచపాండవులు జన్మించారు.

ధైర్యశాలి

ధైర్యశాలి

ద్రౌపది చాలా ధైర్యశాలి. భయంలేని మహిళ. తనను అవమానపరిన తర్వాత నేరుగా హస్తీనాపురం రాజు ధ్రుతరాష్ట్రుడినే న్యాయం అడిగిందట.

కాళీ అవతారం

కాళీ అవతారం

ద్రౌపది కాళీ అవతారంలో మళ్లీ శ్రీకృష్ణుడికి జన్మించిందని దక్షిణ భారతీయులు నమ్ముతారు. భారతదేశంలో ఉన్న దురహంకార రాజులను నాశనం చేయడానికి పుట్టిందని విశ్వసిస్తారు.

ద్రౌపది పాత్ర

ద్రౌపది పాత్ర

లక్ష్మీదేవికి అక్షయ పాత్రలాగ.. ద్రౌపదికి ద్రౌపది పాత్ర ఉండేదట. అంటే.. ఈ పాత్రలో ఎప్పుడు రకరకాల ఆహారాలు తింటుంటూ.. ఊరేవట. ఆహారానికి కొరతలేకుండా.. ఈ పాత్రలో ఎప్పుడూ ఉండేవని మహాభారతం చెబుతోంది.

అవతారాలు

అవతారాలు

నారద పురాణం, వాయు పురాణం ప్రకారం ద్రౌపది శ్వామలాదేవిగా ధర్మానికి భార్య, భారతిదేవిగా అంటే వాయుదేవుడి భార్యగా, శాచి ఇంద్రుడి భార్యగా, అశ్విన్ భార్యగా ఉషా, శివుడి భార్యగా పార్వతి అవతారాలు ధరించినట్లు తెలుస్తోంది. అంతకుముందు రావణుడి సంహారం కోసం వేదవతిగా, రావణాసురుడి సంహారం కోసం సీతగా జన్మించిందని ఆ తర్వాత ద్రౌపదిగా పుట్టినట్టు పురాణాలు చెబుతున్నాయి.

కన్య

కన్య

ఒక భర్త దగ్గర నుంచి మరో భర్త దగ్గరకు వెళ్లేటప్పుడు ద్రౌపది అగ్నిలో నడుచుకుంటూ వెళ్లేది. దీనివల్ల ఆమె కన్నెత్వాన్ని, పవిత్రతను మళ్లీ పొందేదట.

విల్లు, బాణం

విల్లు, బాణం

ద్రౌపదికి విల్లు, బాణం సంధించడం అంటే.. అమితమైన ఇష్టం.

అర్జునుడు

అర్జునుడు

పాండవులు అందరిలోకి ద్రౌపదికి అర్జునుడంటేనే ఎక్కువ ఇష్టం.

స్వయంవరం

స్వయంవరం

ద్రౌపదితో స్వయంవరానికి వెళ్లడానికి ముందు తమ పురోహితుడిగా ధౌమ్య రిషిని నియమించుకున్నారు. ఎందుకంటే అతను గొప్ప వ్యక్తి, నాలెడ్జ్ కలిగిన వ్యక్తి. అతను వాళ్లకు సలహాలు ఇవ్వడం వల్లే.. ద్రౌపది వాళ్లను ఎంచుకుంది.

English summary

shocking facts about Draupadi’s life

shocking facts about Draupadi’s life. we are going to reveal some unknown but interesting facts about Draupadi’s character and her life that may come across as a shock to many.
Story first published:Friday, May 27, 2016, 15:30 [IST]
Desktop Bottom Promotion