For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు ఈ సంకేతాలు కనిపిస్తే.. శని మహర్దశ ప్రారంభమైనట్టే.. జర భద్రం...!

మీకు ఈ సంకేతాలు కనిపిస్తే, శని మహాదశ ప్రారంభమైనట్టే.. అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో శని గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. శని గ్రహాన్ని న్యాయానికి అధిపతిగా పండితులు చెబుతుంటారు. ఎవరైతే మంచి పనులు చేస్తారో.. వారికి శని శుభ ఫలితాలను ఇస్తాడు.

Signs of Shani Mahadasha and You Should Be Careful In Telugu

అదే సమయంలో ఎవరైతే చెడు పనులు చేస్తారో.. వారిని శిక్షిస్తాడని పండితులు చెబుతుంటారు. ఎందుకంటే శని దేవుడు మంచి, చెడు కర్మ ఫలాలను మానవులకు అందిస్తాడు. ప్రతి వ్యక్తి జాతకంలో శని ఉచ్ఛ స్థితి అనేది ఉంటుంది.

Signs of Shani Mahadasha and You Should Be Careful In Telugu

అందుకే శని మంచి, చెడు రెండింటినీ ప్రభావితం చేస్తాడు. అయితే శని చెడు స్థానంలో ఉన్నప్పుడు వ్యక్తుల జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి. అలాంటి వాటిని గమనించడం వల్ల మనపై శని ప్రభావం ఉందో లేదో తెలుసుకోవచ్చని పండితులు చెబుతున్నారు.

Signs of Shani Mahadasha and You Should Be Careful In Telugu

ఈ నేపథ్యంలో శని ప్రభావం ఏయే విషయాల మీద ఉంటుంది.. శని మహార్దశ ప్రారంభమైందని ఏ సంకేతాలను బట్టి చెప్పొచ్చు.. వాటి పరిహారం కోసం ఏమేం చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

జూన్ నెలలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలు మరియు వ్రతాలు ఏమిటో మీకు తెలుసా?జూన్ నెలలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలు మరియు వ్రతాలు ఏమిటో మీకు తెలుసా?

దానిపై బలమైన కోరిక..

దానిపై బలమైన కోరిక..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మీకు మాంసం లేదా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవాలనే కోరిక బలంగా ఉంటే, శని చెడు ప్రభావం మీపై ఉందని అర్థం చేసుకోవచ్చు. అప్పుడు మీపై శని మహర్దశ ప్రారంభం అవుతుందని గమనించాలి. అయితే మీరు ఇలాంటి చెడు అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే, అంత శని దుర్మార్గపు ప్రభావాలు మీ నుండి దూరమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మాంసాన్ని వదిలేసి, శాఖాహారం తినడం ప్రారంభించాలి. అలాంటి వారికి శని ప్రభావం తగ్గిపోతుందని పండితులు చెబుతున్నారు.

మీ చేతి రంగు మారితే..

మీ చేతి రంగు మారితే..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మీపై శని ప్రభావం తీవ్రంగా ఉంటే, మీ అరచేతిలో రంగు మారిపోతుందట. మీ అరచేతిలోని రంగు మారిపోవడం ప్రారంభమైందంటే.. మీపై శని చెడు ప్రభావం పడినట్టే. ముఖ్యంగా మీ అరచేతి రంగు బ్లూ కలర్లో మారడం ప్రారంభించి అక్కడి నుండి నల్ల మచ్చలుగా కనబడుతూ ఉంటే శని మీపై కోపంగా ఉన్నాడని తెలుసుకోవచ్చు. ఆ సమయంలో మీ ముఖం కూడా చాలా డల్ గా మారిపోతుందట.

శని ప్రభావంతో..

శని ప్రభావంతో..

మీపై శని ప్రభావం ఉందని తెలుసుకోవడానికి ఇది కూడా ఒక కారణమే అంటున్నారు పండితులు. ఎవరైనా మీ పాదరక్షలను దొంగిలించినప్పుడు అది కూడా శని చెడు స్థితే అనుకోవాలి. అప్పుడు మీరు శని అనుగ్రహం పొందాలంటే.. శనివారం రోజున ఎవరికైనా నల్లని రంగులో ఉండే పాదరక్షలను దానం ఇవ్వాలి. అయితే పాత లేదా మీరు ఇదివరకే ధరించిన పాదరక్షలను మాత్రం దానం ఇవ్వకూడదని గుర్తుపెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీరు శని దేవుని అనుగ్రహం పొందొచ్చు. అలాగే పేదవారికి దానం చేసే వస్తువుల్లో కూడా కొత్తవి మాత్రమే ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల శని దేవుని సానుకూల ఫలితాలు లభిస్తాయి.

