Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకుంటే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి..!
హైందవ మతంలో దేవునికి ఎంత ప్రాధాన్యత ఉందో, దేవతకి అంతకు మించిన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ప్రకృతి లేనిదే పురుషుడే లేడని మనకు తెలుసు! అందుకే ఆ తత్వాన్ని శక్తి అని పిలుచుకుంటాము.
మన దృష్టిలో శక్తి అంటే కేవలం ఒక పదం మాత్రమే కాదు... అది చలనానికి ప్రతీక! ఆ శక్తిని భిన్నరూపాలలో, భిన్న పాత్రలలో ఆరాధించే సందర్భమే దేవీ నవరాత్రులు. నవరాత్రి విశిష్టత, నవరాత్రుల్లో దుర్గా దేవిని ఎందుకు దర్శించుకోవాలలో తెలుసుకుందాం..


శక్తి ఆరాధన
విశ్వంలోని స్త్రీ తత్వాన్ని ఆరాధించేందుకు నవరాత్రులు ఓ గొప్ప సందర్భం. ఆ స్త్రీ మనకు మాతృమూర్తిగా (దుర్గ), ఆయురారోగ్యాలను ప్రసాదించే తల్లిగా (లక్ష్మి), జ్ఞానాన్ని అందించే తొలిగురువుగా (సరస్వతి) సుపరిచితమే! అందుకనే కొందరు నవరాత్రులో మూడు మూడు రోజుల చొప్పున ఈ దేవతలను ఆరాధిస్తారు.

శక్తి ఆరాధన
మరికొందరు బాలపూజ, సువాసినీ పూజ పేరుతో చిన్న పిల్లలనీ, ముత్తైదువలనూ సాక్షాత్తూ అమ్మవారిగా భావించి పూజచేస్తారు. సృష్టిలోని శక్తికి స్త్రీలంతా ప్రతిరూపాలే అని భావించి, వారిని భౌతికంగా పూజించే అరుదైన ఆచారం ఒక్క నవరాత్రుల సందర్భంలోనే కనిపిస్తుంది.

కుండలిని
మనం కుండలిని కూడా శక్తి అనే పిలుస్తాము. మనిషి మనిషిలోనూ ఉన్న ఆ షట్చక్రాలను ఛేదించిన రోజున తనకీ, ఈ సృష్టికీ మధ్య ఉన్న అభేదాన్ని గ్రహిస్తాడు. అమ్మవారి కటాక్షంతోనే ఆ కుండలినీ శక్తి జాగృతం అవుతుందని భక్తుల నమ్మకం. అందుకేనేమో అమ్మవారి చుట్టూ ఉన్న దైవాలు కూడా పరిపూర్ణ జ్ఞానానికి ప్రతిరూపాలుగా కనిపిస్తారు.

కుండలిని
శివుడు దక్షిణామూర్తిగా, ఆదిగురువుగా ప్రసిద్ధుడు. ఇక గణపతి సిద్ధి, బుద్ధులను ప్రసాదిస్తాడని ప్రతీతి. మరోవైపు కుమారస్వామిని కూడా జ్ఞానానికి అధిపతిగా భావిస్తారు. కుండలినీ సంబంధమైన ప్రక్రియలు సాగించేవారు తమలోని కుండలినిని జాగృతం చేసేందుకు ఈ నవరాత్రులను మరింత అనువైనవిగా భావిస్తారు. ఈ కాలంలో చేసే సాధన మరిన్ని సత్ఫలితాలను ఇస్తుందని ఆశిస్తారు.

పదో రోజుతో సార్ధకత
ఒకప్పుడు పాశ్చాత్యులకు కేవలం తొమ్మిది అంకెల వరకే తెలుసు. వారి దృష్టిలో తొమ్మిది పరిపూర్ణమైన సంఖ్య. నిజమే! అందుకనే తొమ్మిదితో ఏ సంఖ్యను హెచ్చించినా తిరిగి అదే సంఖ్య వస్తుంది. కానీ ఆ తొమ్మిది తరువాత ఏమిటన్నదే ప్రశ్న! లక్ష్యం కోసం ఎంత గొప్పగా పోరాడినా విజయం సాధిస్తేనే కదా దానికి సార్ధకత.

పదో రోజుతో సార్ధకత
జీవితాన్ని ఎంత గొప్పగా సాగించినా పరమార్ధం తెలుసుకుంటేనే కదా దానికి విలువ. అందుకే నవరాత్రులు పోరాడిన దుర్గ 'విజయదశమి' నాడు జయం పొందింది. మనలోని దుర్గుణాల మీద పోరాడటమే కాదు. అవి తిరిగి మేల్కొనకుండా అణగదొక్కేయాలన్నదే 'దశమి' చెప్పే మాట.

దేశమంతటా
దైవశక్తిని స్త్రీ స్వరూపంగా కొలుచుకోవడం ఏదో ఒక్క ప్రాంతానికే పరిమితం కాదు. వేల సంవత్సరాలుగా భారతదేశంలోని గ్రామగ్రామానా అమ్మవారిని ఏదో ఒక రూపంలో పూజిస్తూనే వస్తున్నాం.

దేశమంతటా
ఎల్లమ్మ, పోలేరమ్మ, గంగమ్మ, పోచమ్మ, మైసమ్మ.... ఇలా పేర్లు ఏవైతేనేం ప్రకృతిని పాలించే ఆ చల్లని తల్లి చూపు తన మీద ఉండాలని ధార్మికుడైన ప్రతి హిందువూ వేడుకుంటేనే వస్తున్నాడు. కాళీమాత మొదలుకొని లలితాత్రిపురసుందరి వరకూ ఎవరికి తోచిన రీతిలో వారు అమ్మవారిని ఆరాధిస్తున్నారు. అందుకోసం నవరాత్రులకు మించిన పండుగ మరేముంటుంది!

నవరాత్రులు: అమ్మవారిని దర్శించుకుంటే..?
ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకూ తొమ్మిది రోజులను నవరాత్రులు అంటారు. నవరాత్రులంటే మహిళలు దేవిని స్మరిస్తూ పండగ చేసుకుంటారు. ఈ అమ్మవారి ఆరాధనా మహోత్సవాన్ని 'శరన్నవరాత్రి ఉత్సవాలు'గా, 'దేవీనవరాత్రులు'గా పిలుస్తుంటారు. మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ తొమ్మిదిరోజుల పాటు తొమ్మిది రూపాలలో అలంకరించి పూజించడం జరుగుతుంటుంది.

నవరాత్రులు: అమ్మవారిని దర్శించుకుంటే..?
భక్తులు ఈ తొమ్మిదిరోజుల పాటు దీక్ష చేపట్టి, ఏకభుక్త వ్రతాన్ని ఆచరిస్తూ అమ్మవారిని పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శరన్నవరాత్రులలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఎవరైతే తనని పూజిస్తారో, వాళ్లు తనకి అత్యంత ప్రీతిపాత్రులని అమ్మవారే స్వయంగా చెప్పినట్టుగా పురాణాలు వెల్లడిస్తున్నాయి.



Click it and Unblock the Notifications











