For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలు కావాలనుకునే వారికి శ్రావణ పుత్రాద ఏకాదశి ఉపవాసం

పిల్లలు కావాలనుకునే వారికి శ్రావణ పుత్రాద ఏకాదశి ఉపవాసం

|

పక్షంలో 11 వ రోజును ఏకాదశిగా పిలుస్తారు. ప్రతి నెలలోనూ రెండు పక్షాలు ఉంటాయి. ఒకటి శుక్ల పక్షం, రెండు కృష్ణ పక్షం. కావున ఏకాదశులు కూడా రెండు. క్రమంగా సంవత్సరంలో 24 ఏకాదశులు ఉండడం పరిపాటి. కానీ, తెలుగు కాలెండర్ ప్రకారం, కొన్ని అధిక మాసాలు కూడా ఉంటూ ఉంటాయి. ఈ అధిక మాసాలలో పూజలు, ఉపవాసాలు, పండుగలు హిందువులకు అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి.

సాధారణంగా శ్రావణ మాసానికి ముందు అధిక మాసం వస్తుంది. ఈ సంవత్సరం కూడా అలాగే వచ్చింది. సాధారణంగా 28 నుండి 29 రోజుల వరకు శ్రావణ మాసం ఉంటుంది కానీ ఈ సంవత్సరం అధిక మాసం కారణముగా 30 రోజులుగా ఉంది. ఈ విధంగా అరుదుగా 30 రోజులుగా రావడం హిందువులకు అత్యంత పవిత్రంగా భావించబడినది. జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన విధానం ప్రకారం ఈ సంవత్సరం ఆగస్టు 22, 2018 న శ్రావణ శుక్ల ఏకాదశి వస్తున్నట్లు తెలుపబడినది.

అసలెందుకు శ్రావణ శుక్ల ఏకాదశి అంత పవిత్రంగా భావించబడినది ?

అసలెందుకు శ్రావణ శుక్ల ఏకాదశి అంత పవిత్రంగా భావించబడినది ?

నిజానికి శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశి అత్యంత పవిత్రమైనదిగా భావించడం జరుగుతుంది. మరియు శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశిని శ్రావణ పుత్రాద ఏకాదశిగా పరిగణిస్తారు. నిజానికి ప్రతి ఏకాదశి కూడా అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది దీనికి కారణం విష్ణు దేవునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి.

మగ పిల్లవానికై :

మగ పిల్లవానికై :

శ్రావణ శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న వారి ఇంట మగ పిల్లవాని జననం ఆశీర్వదించబడుతుంది. అందుచేతనే ఈ రోజును పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు ముఖ్యముగా భార్యాభర్తలిద్దరూ అభ్యంగన స్నానం చేసి, కొత్త బట్టలు లేదా ఉతికిన దుస్తులు ధరించి కలిసి ఉపవాస దీక్ష చేయవలసి ఉంటుంది. మరియు విష్ణు దేవునికి ఉపవాస దీక్ష నియమ నిబద్దతలతో కూడుకుని ఉంటుంది. అదే విధముగా మంచి భవిష్యత్తు, వృత్తిపరమైన పురోగతి, విద్య ఆరోగ్య సంబంధిత విషయాలకు కూడా ఈరోజు ఉపవాసదీక్ష సూచించబడినది.

పసిపిల్లల ఆరోగ్యానికి :

పసిపిల్లల ఆరోగ్యానికి :

మీ ఇంట్లోని పసి పిల్లలు అనారోగ్య లేదా బాలారిష్టాల సమస్యలతో బాధపడుతున్నట్లైతే, ఈరోజు విష్ణు దేవుని ఆరాధించడం ఫలప్రదంగా భావించబడుతుంది. ఒకవేళ శిశువు పుట్టినప్పటి నుండి తరచుగా అనారోగ్య సమస్యలకు గురవుతున్నట్లైతే, ఈరోజు ఉపవాస దీక్ష ఉండడంతో పాటు 11 మంది పేద బాలికలకు ఆహారాన్ని అందించడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలను పొందగలరు. మీ సామర్థ్యాన్ని అనుసరించి వారికి కొత్త బట్టలు లేదా బహుమతులను అందించడం కూడా ఉత్తమంగా సూచించబడినది. ఎట్టి పరిస్థితుల్లో పాత బట్టలను దానమివ్వరాదు. అపాత్ర దానం ఎన్నటికీ శ్రేయస్కరం కాదు. ఇచ్చిన దానానికి విలువ ఉండాలి.

తరచుగా గర్భస్రావాలకు గురవుతున్న ఎడల :

తరచుగా గర్భస్రావాలకు గురవుతున్న ఎడల :

కొన్ని సందర్భాలలో పుట్టిన వెంటనే శిశువు చనిపోవడం లేదా గర్భస్రావానికి గురవడం లేదా మృత శిశువుకు జన్మనివ్వడం వంటి సమస్యలను కొందరు తల్లులు ఎదుర్కొనవలసి వస్తుంది. ఒకవేళ ఈ సమస్యలను ఎదుర్కొంటున్న ఎడల ఏకాదశి వ్రతాన్ని అనుసరించడం మంచిదిగా సూచించబడినది.

