క్రీస్తు జనన ఘట్టం బొమ్మల కొలువు ప్రాముఖ్యత

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

క్రిస్మస్ వస్తోందనగానే మనలో చాలామంది ఇళ్ళను ముందే అలంకరించుకోవటంలో బిజీగా ఉంటారు. క్రిస్టియన్లకి పెద్దరోజైన క్రిస్మస్ మొదలయ్యే నెల ముందు నుంచే ఈ హడావిడి మొదలవుతుంది. అలంకరణలో భాగంగానే నక్షత్రాలు, క్రిస్మస్ చెట్టు, బహుమతులు, ఇంకా ఇలాంటివి చాలానే తయారవుతూ ఉంటాయి. ఆగండి! ఏదో మిస్ అయినట్టు ఉంది కదా! అవును, క్రీస్తు జననాన్ని చూపే ఘట్టం అలంకరణ సెట్టు. ఇది మర్చిపోడానికి వీల్లేదు. ఎందుకంటే క్రిస్మస్ జరుపుకునే వారందరికీ ఇది చాలా ప్రియమైనది.

క్రిస్మస్ కి ప్రధాన గుర్తు ఈ క్రీస్తు జనన ఘట్టం అలంకరణ. ఇది సంప్రదాయంగా బాగా ఇమిడిపోయింది. తన సొంత ఊళ్ళో జనన ఘట్టం నేటివిటీ సీన్ గా, లాటిన్ పదం నేటివస్ నుంచి నేటివిటీ వచ్చి, పుట్టుకతో అవతారం మొదలయ్యిందన్న అర్థంతో అలా నిలిచిపోయింది.

significance of nativity scene

జనన ఘట్టం ప్రాముఖ్యత

దీన్ని సింపుల్ గా వివరించాలంటే, నేటివిటీ సీన్ అనేది క్రీస్తు పుట్టిన రాత్రి విశేషాలను వివరించే బొమ్మల కొలువు. ఇది వివిధ రకాలుగా చూపిస్తారు – ప్రత్యక్షంగా నటించి లేదా మోడల్స్ పెట్టి లేదా బొమ్మలతో లేదా కేవలం సిరామిక్ బొమ్మలతోనైనా చూపించవచ్చు. కళ్ళకి కన్పించే క్రీస్తు జనన ఘట్టం మాత్రమే కాదు, దాని వెనక దాగివున్న అర్థాలను కూడా ఈ వ్యాసంలో వివరించడమైనది.

significance of nativity scene

చరిత్ర

అస్సిస్సికి చెందిన సెయింట్ ఫ్రాన్సిస్ ఈ క్రీస్తు జనన ఘట్టాన్ని ప్రదర్శించే ఆలోచనకు ఆద్యుడు. ఇటలీలోని గ్రెషియోలోని ఒక గుహలో, 1223 సంవత్సరంలో క్రిస్మస్ ముందురోజున మొదటిసారి దీన్ని నాటకంగా వేసారు.ఆయన ఒక ఎద్దును మరియు గాడిదను పశువుల పాకలో జంతువులుగా చూపించారు. అది ఒక ఉద్దేశంతోనే చేసారు. కేవలం వాస్తవికంగానే ఆలోచించే మనుషులకి క్రిస్మస్ వెనక నిజమైన అర్థం తెలియచెప్పాలని ఇలా చేసారు. ఇంకా వారికి క్రీస్తు పుట్టిన పేద పరిస్థితులను కూడా కళ్ళకి కట్టినట్లు చూపినట్లు అర్థం చేయించాలని భావించారు. క్రిస్టియన్ మతం అంటే ఆధ్యాత్మికత, ఆరాధనాభావం మాత్రమేనని ప్రపంచానికి చెప్పాలనుకున్నారు. ఇక అప్పటి నుండి ఈ నేటివిటీ జనన ఘట్టం పాపులర్ అయి ప్రతి సంవత్సరం సంప్రదాయంగా మారిపోయింది.

significance of nativity scene

ఇందులో వాడే, ఉపయోగించే వస్తువులు వాటి గుర్తులు

క్రీస్తు జనన ఘట్టంలో వాడే ప్రాథమిక వస్తువులు ఐదు – పసిబిడ్డ అయిన జీసస్, మేరీమాత, జోసెఫ్, గొల్లకాపరులు మరియు జంతువులు. మొదట్లో కొంతమందే ఉండేవారు. ఏళ్ళు గడిచేకొద్దీ, ముగ్గురు తెలివైన వ్యక్తుల పాత్రలు కూడా జతకలిసాయి. తర్వాత దేవతలు, బెత్లెహాం నక్షత్రం, ఒక సాధారణ వ్యక్తి కూడా జతయ్యారు. ఇక ఈ రూపాలన్నిటి వెనక అర్థం ఏంటో తెలుసుకుందాం...

