For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Shravana Amavasya 2021: శ్రావణ అమావాస్య ఎప్పుడు? ఈ అమావాస్య ప్రత్యేకతలేంటి?

2021లో శ్రావణ మాసం ఎప్పుడొచ్చింది.. ఈ మాసం యొక్క చరిత్ర, ప్రాముఖ్యత మరియు పూజా విధానం ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ పంచాంగం ప్రకారం, మరికొద్ది రోజుల్లో ఆషాఢ మాసం ముగియబోతోంది. అదే సమయంలో శ్రావణ మాసంలోకి మనం అడుగుపెట్టనున్నాం.

Shravana Amavasya 2021 Date, History, Puja Vidhi, Significance, And How Is It Observed in Telugu

ఈ మాసంలో చాలా మంది ఇళ్లన్నీ దేవాలయాలను తలపిస్తాయి. ఈ నెల రోజుల సమయంలో ఉదయం, సాయంత్రం భగవంతుడి నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణ మాసంలో చేపట్టే ఎలాంటి కార్యక్రమానికైనా ఎంతో పవిత్రత ఉంటుందని పండితులు చెబుతారు.

Shravana Amavasya 2021 Date, History, Puja Vidhi, Significance, And How Is It Observed in Telugu

తెలుగు క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం ఐదో నెల. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, శ్రావణ మాసం ప్రతి సంవత్సరం జులై, ఆగస్టు నెలలో వస్తుంది. ఈ సమయంలో వర్ష రుతువు కారణంగా వర్షాలు విరివిగా కురుస్తాయి. ఈ సందర్భంగా 2021 సంవత్సరంలో శ్రావణ అమావాస్య ఎప్పుడొచ్చింది? ఈ అమవాస్య యొక్క ప్రత్యేకతలేంటి? దీన్ని ఎలా గుర్తిస్తారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

shravan maas 2021: ప్రతి రాశి వారు సంపదను పెంచుకోడానికి శివుడిని ఇలా పూజించండి...shravan maas 2021: ప్రతి రాశి వారు సంపదను పెంచుకోడానికి శివుడిని ఇలా పూజించండి...

అమావాస్య తేదీ, శుభ ముహుర్తం..

అమావాస్య తేదీ, శుభ ముహుర్తం..

2021 సంవత్సరంలో శ్రావణ అమావాస్య ఆగస్టు ఎనిమిదో తేదీ ఆదివారం నాడు వచ్చింది. ఈ అమావాస్య ఆగస్టు ఏడో తేదీన శనివారం రాత్రి అంటే 7:13 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఆదివారం రాత్రి 7:21 గంటల వరకు ఈ అమావాస్య తిథి ముగుస్తుంది.

ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా..

ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా..

మన దేశంలో వివిధ రకాల రాష్ట్రాలు, ప్రాంతాలు ఉండటం వల్ల ఒక్కో ప్రాంతం వారు ఒక్కో రకమైన పండుగలను, ఆచారాలను పాటిస్తారు. అలాగే శ్రావణ అమావాస్యను రకరకాలుగా జరుపుకుంటారు. అంతేకాదు దీనికి అనేక పేర్లు ఉన్నాయి. మహారాష్ట్రలో దీన్ని పిరోరి అమావాస్య అంటారు. ఉత్తర భారతంలో హాలియా అమావాస్య అని పిలువగా.. మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ అమావాస్య పోలా అమావాస్య అని పిలుస్తారు. పోలాల అమావాస్య సందర్భంగా గోదావరి నది పొర్లి పొర్లి వస్తుందని చెబుతారు.

పోలాంబ దేవతకు పూజలు..

పోలాంబ దేవతకు పూజలు..

పోలా అమావాస్య సందర్భంగా తెలుగు రాష్రాల్లో పోలాంబ దేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు. ‘పోల' అనగా కడుపునిండా తిండి తిని.. నీరు తాగే ఎద్దు అర్థం. ‘అమా' అనగా (అమావాస్య) అని అర్థం. ‘పోలామా' అంటే ఎద్దులకు బాగా తిండిపెట్టే సమయం అని.. ఈ అమావాస్యకు గోపూజకు ముఖ్యమైనదిగా పెద్దలు చెబుతారు.