గరుడ పురాణం ప్రకారం, ఈ 5 పనులు చేస్తే దురదృష్టానికి ఆహ్వానం పలికినట్టే...!గరుడ పురాణం ప్రకారం, ఈ 5 పనులు చేస్తే దురదృష్టానికి ఆహ్వానం పలికినట్టే...!

శని కోపం వల్ల..

శని కోపం వల్ల..

మీ ఇంట్లో లేదా దుకాణం లేదా ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగితే అది కూడా శని ఆగ్రహం వల్లే జరిగిందని అర్థం చేసుకోవాలి. మీ జాతకం శని గ్రహం చెడు స్థితిలో ఉన్నప్పుడు ఈ రకమైన సంకేతాలు కనిపిస్తాయని చాలా మంది నమ్ముతారు. ఇలా జరిగితే మీరు ఏ మాత్రం వాటిని విస్మరించకూడదు. శని దేవుడిని సంతోషపెట్టడానికి మీరు చెడు అలవాట్లను వదులుకోవడానికి ప్రయత్నించాలి.

అకస్మాత్తుగా సమస్యలు..

అకస్మాత్తుగా సమస్యలు..

మీ బాడీలో సడెన్ గా ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా శని చెడు స్థితికి కారణమని చెప్పొచ్చు. ముఖ్యంగా మీ శరీర భాగాల్లోని చెవులు, ఎముకల్లో నొప్పులు ఉంటే, శని మీ పట్ల చాలా ఆగ్రహంతో ఉన్నారని అర్థం చేసుకోవాలి. శని ప్రభావం చెడుగా ఉన్నప్పుడు మీ బాడీలో సోమరితనం, నిర్లక్ష్యం మొదలవుతుంది. మీరు ఏ పనిలోనూ చురుకుగా ఉండలేరు. ఈ సంకేతాలు శని ప్రభావాన్ని సూచిస్తాయని అర్థం చేసుకోవాలి.

రిలేషన్ షిప్ లో సమస్యలు..

రిలేషన్ షిప్ లో సమస్యలు..

మీ జీవిత భాగస్వామితో రిలేషన్ షిప్ లో సడెన్ గా సమస్యలు వస్తే శని మీ జాతకంలో బలహీనంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. అలాంటి సమయంలో మీ కుటుంబంలో కూడా ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. ఇలాంటి సమయాల్లో ఎలాంటి కారణం లేకుండా చట్టపరమైన విషయాల్లో చిక్కుకోవడం శని చెడు స్థితికి కారణమవుతుంది. మీపై ఆర్థిక పరమైన భారం పెరగొచ్చు. చాలా మంది మిమ్మల్ని వ్యతిరేకించే అవకాశం ఉంది.

అలా అనిపించకపోతే..

అలా అనిపించకపోతే..

మీ బాడీలో సడెన్ గా ఏవైనా భారీ మార్పులు వచ్చినప్పుడు, మీకు స్నానం చేయాలని అనిపించకపోవడం, మీకు ఇష్టం లేకపోయినా మురికి బట్టలు వేసుకోవడం వంటివి శని అశుభ ప్రభావాలను సూచిస్తాయి. ఇలా జరిగినప్పుడు ప్రజలు వారి అందం, బట్టల పట్ల అజాగ్రత్తగా ఉండటం ప్రారంభించాలి. వస్త్రధారణ చేసుకోవడానికి కూడా మీరు పెద్దగా ఆసక్తి చూపరు. మీరు అందంగా ఉండాలని, మంచి వస్త్రాలు ధరించాలని అస్సలు అనుకోరట.

English summary

Signs of Shani Mahadasha and You Should Be Careful In Telugu

Here are the signs of shani mahadasha and you should be careful in telugu. Have a look,
Desktop Bottom Promotion