తలలో పువ్వులు పెట్టుకోవడం దేనికి సంకేతం?

By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

స్త్రీలు తలలో పూలు పెట్టుకోవడ౦ అనేది భారతదేశంలో ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో ఒక సాధారణమైన విషయం. ప్రతిరోజూ ఉదయం, స్నానం చేసిన తరువాత స్త్రీలు సంప్రదాయంగా తలలో పూలు పెట్టుకుంటారు. ఈ పూలు ఖచ్చితంగా స్త్రీలకూ ఎంతో అందాన్ని ఇస్తాయి. కానీ స్త్రీలు ప్రతిరోజూ క్రమం తప్పకుండా పూలు ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా? ఇక్కడ తెలుసుకుందాం.

పూలు అందంగా కనిపించడానికే కాకుండా నిగూఢమైన అర్ధం కలిగి ఉంటాయి. ప్రతి పువ్వుకు దాని స్వంత ప్రత్యేకతను కలిగి ఉంటాయి. పూలు ప్రేమకు, అదృష్టానికి, సంతోషానికి, శ్రేయస్సుకు చిహ్నాలు. స్త్రీ తన జడలో పూలు పెట్టుకుంటే, ఆమె ఇల్లు సంతోషంతో నిండి ఉంటుందని నమ్ముతారు.

Significance Of Wearing Flowers On Hair

తలలో పూలు పెట్టుకోవడంలో ప్రాముఖ్యత

సాధారణంగా స్త్రీలు తెల్లటి మల్లెపూలను తమ జడలో ధరిస్తారు. కానీ మల్లెపూలతో పాటు, గులాబీ, బంతి, మందార, వయోలేట్స్ ని కూడా తలలో పెట్టుకుంటారు. తలలో పూలు పెట్టుకోవడంలో ప్రాముఖ్యతలను పరిశీలిద్దాము.

పువ్వులు తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

వివిధ రకాల పూలు

ప్రతిపువ్వుకు ఏదో ఒక అర్ధం ఇమిడి ఉంటుంది. ఇక్కడ స్త్రీలు సాధారణంగా ధరించే కొన్ని పూలు ఇవ్వబడ్డాయి.

Significance Of Wearing Flowers On Hair

మల్లెపువ్వు:

మల్లెపువ్వు దాని ఉత్కంఠభరితమైన సువాసన వల్ల పూలలో రాణిగా పిలవబడుతుంది. దీన్ని దేవుని పువ్వు అనికూడా పిలుస్తారు. ఎందుకంటే ఈపువ్వు లేకుండా ఎటువంటి పండగా పూర్తికాదు. ఇది శ్రేయస్సుకు, అదృష్టానికి చిహ్నం. కాబట్టి స్త్రీలు ఎక్కువగా మల్లెపూలను తమ జడలో ధరిస్తారు.

Significance Of Wearing Flowers On Hair

గులాబీ:

గులాబీ ప్రేమకు, అభిరుచికి చిహ్నం. ఇది ప్రియమైన వారి సంతాపానికి గుర్తు. కాబట్టి, ఒక అబ్బాయి తన జుట్టులో గులాబీ ధరిస్తే జీవితంలో ఆమె అభిరుచిని తెలియచేస్తున్నట్టు లేదా తను పోగొట్టుకున్నవారి గుర్తుకు చిహ్నంగా భావిస్తారు.

ఫ్లవర్ ఫేస్ ప్యాక్ తో.. అద్భుతమైన చర్మ సౌందర్యం

Significance Of Wearing Flowers On Hair

చేమంతి:

ఈ అందమైన పూలు సంతోషానికి చిహ్నాలు. కాబట్టి, ఒక అమ్మాయి తన జుట్టులో చేమంతిని ధరిస్తే ఆమె తన కుటుంబంలో సంతోషాన్ని తీసుకు వస్తుందని చెప్తారు.

Significance Of Wearing Flowers On Hair

వయోలేట్స్:

ఒక అమ్మాయి తన తలలో వయోలేట్ల తీగను ధరిస్తే అది అదృష్టాన్ని తీసుకు వస్తుందని చెప్తారు.

Significance Of Wearing Flowers On Hair

మందార:

మందార పువ్వును శక్తికి మరోరూపమైన కాళి మాతను పూజించడానికి ఉపయోగిస్తారు కాబట్టి ఇది శక్తికి చిహ్నం.

కార్తీక మాసంలో శివుడిని ఈ పువ్వులతో పూజితే పాపాలు, కష్టాలు తొలగిపోతాయి..!!

పువ్వుల ప్రాముఖ్యత

పూలు అనే భాష చాలా పురాతనమైనది. భారతదేశంలోని ప్రతి సంస్కృతి పూలకు వివిధ రకాల అర్ధాలను జోడించింది, స్త్రీలు ఈ పూలను ధరిస్తారు. భారతదేశంలో, ఒక అమ్మాయి తన జడలో పువ్వులు పెట్టుకుంటే, ఆమె కుటుంబంలో సంతోషం నిండి, అందరికీ శ్రేయస్సు కలిగి ఉంటుందని అర్ధం. ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలయంగా ఉంటుందని చిహ్నం, ఆ సంపద ఆ ఇంటిని ఎప్పటికీ వదిలి పెట్టాడు.

కాబట్టి, పూలు ధరించడం అనేది అందాన్ని ఇవ్వడమే కాదు, కుటుంబ శ్రేయస్సుకు కూడా ఇది చిహ్నం.

English summary

Significance Of Wearing Flowers On Hair

Flowers have a deeper meaning than just being beautiful to look at. Every flower has its own set of qualities attached to it. Flowers are a symbol of love, good luck, happiness and prosperity. When a woman wears the flower on her hair, it is believed that it will bring happiness to her household.
Story first published: Friday, July 7, 2017, 18:00 [IST]
Subscribe Newsletter