నవరాత్రి స్పెషల్ : దుర్గా పూజ సమయంలో చండీ పథ్ ప్రాముఖ్యత

By: Lakshmi Perumalla
Subscribe to Boldsky

దుర్గా దేవి అన్ని మంచి పనులకు రక్షణగా ఉంది. దుష్ట మహిషసురను నాశనం చేయటానికి మొత్తం దేవతలు అందరూ కలిసి సృష్టించిన శక్తి దుర్గా దేవి.

మహిషసుర ప్రత్యేకమైన శక్తులను పొందాడు. కావున దేవతలు మహిషసురను అంతం చేయటం కష్టం. అందువల్ల దేవతలు అందరు కలసి సుప్రీం శక్తిని సృష్టించారు. మహిషసురను నాశనం చేయడానికి మరియు ప్రపంచంలో శాంతిని పునరుద్ధరించడానికి దుర్గా మాతా సృష్టించబడింది.

దశర పండుగ యొక్క ప్రాముఖ్యత మరియు ఆచారాలు

significance of reciting chandi path

దుర్గా మాతా బలం, శక్తి మరియు శ్రేయస్సు యొక్క సారాంశం. అందువల్ల దుర్గా పూజను ఆమె ఆశీర్వాదాన్ని అర్పించేందుకు చేస్తారు. చాలామంది హిందూ కుటుంబాలు దేవతల విగ్రహాలను ఇంట్లో ఉంచి ఆమె ఆశీర్వాదాన్ని ప్రేరేపించడానికి విస్తృతమైన పూజలను చేస్తారు.

దుర్గా దేవి యొక్క దీవెనలు కుటుంబంలోని అన్ని సమస్యలను మరియు అడ్డంకులను తొలగిస్తుంది. ఆమెను ఆరాధించేవారికి సంతోషాన్ని కలిగిస్తుంది. దుష్ట రావణాసురుని చంపటానికి రాముడు కూడా దుర్గా మాతా ఆశీర్వాదం తీసుకొనెను.

దుర్గా మాతా అనేక రూపాలను కలిగి ఉంది. ఆమె కోసం ప్రార్థన చేస్తున్న వారికీ ధైర్యం రూపంలో కనిపిస్తుంది. ఆమె భక్తుడు తన సమస్య మీద పోరాటం చేయటానికి సహాయం చేస్తుంది.

significance of reciting chandi path

చండీ పథ్ యొక్క ప్రాముఖ్యత

ప్రతి ఒక్కరు శక్తివంతమైన దేవత ఆశీర్వాదాన్ని కోరుకుంటారు. చండి మార్గాన్ని చెప్పడం ద్వారా ఇది చేయవచ్చు. చండి పథ్ ఒక పవిత్ర గ్రంధం. చంద్ అంటే సంస్కృతంలో చీల్చివేయు అని అర్ధం. ఒక వ్యక్తి చండీ పథ్ ని పఠించేటప్పుడు దైవిక శక్తి యొక్క ఉనికిని అతనికి తెలియకుండానే తెలుసుకుంటాడు. సమస్యల నుండి బయటపడతాడు.

చండీ పథ్ ని దుర్గా సప్తసతి అని కూడా పిలుస్తారు. ఇది మార్కండేయ పురాణంలో 13 అధ్యాయాలను కలిగి ఉంది.

ఈ కథలో మంచి చెడు మీద పోరాటం గురించి ఉంటుంది. దుర్గా దేవి మహిషసురను చంపటం ఉంటుంది.

ఈ మంచి సమయంలో దుర్గా దేవి లక్ష్మి దేవి రూపాన్ని తీసుకోని భక్తులకు సంపద మరియు సంతోషాన్ని ఇస్తుంది.

చండీ పథ్ ని పఠించటం వలన జీవితంలో అన్ని ప్రతికూల శక్తులను ప్రాలద్రోలుతుంది. చండీ పథ్ లో ఉన్న 700 పవిత్రమైన శ్లోకాలను చాలా ఏకాగ్రత మరియు అత్యంత భక్తితో చదవాలి. అప్పుడు జీవితంలో ఏర్పడే అడ్డంకులను తొలగించే శక్తిని పొందుతారు.

ఈ పవిత్ర గ్రంధాన్ని చైత్ర లేదా శరద్ ఋతువులో పఠిస్తే మంచిది. ఇది పురాణమే కాకుండా హోమాలు చేసే సమయంలో కూడా పఠిస్తారు.

దసరా నవరాత్రులు: దుర్గా దేవి 9 అలంకరణ రూపాలు ...

significance of reciting chandi path

చండీ పథ్ పఠించటం వలన కలిగే ప్రయోజనాలు

చండీ పథ్ పఠించటం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నవరాత్రి తొమ్మిది రోజులు చండీ పథ్ ని పఠిస్తే మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ది వ్యక్తికి ధైర్యం మరియు ప్రేరణను ఇస్తుంది. ఈ గ్రంధం చదివితే అవగాహన మరియు తెగింపుకు దారి తీస్తుంది.

చండీ పథ్ ని పఠించటం వలన శరీరంలో మస్తిష్క నరములు మరియు రక్త నాళాలు చైతన్యం నింపుకుంటాయి. చండీ పథ్ ని వినటం వలన మనుషుల్లో సానుకూల దృక్పధం పెరుగుతుంది. ఈ తరంగాలు రక్షిత వలయాన్ని ఏర్పాటు చేస్తాయి. అలాగే సానుకూల ఆలోచనలను కలిగించటం వలన ఆరోగ్యం కూడా బాగుంటుంది.

Read more about: నవరాత్రి
English summary

Significance Of Reciting Chandi Path During Durga Pooja

Check out the significance of reciting chandi path during Durga pooja.
Story first published: Tuesday, September 26, 2017, 8:00 [IST]
Subscribe Newsletter