పసిబిడ్డ జీసస్

పసిబిడ్డ జీసస్

ఆయన చేతులు చాచి ఉంటాయి. దాని అర్థం అందర్నీ తన వద్ద నుంచి శాంతి, ముక్తిని స్వీకరించండని ఆహ్వానిస్తున్నట్టు.

మేరీ మాత

మేరీ మాత

ఆమె నీలిరంగు కోటును ధరిస్తుంది, ఇది ఆకాశానికి, స్వర్గానికి ప్రతీక. ఆమె మనిషికి, దైవత్వానికి లింక్ అయిన ఒక కన్య. అందుకే జీసస్ ను ఆరాధించే చాలామంది మేరీమాతను కూడా ప్రార్థిస్తారు. కొన్ని బొమ్మల్లో ఆమె ఎర్ర వస్త్రాలను ధరించినట్లు చూపిస్తారు. ఎరుపు రక్తాన్ని సూచిస్తుంది.

కాపరి వాళ్ళు

కాపరి వాళ్ళు

వీళ్ళు సామాన్య జనాలను సూచిస్తారు. వీరు జీసస్ తర్వాతి వంశస్తులైన, ఒకప్పుడు కాపరి అయిన రాజు డేవిడ్ ను కూడా సూచిస్తుంది.

పాకలో జంతువులు

పాకలో జంతువులు

ఎద్దు సహనాన్ని, ఇజ్రాయెల్ లో ప్రజలను సూచిస్తుంది. గాడిద నిగర్వం మరియు సేవ చేయటానికి తయారుగా ఉండటాన్ని సూచిస్తుంది. ఇతర జంతువులను కూడా వాడుతూ వచ్చారు. ఇవన్నీ బేబీ జీసస్ ను సంరక్షిస్తున్నట్లు చూపిస్తారు.

ముగ్గురు తెలివైన వ్యక్తులు

ముగ్గురు తెలివైన వ్యక్తులు

ముగ్గురు తెలివైన వ్యక్తులను మహారాజులని లేదా జీసస్ ను కలవడానికి, బహుమతులు ఇవ్వడానికి వచ్చిన మాగీ అని కూడా అంటారు. వారు పురాణాల ప్రకారం జీసస్ పుట్టిన రాత్రి రాకపోయినా, బొమ్మల కొలువు మాత్రం వారి భక్తిని సూచించే విధంగా వారు వచ్చినట్లే అలంకరించబడుతుంది. వారు జీవితంలో మూడు దశలకి ప్రతీకలు- బాల్యం, నడివయస్సు, చివరన వృద్ధాప్యం. వారు వేసుకునే బట్టలు కూడా అప్పట్లో ఉండే మూడు ఖండాలు యూరోప్, ఆసియా మరియు ఆఫ్రికాను సూచింఛే బట్టలు. మాగీ తెచ్చిన బహుమతులు బంగారానికి చెందినవి, ఇవి రాజ్యాధికారం, దైవత్వానికి ఆరాధన, మరియు తర్వాత కాలంలో జీసస్ చేయబోయే మరణ త్యాగానికి ప్రతీకలు.

దేవతలు

దేవతలు

దేవతలు వారు పోషించిన పాత్రలనే సూచిస్తారు. వీరే క్రీస్తు జననాన్ని కాపరి వాళ్ళకి తెలియచేస్తారు. దేవతలు ఉండటం జీసస్ దైవకార్యానికే పుట్టిన ప్రత్యేకమైన బిడ్డ అని సూచిస్తోంది.

బెత్లెహాం నక్షత్రం

బెత్లెహాం నక్షత్రం

ఈ నక్షత్రం మాగీలకి బేబీ జీసస్ ను కలవడానికి మార్గాన్ని తెలిపింది. అందుకే కొన్నిసార్లు క్రీస్తు జననఘట్టంలో నక్షత్రాన్ని కూడా వాడతారు.

సందేశం

సందేశం

ఈ క్రీస్తు జనన ఘట్టం బొమ్మల కొలువు వెనకాల ముఖ్యమైనది అది ఇచ్చే సందేశం. ప్రజలకి దేవుడు తన బిడ్డను భూమి మీదకి కేవలం వారికోసమే పంపాడని గుర్తు చేయటం దీని వెనక ముఖ్య అర్థం. జీసస్ పుట్టినది మనుషులు చేసే పాపాలకి తాను త్యాగం చేయడానికే. ఈ ఆలోచన భక్తిని పెంచి, భౌతిక అవసరాలను దూరం చేసి, క్రిస్మస్ అంటే ప్రేమను పంచడం, దైవత్వాన్ని అనుసరించడం అని తెలుపటం దీని ముఖ్య సందేశం.

English summary

significance of nativity scene | importance of nativity scene | what is nativity scene

One of the renowned symbols of Christmas is the nativity scene. It has become a very intricate part of the tradition. The word 'nativity' is derived from the Latin word 'nativus', which means 'arisen by birth'.
Story first published: Monday, December 18, 2017, 17:00 [IST]