For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కంచిలోని బంగారు, వెండి బల్లి వెనుకున్న రహస్యం ఏంటి..?!

|

బల్లి మనపై పడిందంటే ఏదోగా వుంటుంది. ఒళ్లు జలదరిస్తుంది. బల్లులంటే బయపడే వారు చాల మందే ఉన్నారు. ప్రతి ఇంట్లో బల్లులు వుంటాయి. బల్లులు సాధారణంగా ఇళ్లలో వుంటాయి. ఇంట్లో లైట్ల వద్ద తిరిగే పురుగులను తిని బతుకు తుంటాయి. బల్లి గురించి చాల అపోహలున్నాయి. ఇది విష పురుగు అని అంటే అది కరవదు గాని అది ఇళ్లలో తిరుగుతుంటుంది కనుకు అది ఏదేని ఆహార పదార్థాలలో పడితే దాన్ని తిన్న వారు మరణిస్తారని ప్రజల్లో ఒక ఆపోహ వున్నది.

అదే విధంగా బల్లి మన శరీరంపై ఏబాగాన పడితే దానికి ఫలితమేమిటి తెలుసుకునే బల్లి శాస్త్రము కూడా ఉన్నది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో వున్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్పలితం వుండదని ఒక నమ్మకం.

Significance of Kanchi Golden and Silver Lizard...!

అదే విదంగా బల్లి శరీరం మీద పడిన వారు..... కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారము చేస్తే బల్లి పడిన దుష్పలితం వుండదని కూడ ప్రజల్లో మరో నమ్మకం కూడా ఉన్నది. మనమేదన్నా తలుచు కుంటున్నప్పుడు బల్లి పలికితే అది నిజమవుతుందని కూడ నమ్ముతారు. అది పలికి నపుడు "క్రిష్ణ... క్రిష్ణ " అని అంటారు. చాలా గుడుల గోడల మీద బల్లుల చిత్రాలున్నాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో తూర్పు దిశ నుంచి బల్లి శబ్ధం చేస్తు రాహు గ్రహ ప్రభావమని అర్థం చేసుకోవాలి. తూర్పు వైపు బల్లి శబ్ధం చేస్తే అనూహ్య భయాలు, అశుభ వార్తలను ముందంజగానే మనకు తెలియజేస్తున్నట్లు అర్థమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటుచేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. కంచి బంగారు, వెండి బల్లి గురించి పురాణగాధ ఏం చెబుతున్నది, బంగారు వెండి బల్లుల యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం...

కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి యొక్క విశిష్టత ఏమిటి ?!

కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి యొక్క విశిష్టత ఏమిటి ?!

బంగారు వెండి బల్లికి సంబంధించిన పురాణగాధ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు వుండేవారు. నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు.

MOST READ:యోని, తొడల వద్ద భయంకరమైన దద్దుర్లను నివారించే హెర్బల్ రెమెడీస్ ..!MOST READ:యోని, తొడల వద్ద భయంకరమైన దద్దుర్లను నివారించే హెర్బల్ రెమెడీస్ ..!

కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి యొక్క విశిష్టత ఏమిటి ?!

కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి యొక్క విశిష్టత ఏమిటి ?!

అనంతరం దీన్ని చూసిన గౌతమమహర్షి వారిని బల్లులుగా మారిపొమ్మని శపించాడు. శాపవిముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజపెరుమాళ్‌ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పాడు. దీంతో వారు పెరుమాళ్‌ ఆలయంలోనే బల్లులు రూపంలో వుండి స్వామివారిని ప్రార్థించారు.

కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి యొక్క విశిష్టత ఏమిటి ?!

కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి యొక్క విశిష్టత ఏమిటి ?!

కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఈ సమయంలో సూర్య,చంద్రులు సాక్ష్యంగా వుండటంతో బంగారు, వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా వుండి భక్తులకు దోషనివారణ చేయమని ఆదేశిస్తాడు.

కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి యొక్క విశిష్టత ఏమిటి ?!

కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి యొక్క విశిష్టత ఏమిటి ?!

బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం. సరస్వతీ దేవీ నుంచి శాపవిముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్‌ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్టించినట్టు మరో కథనం కూడా ఉంది.

కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి యొక్క విశిష్టత ఏమిటి ?!

కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి యొక్క విశిష్టత ఏమిటి ?!

బల్లి ఇంట తిరగాడుతున్నప్పటీకీ ...అది మీదపడితే దోషమనే విశ్వాసం ఎప్పటి నుండో మన ఆచారంలో ఉంది. అలా బల్లి పడినప్పుడు భయపడకుండా....కంచి కామాక్షి ఆలయంలోని బల్లిని తలచుకుని స్నానం చేసి, ఇష్టదేవతారాధన చేయడం వల్ల ఆ దోషం పోతుందని చెప్పబడుతోంది.

కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి యొక్క విశిష్టత ఏమిటి ?!

కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి యొక్క విశిష్టత ఏమిటి ?!

