For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రావణ మాసంలో మీ ఇంట్లో ఈ వస్తువులను తీసుకునివచ్చి పెడితే, ఆ పరమశివుని ఆశీస్సులు మీకు తప్పక లభిస్తాయి!

|

శ్రావణ మాసం ప్రారంభం అవుతుందనగానే,ప్రతి ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. పూజలకు సన్నాహాలు మొదలవుతాయి. ఎంతగానో ఎదురుచూసే ఈ నెల, ఆరంభ తేదీలు ఉత్తర, దక్షిణ భారతాలలో, వేరువేరుగా ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా ఈ నెలకు గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది.

నాలుగు సోమవారాలు కలిగిన అరుదైన శ్రావణ మాసము, పందొమ్మిది సంవత్సరాల తర్వాత, ఈ సంవత్సరంలో వస్తుంది. ఆ పరమశివుని ఆశీర్వాదం పొందడం కొరకు భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేయడానికి సంసిద్ధం అవుతున్నారు.

Shravana Month: These Small Acts Will Make Lord Shiva Happy

శ్రావణ మాసంలో ఈ వస్తువులను మీ ఇంట్లో ఉంచితే, శివుడి ఆశీర్వాదాలు తప్పక లభిస్తాయి.

1. విభూతి లేదా భస్మము:

1. విభూతి లేదా భస్మము:

కొన్ని హిందు మత గ్రంథాలు శివుని భస్మాంబరధారిగా వర్ణిస్తాయి. ఒళ్ళంతా బూడిద పూసుకుని అలంకరించుకునే నిరాడంబరుడు శివుడు. ఇది అతనికి భస్మంతో ఉన్న అనుబంధాన్ని సూచిస్తుంది. మునులు, యోగులు మరియు ఋషులు భస్మాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. శివుడు కూడా ఒక యోగి. అందువల్ల, మీ పూజ గదిలో భస్మంగా పిలువబడే పవిత్రమైన బూడిదను ఉంచటం వలన శివుని కృపాకటాక్షాలకు మీరు చేరువవుతారు.

2. రుద్రక్షలు:

2. రుద్రక్షలు:

రుద్రాక్షలను శివుడి కన్నీరుగా చెబుతారు. సోమవారం నాడు రుద్రాక్షలను తీసుకుని వచ్చి ఇంటి యజమాని ఎవరైతే , వారి గదిలో ఉంచండి. అప్పుడు కాలయాపన జరుగుతున్న పనులు తక్షణమే పూర్తికావడమే కాక,ఇంట్లో సంపద మరియు శాంతి చేకూరుతాయి.

3. గంగజాలం

3. గంగజాలం

భగరధుని అపర తపస్సుకు మెచ్చి, శివుని జటాజూటం వీడి దివి నుండి భువికేగింది గంగ. ఉత్తుంగ గంగా ప్రవాహ వేగాన్ని భూమి తాళలేదు కనుక,శివుడు తన జడలో గంగకు స్థానం ఇచ్చి, ఆమె ఉరుకును తగ్గించాడు. శ్రావణ సోమవారం, మీ వంటగదిలో గంగాజలాన్ని ఉంచండి. ఇలా చేస్తే ఆ కుటుంబ సభ్యులందరికి, అన్ని కార్యాలలో విజయం చేరువవుతుంది.

4. వెండితో తయారు చేయబడిన నంది :

4. వెండితో తయారు చేయబడిన నంది :

నంది శివుడు యొక్క వాహనం. శివుని చిత్రాలన్నింటిలోని తరచుగా అతనికి దగ్గరగా నంది కూర్చున్నట్లు చిత్రీకరించబడుతుంది. ఇంట్లో ఒక వెండి నందిని ఉంచడం వల్ల, అదృష్టాన్ని తీసుకు వస్తుందని నమ్ముతారు. అదేవిధంగా, నంది యొక్క వెండి విగ్రహాన్ని నగదు అల్మారా లోపల ఉంచడం వల్ల ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది మరియు ఆ ఇంట్లోకి సంపద ఆకర్షింపబడుతుంది.

5. డమరుకం

5. డమరుకం

శివుడు ఉపయోగించే పవిత్రమైన డమరుకం పర్యావరణం నుండి ప్రతికూలమైన మరియు హానికరమైన ప్రకంపనలు తొలగించడానికి సహాయపడుతుంది. డమరుకం చేసే శబ్దం మన శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు. శ్రావణ మొదటి రోజున ఒక డమరుకం తీసుకునివచ్చి, నెల చివరి రోజు ఎవరైనా పిల్లవాని బహుమతిగా ఇవ్వండి. ఇది కుటుంబానికి మంచి అదృష్టం తీసుకువస్తుంది.

6. వెండి త్రిశూలం

6. వెండి త్రిశూలం

పరమశివుని యొక్క త్రిశూలం విశ్వంలో ఉన్న మూడు రకాల శక్తులను సూచిస్తుంది. ఏ ఇంటిలోకైనా ఒక త్రిశూలాన్ని తీసుకువస్తే, అది ఆ ఇంట్లోని మూడు రకాలైన శక్తులను సమతుల్యం చేస్తుంది మరియు సాత్విక లక్షణాలను ప్రసరింప చేస్తుంది. అందువల్ల, ఈ శ్రావణ మాసంలో వెండితో చేసిన ఒక త్రిశూలంను మీ ఇంటికి తీసుకురావటం మర్చిపోకండి.

English summary

Shravana Month: These Small Acts Will Make Lord Shiva Happy

The Shravana month is going to begin soon, and the preparations are going on in full-swing; devotees are waiting for the auspicious time when they can please Lord Shiva, the primary deity of the month. Here are some points which the devotees must keep in mind while offering prayers to Lord Shiva, such as feeding an ox in order to resolve marriage-related problems.
Story first published: Tuesday, July 24, 2018, 17:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more