108 సంఖ్య యొక్క ప్రాముఖ్యత

Written By: Gayatri Devupalli
Subscribe to Boldsky

మత సంబంధిత విషయాలు చర్చకు వచ్చినప్పుడు మనం తరచుగా108 అనే సంఖ్యను గురించి వింటూ ఉంటాం. ఈ సంఖ్య పవిత్రమైనదిగా ప్రపంచంలో పలు మతాలకు చెందినవారు భావిస్తారు. జపమాలలో 108 పూసలుంటాయి. హిందువులు ఆలయాల చుట్టు108 ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈ సంఖ్యకు ఇంత ప్రాముఖ్యత తెచ్చిపెట్టిన వివిధ కారణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. చదవండి!

1. తాండవంలో 108 రకాల కదలికలు ఉంటాయి. శివుడు ఉగ్రరూపం దాల్చినపుడు చేసే నాట్యమే తాండవం. శివుడికి 108 గణాలు ఉంటాయి. కనుకనే లింగాయత్లు 108 పూసలున్న మాలను వాడతారు.

2. గంగానదికి 108 కొలతలుంటాయి. గంగానది యొక్క అక్షాంశం 9° కాగా రేఖాంశం 12°. ఈ రెండు సంఖ్యలను గుణిస్తే 108 వస్తుంది.

There is a high significance for the number 108 in many religions. Lord Shiva had 108 Ganas. The Tandava dance performed by Lord Shiva also has 108 movements. The distance between the Earth and the Sun is 108 times the diameter of the Sun. 108 beads are worn by the followers Jainism, Buddhism and Sikhism also as necklaces or bracelets.

3. కృష్ణ భాగవానుడికి అనుచరులుగా బృందావనంలో 108 మంది గోపికలు ఉండేవారు.వీరి నామాలను ఉచ్ఛరించడానికి 108 పూసలున్న మాలను వాడతారు.వైష్ణవ సంప్రదాయాలను అనుసరించి శ్రీ మహా విష్ణువునకు108 దివ్యదేశాలు ఉన్నాయి. తమిళ

శ్లోకాలలో చెప్పినట్లు విష్ణు మూర్తికి 108 ఆలయాలు అంకితమివ్వబడ్డాయి.

4. పాలపుంతలో 27 నక్షత్ర మండలాలు ఉన్నాయి. వీటికి నాలుగు పరిమాణాలు ఉన్నాయి. ఈ రెండు సంఖ్యలను గుణిస్తే 108 వస్తుంది.

5. భూమి మరియు సూర్యుని మధ్య ఉన్న దూరం, సూర్యుని వ్యాసానికి 108 రెట్లు ఉంటుంది. అదేవిధంగా భూమి మరియు చంద్రునికి మధ్య ఉన్న దూరం, చంద్రుని వ్యాసానికి 108 రెట్లు ఉంటుంది.

6. జైనమతంలో కర్మ ప్రవాహం 108 రకాలుగా ఉంటుంది. కోపం, గర్వం, మోసం మరియు దురాశ అనే నాలుగు కాశ్వేస్లు ఉంటాయి. మనస్సు, వాక్కు మరియు కర్మ అనే మూడు కారణాలు ఉంటాయి. ప్రణాళిక క్రమంలో కూడా మొయిద దశాలుంటాయి. ప్రణాళికను రూపొందించడం, దాని అవసరాలను సమకూర్చుకోవడం, మరియు ఆ ప్రణాళిక మొదలుపెట్టడం. అదేవిధంగా, ఆచరణకు మూడు మార్గాలు. అవి పని మొదలుపెట్టడం, పని పూర్తి చేయడం మరియు చేసిన పనికి ఆమోదం పొందడం. ఈ సంఖ్యలన్నింటిని గుణిస్తే కర్మ ప్రవాహ సంఖ్య 108 వస్తుంది.

7. జైనమతానుసారం, ఆరు రకాల భావాలు లేదా జ్ఞానాలు ఉంటాయి. అవి ధ్వని, వాసన, రుచి,స్పర్శ, చూపు మరియు స్పృహ. ఇవి మళ్ళా అవి అందించే భావనల ( ఆహ్లాదకరమైన, బాధాకరమైన లేదా తటస్థ భావన కలిగించాయా) ఆధారంగా విడదీయబడ్డాయి. అవి మళ్ళా వాటి పుట్టుక ఆధారంగా, (అంతర్లీనంగా ఉత్పత్తి అయినవా లేదా బాహ్యంగా ఉత్పత్తి అయినవా) రెండు రకాలుగా విడదీయబడ్డాయి. మళ్ళా అవి భూత, భవిష్యత్, వర్తమానాలలో ఎప్పుడు జరిగాయన్నదాని బట్టి విడదీయబడ్డాయి.

8. టిబెటన్ బౌద్ధుల మాలలో 108 పూసలుంటాయి. దానిని వారు తమ మణికట్టు చుట్టూ ధరిస్తారు. బౌద్ధ సాహిత్య ప్రకారం, బుద్ధుడు 108 ప్రకటనలు చేసాడు. పొరపాటున వాటిని వివిధ ఆలయాల మెట్ల సంఖ్య అయిన 108తో ముడిపెట్టారు.

9. జపాన్లోని బౌద్ధ దేవాలయాలలో పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి, గుడి గంటలను 108 సార్లు మ్రోగిస్తారు. ఇవి భూమిపై మానవుడు 108 ప్రలోభాలను అధిగమించి, కైవల్యాన్ని సాధించాలని సూచిస్తాయి.

10. యుద్ధ విద్యల (మార్షల్ ఆర్ట్స్) పుట్టుక హిందు మరియు బౌద్ధ మతాల నుండి జరిగిందని ప్రతీతి. ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో 108

ఒత్తిడి కేంద్రాలు ఉంటాయని విశ్వసిస్తారు. ఈ కేంద్రాల వద్ద మానవుని దేహం మరియు ఆత్మ లేదా స్పృహ ఐక్యంగా ఉంటాయి. ఈ కేంద్రాల ద్వారానే మన దేహానికి ప్రాణం పోయబడుతుంది.

11. మన శరీర అంతర్గత ఉష్ణోగ్రత 108°ఫారన్హీట్ చేరుకుంటే అన్ని అవయవాలు అధికోష్ణం వలన వైఫల్యం చెందుతాయి.

12. సిక్కు మతంలో 108 ముడులు ఉన్న ఉన్నితో చేయబడిన మాలను పవిత్రమైనదిగా భావిస్తారు.

13. సంస్కృత భాషలో 54 అక్షరాలు ఉంటాయి. వీటికి స్త్రీ పురుష రూపాలుంటాయి. కనుక మొత్తం అక్షరాల సంఖ్య 108.

English summary

Significance Of The Number 108

There is a high significance for the number 108 in many religions. Lord Shiva had 108 Ganas. The Tandava dance performed by Lord Shiva also has 108 movements. The distance between the Earth and the Sun is 108 times the diameter of the Sun. 108 beads are worn by the followers Jainism, Buddhism and Sikhism also as necklaces or bracelets.
Story first published: Saturday, May 12, 2018, 13:00 [IST]