సరస్వతి పూజ యొక్క ప్రాముఖ్యత మరియు ఇంపార్టెన్స్

Posted By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

నవరాత్రి పండుగ సందర్బంగా దేశమంతా సెలబ్రేషన్ మూడ్ లో ఉంది. మా దుర్గ యొక్క వివిధ అవతారాల తో ప్రతిరోజూ పూజలను జరుపుకుంటారు మరియు ఆమె దైవిక దీవెనలు పొందటానికి విస్తృతమైన పూజలు చేస్తారు.

నవరాత్రి లోని ప్రతి రోజు కీ ఒక ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది. అయినప్పటికీ,చివరి మూడు రోజులు మాత్రం సరస్వతి దేవతకు అంకితం చేయబడింది.

నవరాత్రి మొదటి రోజు పూజా విధి మరియు మంత్రములు

విజ్ఞానం, కళ మరియు సంగీతం యొక్క అధిపతి అయిన దేవత సరస్వతి. సరస్వతి దేవి సంస్కృత భాషని కనుగొనడంలోకూడా ప్రసిద్ధి చెందింది. ప్రజలు జ్ఞానాన్ని మరియు శక్తిని పొందేందుకు దేవతను పూజిస్తారు. నవరాత్రి యొక్క ఎనిమిదవ రోజు సాయంత్రం సరస్వతి పూజను చక్కగా పూజిస్తారు.

శుభప్రదమైన తేదీ మరియు పూజల సమయం

శుభప్రదమైన తేదీ మరియు పూజల సమయం

ఈ సంవత్సరం, సరస్వతి పూజ 28 సెప్టెంబర్ మొదలై సెప్టెంబర్ 30 న ముగుస్తుంది. పూజకి అత్యంత పవిత్రమైన సమయాలు 28 సెప్టెంబర్ న 3.51 గంటల నుండి 6.13 వరకు.

పూజ యొక్క ప్రాముఖ్యత

పూజ యొక్క ప్రాముఖ్యత

సరస్వతి దేవి జ్ఞానం మరియు వివేకం యొక్క దేవతగా పిలువబడుతుంది. ఇంకా ఈ దేవత మనకి అజ్ఞానం యొక్క దుష్టత్వాన్ని నాశనం చేయడానికి మరియు నిజమైన జ్ఞానోదయం మరియు విజ్ఞానం ని అందించే దేవతగా పిలవబడుతుంది. విద్యారంగం లో మంచి విద్యావేత్తలు కావాలన్నా లేదా ఏ ఇతర కళాత్మక పనులనైనా మంచి విజయం సాధించాలన్నా ఆమె ఆశీర్వాదాలు ఉండాలి.

ఈరోజు, పుస్తకాలు మరియు జ్ఞానానికి సంబంధిన వస్తువులని పూజా గదిలో సరస్వతి దేవి దగ్గర ఉంచుతారు. చివరి రోజు, అంటే విజయ దష్మి ని విద్యారంభం రోజుగా పిలుస్తారు. ఇక్కడ ఇంకా వ్రాయడం నేర్చుకోని చిన్న పిల్లలని తమ మొదటి లేఖ రాపించడానికి ఏర్పాట్లు చేస్తారు. సరస్వతి యొక్క దీవెనలు వారి అభ్యాస దశలలో ఉండేలా చేయటానికి ఇలా చేస్తారు.

సరస్వతి పూజా విధానం

సరస్వతి పూజా విధానం

కావాల్సినవి

సరస్వతి దేవి యొక్క చిత్రం / విగ్రహం

పువ్వులు మరియు మామిడి ఆకులు

పసుపు మరియు కుంకుం

రైస్

బనానాస్ మరియు ఇతర పండ్లు

వైట్ వస్త్రం

పుస్తకాలు

ప్రసాదం

సరస్వతి పూజ యొక్క ప్రాముఖ్యత

పూజా విధానము

పూజా విధానము

పూజ గదిలో దేవత యొక్క విగ్రహం / ఇమేజ్ ని ఉంచండి.

పువ్వులు మరియు పండ్లతో అలంకరించండి.

సరస్వతి దేవికి సంబంధిన శ్లోకాలని చదువుతూ, ఆమె విగ్రహం / బొమ్మను కుంకుంతో అలంకరించండి.

లైట్ డయాస్ మరియు అగరుబత్తిలను ముందు వెలిగించండి.

తెలుపు వస్త్రంతో ట్రేని కవర్ చేసి దానిలో అన్ని పుస్తకాలను ఉంచండి.

విగ్రహం / చిత్రం మరియు పుస్తకాలపై పువ్వుల ను ఉంచండి.

అలాగే పసుపు మరియు కుంకుమ్లను పుస్తకాల కు పెట్టండి.

సరస్వతి దేవిపై బియ్యం మరియు పసుపు ఉంచండి.

పూజా లో వున్న ప్రతి ఒక్కరికి ప్రసాదాన్ని పంచండి.

విజయ దశమి వరకు పుస్తకాలను తాకకుండా ఉండేటట్లు చూసుకోండి.

విజయ దశమి యొక్క ఈ పవిత్రమైన రోజున, దేవత యొక్క దైవ ఆశీర్వాదాన్ని పొందడానికి

ఒక యజ్ఞం కూడా చేయబడుతుంది. నెయ్యి, ఖీర్ మరియు నువ్వుల విత్తనాలు వంటివి అందిస్తారు.

English summary

Significance And Importance Of Performing Saraswati Pooja

There is a certain significance of each day of Navratri. However, the last three days of Navratri are solely dedicated to Goddess Saraswati.
Story first published: Thursday, September 28, 2017, 12:00 [IST]