For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హనుమంతునికి ఎన్ని ప్రదక్షిణలు.. ఎలా చేయాలి?

|

మనము ఎన్ని ప్రదక్షిణలు చేయదులచుకున్నను, ప్రతి ప్రదక్షిణము తర్వాత ఒక చోట ఆగి పై శ్లోకం చెప్పకుని తిరిగి ప్రదక్షిణము చేయవలెను. వేరే ఏ శ్లోకములు చెప్పు కోరాదు.

ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చేస్తాం. కానీ హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు మాత్రం ఐదు ప్రదక్షిణాలు చేయాలి. 'ప్రదక్షిణన మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా' అని ఆర్షవాక్యం . మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువుకోవాలి. సకల రోగ, భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు, అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు.

ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్న ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించడం ముఖ్యం. హనుమంతునికి ప్రదక్షిణ ఎలా చేయాలి? ఎన్ని ప్రదక్షణాలు చేయాలో తెలుసుకుందాం..

హనుమంతునకు ప్రదక్షిణములు

హనుమంతునకు ప్రదక్షిణములు

హనుమంతునకు ప్రదక్షిణములు అంటే ఇష్టం. ఆజనేయ స్వామి గుడిలో ప్రదక్షణలు చేసేటప్పుడు చెప్పుకోవల్సిన శ్లోకము''

ఆంజనేయం మహావీరం ! బ్రహ్మ విష్ణు శివాత్మకం !

అరుణార్కం ప్రభుం శమథం ! రామదూతం నమామ్యహం !"

హనుమంతునకు ప్రదక్షిణములు

హనుమంతునకు ప్రదక్షిణములు

రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి.

పుష్పములు, వక్కలు, పసుపు కొమ్ములు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం ‘‘శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్''

హనుమంతునకు ప్రదక్షిణములు

హనుమంతునకు ప్రదక్షిణములు

శ్లో|| ఆంజనేయం మహావీరం -బ్రహ్మ విష్ణు శివాత్మకం

తరుణార్క ప్రభంశాతం -రామదూతం నమామ్యహం

హనుమంతునకు ప్రదక్షిణములు

హనుమంతునకు ప్రదక్షిణములు

శ్లో ||మర్కటే శ మహోత్సహా -సర్వశోక వినాశన

శత్రూన్సంహర మాం రక్ష- శ్రియం దాపయ మే ప్రభో ||

హనుమంతునకు ప్రదక్షిణములు

హనుమంతునకు ప్రదక్షిణములు

అని చదువు కుంటూ ప్రదక్షిణాుల చేయాలి. కోరిక మేరకు మండలం, అర్ధ మండలం కానీ ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి

‘‘యాక్రుత్తే రేభి: ప్రదక్షిణ ణై | శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వరదో భూత్వా మామాభిష్ట సిద్దం దదాతు'' అని జలాన్ని అక్షతలతో వదిలిపెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మ చర్యం, శరిస్నానం , నేలపడక, సత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.

హనుమంతునకు ప్రదక్షిణములు

హనుమంతునకు ప్రదక్షిణములు

భక్తులకు ఏ బాధలు కలిగినా నియమాలు చెప్పివారు ప్రదక్షిణాలు చేయునట్లు ప్రోత్సహించి వారి బాధలు స్వామిద్వారా తొలగిపోవున్నట్లు చేయాలి. హనుమత్ప్ర దక్షిణ ధ్యానం శీలాఫలకంపై చెక్కించి ఆలయాన అతికించాలి. మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయాలి.

హనుమంతునకు ప్రదక్షిణములు

హనుమంతునకు ప్రదక్షిణములు

పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం. అందులోనూ మన్యు సూక్త అభిషేకస్తే పరమానంద భరితుడు అవుతాడు, కోరికల్ని తీరుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర రోజు తప్పకుండా చేయాలి. వారం, వారం నిత్యమూ చేయగలగం మరీ మంచిది.

హనుమంతునకు ప్రదక్షిణములు

హనుమంతునకు ప్రదక్షిణములు

మంగళవార సేవ : మంగళవారం నాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పూయటం చాల ఇష్టం. అంతా కుదరని వారు మూతికయినా తప్పక పూయాలి. సింధూరార్చన చేయటం, అరటి పండ్లు నివేదించడం చేయాలి.

హనుమంతునకు ప్రదక్షిణములు

హనుమంతునకు ప్రదక్షిణములు

శనివార సేవ: హనుమంతుడు శనివారం జన్మించాడు, కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది. నాడు యథాశక్తి విశేషార్చన, సహస్రనామాదికం చేయాలి. ఆరోజున అప్పాలు, వడ మాల వంటివి స్వామివారికి నివేధించి స్వామి వారి ఆశీస్సులు పొందవచ్చు.

హనుమంతునకు ప్రదక్షిణములు

హనుమంతునకు ప్రదక్షిణములు

పంచ సంఖ్య : హనుమంతుడుకి పంచ (ఐదు) సంఖ్య ఇష్టం కాబట్టి చెస్వ ప్రదక్షిణాలు, నమస్కారాలు ఐదు చేయాలి. అరటిపండ్లు లేదా ఇతరములు, స్వామికి 5 సంఖ్యంలో సమసర్పించడం స్వామివారికి మరింత ప్రీతికరం.

English summary

Significance of doing Pradakshina for Lord Hanuman..!

Significance of doing Pradakshina for Lord Hanuman..!When a person visits Hanuman, it is good to do your Hanuman mantra and pradakshina. However, Hanuman lights up when you praise Rama in front of the murthi. This is so beautiful.
Story first published: Monday, July 11, 2016, 17:30 [IST]
Desktop Bottom Promotion