పౌరాణిక కథ..

పౌరాణిక కథ..

శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యకు సంబంధించి ఓ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అంధకాసురుడు బ్రహ్మ దేవుని అనుగ్రహం కోసం తపస్సు చేశాడు. తన తపస్సును మెచ్చిన బ్రహ్మదేవుడు ఓ రోజు ప్రత్యక్షమై తను కోరిన కోరికలన్నీ తీర్చాడు. అయితే తను పొందిన వరాల వల్ల గర్వంతో ఒకరోజు అతను పార్వతీదేవినే దుర్భాషలాడతాడు. ఇది తెలిసిన పరమేశ్వరుడు భూలోకానికి వచ్చి అంధకాసురుడిని హతమార్చాడు.

Shravan Month 2021:శ్రావణ మాసంలో ఈ పనులు అస్సలు చేయకండి... మరి ఏ పనులు చేయాలంటే...!Shravan Month 2021:శ్రావణ మాసంలో ఈ పనులు అస్సలు చేయకండి... మరి ఏ పనులు చేయాలంటే...!

నంది చేసిన సాయం..

నంది చేసిన సాయం..

శివుడు భూలోకానికి వెళ్లడానికి నంది చేసిన సాయానికి మెచ్చిన ఆ పరమేశ్వరుడు ఏదైనా వరం కోరుకోమంటాడు. అప్పుడు నంది ఇలా కోరుకుంటాడు. ‘శిలాదుడు పొలము కెక్కిరిస్తూ ఉండగా అదివ్రుషభరూపమున అతనికి నేను దొరికిన రోజు శ్రావణ బహుళ అమావాస్య కాగా ఆనాడు ఎద్దులను పూజిస్తే పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యేలా అనుగ్రహించమని కోరతాడు. అప్పుడు శివుడు తన కోరిక నెరవేరుస్తాడు.

తెలుగు రాష్ట్రాల్లో..

తెలుగు రాష్ట్రాల్లో..

తెలుగు రాష్ట్రాల్లో అమావాస్య రోజున పోలాంబ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ అమ్మవారికి పూజలు చేస్తే పోలేరమ్మ సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలిగిస్తుందని.. సంతానం ఉన్న వారిని అనుగ్రహిస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాల్లో పోలాంబ అమ్మవారి విగ్రహాన్ని పూజించరు. ఆమె స్థానంలో పిలకలతో నిండి ఉన్న కందగొడుగును ఉంచుతారు. దీన్ని పోలకమ్మ అంటారు. పసుపు కుంకుమలు సమర్పించి.. పసుపు కొమ్ము కట్టిన తోరమును ఒకదాన్న పోలకమ్మకు కడతారు.

పిల్లల మెడలో..

పిల్లల మెడలో..

ఆ తోరణాలను పిల్లల మెడలో కూడా వేస్తారు. ఈ పోలకమ్మ తోరణాన్ని ఇలా కట్టడం వల్ల పిల్లలకు మరణ భయం అనేది ఉండదని శాస్త్రాలు చెబుతున్నారు. పోలకం తోరణానికి పోలేరమ్మ పుస్తి అనే నామం ఏర్పడింది. ఉత్తర భారతంలో శ్రావణ అమావాస్య సమయంలో రావిచెట్లకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ చెట్టులో బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడు నివాసముంటారని నమ్ముతారు. అలాగే ఈ రోజు పేదలకు దానం చేస్తే మంచి ఫలితాలొస్తాయని నమ్ముతారు.

English summary

Shravana Amavasya 2021 Date, History, Puja Vidhi, Significance, And How Is It Observed in Telugu

Here we are talking about the shravana amavasya 2021 date, history, puja vidhi, significance, and how is it observed in Telugu. Read on
Story first published:Thursday, August 5, 2021, 18:57 [IST]
Desktop Bottom Promotion