వరమహాలక్ష్మి పండగలో యమున పూజ విశిష్టత!

By: DEEPTHI
Subscribe to Boldsky

సంపదకి, సుఖశాంతులకి ప్రతీకగా వరమహాలక్ష్మిని కొలుస్తారు. లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు, వరాల కోసం పూజ లేదా వ్రతం చేస్తారు. భక్తుల శ్రద్ధ, అంకితభావానికి మెచ్చి అమ్మవారు వరాలు కురిపిస్తారని నమ్మకం. అది సంపద లేదా మరేదన్నా కావచ్చు.

వరలక్ష్మీ వ్రతం సంకల్ప ఆచారం అయ్యాక యమునా పూజ చేస్తారు. ఈమెను పూజించటం వల్ల సకల విజయాలు, సంతోషాలు దక్కుతాయి.

spirituality

వరమహాలక్ష్మిని సంపద,ఆరోగ్యం, భర్తల దీర్ఘాయువు కోసం కూడా పూజిస్తారు. ఈ పండగను శ్రావణమాసం మొదటి శుక్రవారం నాడు అనగా జూలై లేదా ఆగస్టు సమయాల్లో జరుపుకుంటారు.

ఈ పండగను దక్షిణ భారతంలో ఎక్కువ బాగా జరుపుకుంటారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లలో ఇది చాలా ముఖ్యమైన పండగ. ఇక్కడి ప్రజలు సంవత్సరంలో ఇది ముఖ్యపండగల్లో ఒకటిగా భావించి జరుపుకుంటారు.

మహాలక్ష్మిని పూజించే సమయంలో శ్లోకాలను పఠిస్తారు. అనేక స్తోత్రాలు, శ్లోకాలు చదువుతారు కానీ వరమహాలక్ష్మి పూజ సమయంలో లక్ష్మీ అష్టోత్తరం శ్లోకాలు, లక్ష్మీ సహస్రనామాలు అదృష్టమైనవిగా భావిస్తారు.

ఈ శ్లోకాలతో పాటు, ఇతర పవిత్రమంత్రాలు కూడా పఠిస్తారు. ఈ పండగకి అనారోగ్యం ఉన్నా, ఉపవాసాలు ఉండి వ్రతం చేయాలన్న కఠిన నియమాలేం లేవు. కానీ పూర్తి మనస్సుతో ఈ వ్రతం చేస్తే లక్ష్మీ అమ్మవారు ప్రసన్నురాలై మీ కోరికలన్నీ నెరవేరుస్తారు.

spirituality

యమునా పూజ విశిష్టత

వరలక్ష్మీ పూజ సంకల్పం తర్వాత, యమునా పూజ నిర్వహిస్తారు. పూజ నియమాల ప్రకారం చిన్న కలశాన్ని నీటితో నింపి, చిటికెడు పసుపు, కుంకుమను అందులో వేయాలి.

కొంతమంది ఇంట్లోని తులసి మొక్క ముందు దీన్ని చేస్తారు, మరికొంతమంది పవిత్రమైన యమునానది ఒడ్డున చేస్తారు. వరలక్ష్మీ వ్రతం రోజున యమునానదిని పూజించటం ముఖ్యాచారంగా భావిస్తారు.

హిందువులు పవిత్రంగా భావించే ఈ పండగను, యమునాదేవిని దేశవ్యాప్తంగా గౌరవంతో, భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

యమునాదేవిని ప్రార్థించటం, ఈ పవిత్రనదిలో స్నానమాచరించటం వల్ల అనేక వ్యాధులు నయమయి, మోక్షం కూడా దక్కుతుంది.దీర్ఘకాలిక వ్యాధులున్నవారు యమునలో స్నానం చేస్తే ఆ అమ్మవారు వారి వ్యాధిని, బాధను తొలగిస్తారని నమ్మకం.

spirituality

యమునా పూజ భక్తులకు మానసిక, ఆధ్యాత్మిక శాంతిని, సుఖసంతోషాలను తీసుకొస్తుందని నమ్మకం. ఈ ఆచారం వల్ల కష్టాలు తొలగి మంచి జరుగుతుంది.

వరలక్ష్మీ పూజలో, లక్ష్మీదేవి ఆశీస్సులతో పాటు, యమునా పూజ చేయటం వల్ల భగవాన్ శ్రీ కృష్ణుడి అనుగ్రహం కూడా పొందుతారు.

యమునాపూజ చేయటం వల్ల భక్తులు తమ పాత పాపాలను తొలగించుకోగలుగుతారు. ఇంకా యమునాదేవి వారికి నిజాయితీగా, సరిగా బ్రతకడానికి కొత్త అవకాశం అందిస్తుంది.

దేశవ్యాప్తంగా హిందువులందరికీ జూలై, ఆగస్టు నెలలు పవిత్రమైనవి.

దక్షిణాదిన వరలక్ష్మీ వ్రతం చేసుకుంటే ఇతర ప్రాంతాల్లో ఇతర పండగలు జరుపుకుంటారు. యమునాపూజను యమునాదేవి అనుగ్రహం కోసం భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. భక్తుల నమ్మకమే వరలక్ష్మీ వ్రత పండగను గొప్ప ఉత్సవంలా మార్చేస్తుంది.

English summary

Significance Of Yamuna Pooja In Varamahalakshmi Festival

In the auspicious festival for Varamahalakshmi, Yamuna puja has a special importance. Read to know more on this.
Story first published: Thursday, August 3, 2017, 8:00 [IST]
Subscribe Newsletter