సాయంత్రం వేళ రావి చెట్టును పూజించి, ఒక వెండి పాత్రలో చక్కరతో కూడిన పాలను రావి చెట్టుకు నైవేద్యముగా సమర్పించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందగలరు. మరియు రావి చెట్టు చుట్టూ ఒక ఎర్రని పవిత్రమైన దారాన్ని (మోల్) చుట్టి పిల్లల గురించి ప్రార్థన చేయండి. పిల్లల ఆరోగ్య, వృత్తి పరమైన అంశాల దృష్ట్యా కూడా ఈ విధంగా చేయవచ్చు. ఉత్తమ ఫలితాలకై, ఆలయ పూజారిని సంప్రదించడం మంచిది.

పిల్లల వృత్తిపరమైన అవకాశాల కోసం :

పిల్లల వృత్తిపరమైన అవకాశాల కోసం :

మీ బిడ్డకు వృత్తిపరమైన అవకాశాలను అందించుటకై పరమేశ్వరుని కుటుంబాన్ని ఆరాధించడం ఉత్తమం. శివుని ఆలయములో డ్రై ఫ్రూట్స్ తో చేసిన మిఠాయిలను నైవేద్యంగా సమర్పించడం మరియు విష్ణు దేవాలయములలో నెయ్యిని దానం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందగలరు.

ఏకాదశి నాడు ఉపవాస దీక్షలో ఆచరించవలసిన విధివిధానాలు :

ఏకాదశి నాడు ఉపవాస దీక్షలో ఆచరించవలసిన విధివిధానాలు :

విష్ణువుని పూజించే భక్తులు రోజంతా ఎటువంటి ఆహారమూ తీసుకోకుండా నియమ నిబద్ధతలతో ఉపవాస దీక్షను అనుసరించవలసి ఉంటుంది. ఏకాదశి సూర్యోదయం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు ఉపవాస దీక్షను కొనసాగించవలసి ఉంటుంది. సాధ్యాసాధ్యాలను అనుసరిస్తూ దాన ధర్మములు చేయడం ఉత్తమముగా సూచించబడింది.

ఏకాదశి నాడు ఏమేమి చేయవచ్చు :

ఏకాదశి నాడు ఏమేమి చేయవచ్చు :

పవిత్ర నదిలో అభ్యంగన స్నానమాచరించి, పూజ గదిని శుభ్రం చేసి, దేవునికి ధూప దీప నైవేద్యాలను సమర్పించి, దైవారాధనతో ఉపవాస దీక్షను ప్రారంభించడం ద్వారా మంచి శ్రేయస్సును పొందగలరు. గోవుకు ఆహారాన్ని అందించడం, రాత్రంతా జాగరణ గావిస్తూ, భక్తి గీతాలు మరియు శ్లోకాలతో విష్ణు దేవుని ఆరాధిస్తూ ద్వాదశి నాడు సూర్యోదయంతో ఉపవాస దీక్షను ముగించడం ద్వారా మంచి ఫలితాలను పొందగలరు. వీలయితే దేవాలయాలకు వెళ్ళడం, దన ధర్మాలు చేయడం. మంత్ర పఠనం చేయడం, పూజారి లేదా పండితుల సూచనల ప్రకారం వ్రతమాచరించడం లేదా యాగాలు, హోమాలు నిర్వహించడం మొదలైనవి చేయవచ్చు. వీలయితే మీ ప్రాంతాలలోని విష్ణు దేవాలయాలు సందర్శించడం మంచిది.

ఏకాదశి నాడు చేయకూడని అంశాలు :

ఏకాదశి నాడు చేయకూడని అంశాలు :

ఉపవాస దీక్షను ప్రారంభించాలని తలచిన వారు ఆహారమునకు దూరంగా ఉండటం ముఖ్యం. ఆరోగ్య పరిస్థితులు సహకరించని ఎడల, దీక్షను చేయకపోవడమే ఉత్తమం. లేదా పాలు, పండ్లతో దీక్షను కొనసాగించవచ్చు. మరియు ఆడవారు జుట్టును కడగడం, గోర్లను కత్తిరించడం చేయరాదు. ఈరోజున గోర్లు కత్తిరించడం అరిష్టంగా చెప్పబడుతుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Shravani Ekadashi 2018: Dates, Benefits, Do's and dont's

Shravani Ekadashi, a fasting day, is observed on the eleventh day of bright fortnight in Shravana month. It is said that Lord Vishnu blesses the observer of this fast with a boy child. Besides this, the fast is observed with a little difference for the health of the children, for miscarriages and a better career of the children as well.
Desktop Bottom Promotion