పౌరాణిక ..చారిత్రక నేపథ్యాలను కలిగిన ‘లక్ష్మీ వెంకటేశ్వరస్వామి' క్షేత్రం ఇక్కడ దర్శమిస్తుంటుంది. ఇక్కడి అమ్మవారి మందిరంపైకప్పుకి రెండు బల్లులు చెక్కబడి కనిపిస్తూ ఉంటాయి.

MOST READ:హిందూ దేవాలయాల్లో మాత్రమే కొబ్బరికాయ, అరటిపండ్లు పవిత్రంగా సమర్పిస్తారెందుకు?MOST READ:హిందూ దేవాలయాల్లో మాత్రమే కొబ్బరికాయ, అరటిపండ్లు పవిత్రంగా సమర్పిస్తారెందుకు?

కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి యొక్క విశిష్టత ఏమిటి ?!

కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి యొక్క విశిష్టత ఏమిటి ?!

అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు..ఈ బల్లులను తాకుతుంటారు. అప్పటి వరకూ బల్లుల మీద పడటం వల్ల దోషాలు ఏమైనా ఉంటే అవి తప్పకుండా నివారించబడుతాయని స్థల పురాణం చెబుతోంది.

కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి యొక్క విశిష్టత ఏమిటి ?!

కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి యొక్క విశిష్టత ఏమిటి ?!

బంగారు బల్లిని తాకటంతో అప్పటివరకూ చేసిన పాపాలు పోతాయన్న నమ్మకం చాలామందిలో ఉంటుంది. అలాంటిది అసలుసిసలు బంగారు బల్లే కనిపిస్తే..? నమ్మటానికి కాస్త కొత్తగా ఉన్నా ఇది నిజం. తాజాగా బంగారు బల్లి కనిపించి అందరిని విస్మయానికి గురి చేసింది.

కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి యొక్క విశిష్టత ఏమిటి ?!

కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి యొక్క విశిష్టత ఏమిటి ?!

చాలా అరుదుగా ఉండే బంగారు బల్లులు ఇంకా ఉన్నాయని.. అవికూడా ఎక్కడో కాదు.. మన శేషాచల అడవుల్లో అన్న విషయం తాజాగా బయటపడింది. అంతరించే జాతుల్లో ఒకటిగా చెప్పే బంగారు బల్లులు ఈ మధ్యకాలంలో కనిపించటం లేదు. అలాంటిది శివరాత్రి పర్వదినానికి ఒకరోజు ముందు శేషాచలం ఏడుకొండల్లో కనిపించింది. రాతి గుహలే ఆవాసం

కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి యొక్క విశిష్టత ఏమిటి ?!

కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి యొక్క విశిష్టత ఏమిటి ?!

బంగారు బల్లి శాస్త్రీయ నామం కాలొడాక్టిలోడ్స్ అరీస్. ఇది రాత్రుల్లో సంచరించే నిశాచర జీవి. బంగారు వర్ణం పోలిన ముదురు పసుపు, లేత పసుపు రంగులో మెరిసినట్టు ఉంటుంది.

కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి యొక్క విశిష్టత ఏమిటి ?!

కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి యొక్క విశిష్టత ఏమిటి ?!

ఇవి 150 నుంచి 180 మిల్లీ మీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. రాతి గుహలు వాటి నివాసానికి అనుకూలం. సూర్యరశ్మి పడని, వేడి తగలని ప్రదేశాల్లో కనిపిస్తాయి. సాధారణంగా చీకటి పడ్డాక గుహల సందుల నుంచి వెలికి వస్తాయి.

కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి యొక్క విశిష్టత ఏమిటి ?!

కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి యొక్క విశిష్టత ఏమిటి ?!

అనుకూల వాతావరణంలో జనం చడీచప్పుడు లేనప్పుడు ఒక్కోసారి పగటి పూట బయటకు వస్తాయి. ఇవి 40 నుంచి 50 గుడ్లు పెడతాయి. సాధారణ బల్లుల కంటే గట్టిగా, వింతగా అరుస్తాయి.

కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి యొక్క విశిష్టత ఏమిటి ?!

కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి యొక్క విశిష్టత ఏమిటి ?!

శేషాచల అడవిలో శ్రీవారి ఆలయానికి వెనుక మూడు కిలోమీటర్ల దూరంలోని చక్రతీర్థం, 25 కిలోమీటర్ల దూరంలోని రుద్రగళ (యుద్ధగళ) తీర్థం తదితర చల్లటి ప్రదేశాల్లో మాత్రమే బంగారు బల్లి తరచూ కనిపించేది. అయితే ఇటీవల కొన్నాళ్లుగా కనిపించటం లేదని పరిశోధకులు చెబుతున్నారు.

English summary

Significance of Kanchi Golden and Silver Lizard...!

Significance of Kanchi Golden and Silver Lizard...!Varadaraja Perumal temple in Kanchipuram houses a golden lizard and a silver lizard with the images of sun and the moon respectively. It is believed that touching the lizards dissolves the bad effects and doshas any past of future lizard falls.
Desktop Bottom Promotion