For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Shravan Month 2021:శ్రావణ మాసంలో ఈ పనులు అస్సలు చేయకండి... మరి ఏ పనులు చేయాలంటే...!

శ్రావణ మాసంలో చేయాల్సిన మరియు చేయకూడని పనులేంటో తెలుసుకునేందుకు ఇక్కడ ఓ లుక్కేయండి.

|

హిందూ పంచాంగం ప్రకారం.. ఐదో నెలలో శ్రావణ మాసం వస్తుంది. ఈ మాసం హిందువులకు ఎంతో ప్రత్యేకమైనది. ఆధ్యాత్మిక పరంగా శ్రావణ మాసం అంటే పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనది.

Shravan month dos and donts in Telugu

ఈ మాసంలోనే సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో చాలా మంది హిందువులు ఎంతో పవిత్రంగా భావించి.. వ్రతాలు, నోములు, ప్రత్యేక పూజలు చేస్తారు.

Shravan month dos and donts in Telugu

ముఖ్యంగా శ్రావణ సోమవారం వ్రతం, మంగళవారం, మంగళ గౌరీ వ్రతం వంటివి చేస్తారు. ఈ సందర్భంగా శ్రావణ మాసంలో చేయాల్సిన ముఖ్యమైన పనులేంటి.. ఏయే పనులు అస్సలు చేయకూడదనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Shiva Puja:శివుడికి పొరపాటున కూడా ఈ వస్తువులతో పూజ చేయకూడదు... ఎందుకో తెలుసా...Shiva Puja:శివుడికి పొరపాటున కూడా ఈ వస్తువులతో పూజ చేయకూడదు... ఎందుకో తెలుసా...

శివరాధనకు..

శివరాధనకు..

శ్రావణ మాసం శివుని ఆరాధనకు ప్రత్యేకమైనది. ఈ మాసంలో పరమేశ్వరుడిని పూజించడం వల్ల వైవాహిక జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి.. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం లభిస్తుందని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. ఈ సమయంలో శివపార్వతుల అనుగ్రహం భక్తులకు కచ్చితంగా లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

అనుకూల వాతావరణం..

అనుకూల వాతావరణం..

ఈ సమయంలో భక్తులు తాము చేసిన తప్పులను మన్నించమని మనస్ఫూర్తిగా కోరుకుంటే.. జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి బయటపడేందుకు అవకాశం లభిస్తుందని.. అంతేకాదు ప్రతికూల వాతావరణం నుండి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని, లక్కీ కూడా కలిసొస్తుందని చాలా మంది నమ్ముతారు.

ఈ మంత్రాన్ని పఠించండి..

ఈ మంత్రాన్ని పఠించండి..

శ్రావణ మాసంలో మీరు శివుడిని పూజించే ప్రతిసారీ ‘ఓం నమ శివాయః' అనే మంత్రాన్ని స్మరిస్తూ ఉండాలి. దీని వల్ల శివుని అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుందని పండితులు చెబుతారు. అలాగే శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలను సమర్పించండి. పరమేశ్వరుడితో పాటు పార్వతీ దేవిని కూడా పూజించాలి. శ్రావణ సోమవారం రోజున సాయంకాల వేళ తప్పకుండా దీపం వెలిగించాలి లేదా హారతి ఇవ్వాలి.

ఉపవాసం ఉండండి..

ఉపవాసం ఉండండి..

శ్రావణ సోమవారం అంటే శివుడికి ఎంతో ప్రీతికరమైనది. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా ఉపవాస దీక్షను కొనసాగించండి. ఈ సమయంలో ఉప్పు ఉండే ఆహారాన్ని తీసుకోకండి. సాధ్యమైనంత వరకు పండ్లు, పండ్ల రసాలను మాత్రమే తీసుకోండి. పాలు కూడా తాగొచ్చు.

August 2021:శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగలు, వ్రతాలు ఎప్పుడొచ్చాయో చూసెయ్యండి...August 2021:శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగలు, వ్రతాలు ఎప్పుడొచ్చాయో చూసెయ్యండి...

రుద్రాక్షలు ధరించాలి..

రుద్రాక్షలు ధరించాలి..

మీరు ఎప్పటి నుండో రుద్రాక్షలను ధరించాలని అనుకుంటూ ఉంటే.. శ్రావణ మాసం రుద్రాక్షలను ధరించేందుకు అనువైన సమయం. ఎందుకంటే రుద్రాక్షను శివుని స్వరూపంగా భావిస్తారు. వీటిని ధరించడం ఎంతో పవిత్రంగా పరిగణించబడుతుంది.

ఇవి దానం చేయండి..

ఇవి దానం చేయండి..

శ్రావణ మాసంలో పాలు, పాలకు సంబంధించిన ఉత్పత్తులు పెరుగు, నెయ్యి వంటి వాటిని దానం చేయాలి. ఇలా చేస్తే మీరు కోరుకున్న ఫలితాలు లభిస్తాయి. అలాగే శ్రావణ మాసానికి ముందే మీ ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోండి. ఉతికిన బట్టలనే ధరించండి.

ఇవి చేయకండి..

ఇవి చేయకండి..

శ్రావణ మాసంలో పొరపాటున కూడా మాంసం జోలికి వెళ్లొద్దు. అలాగే మద్యం కూడా తీసుకోకూడదు. మీరు పొరపాటున వీటిని తీసుకుంటే శివుడు ఆగ్రహిస్తాడట. అలాగే ఈ నెలలో మీరు నూనెతో మీ బాడీని మసాజ్ వంటివి చేసుకోకూడదు. శ్రావణ మాసంలో మధ్యాహ్నం వేళ నిద్రపోవడాన్ని నిషేధించారు. అలాగే గడ్డం మరియు జుట్టు కత్తిరించకూడదు.

ఈ పాత్రల్లో తినొద్దు..

ఈ పాత్రల్లో తినొద్దు..

శ్రావణ మాసంలో ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి పదార్థాలను తినడం మానేయాలి. అలాగే కాంస్య(రాగి)పాత్రలలో కూడా ఈ నెలలో నిషేధించబడింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే శివునికి తులసి ఆకులను అస్సలు సమర్పించంకండి.

English summary

Shravan month dos and don'ts in Telugu

Here we are talking about the shravana month do's and don'ts in Telugu. Have a look
Story first published:Tuesday, August 3, 2021, 17:58 [IST]
Desktop Bottom Promotion