For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Somavati Amavasya 2022:సోమవతి అమావాస్య రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు...

|

హిందూ మత విశ్వాసాల ప్రకారం, ప్రతి అమావాస్యకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అమావాస్య ప్రతి మాసంలో ఒకసారి వస్తుంది.

అయితే జ్యేష్ట మాసంలో వచ్చే అమవాస్యకు ఎంతో విశిష్టత ఉంది. ఈ అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు. ఈ ఏడాది మే 30వ తేదీన అంటే సోమవారం నాడు సోమవతి అమావాస్య వచ్చింది. ఇదే రోజున శని జయంతి, సావిత్రి వ్రతం కూడా రావడం విశేషం.

సుమారు 30 సంవత్సరాల తర్వాత ఇలా మూడు పండుగలు ఒకేరోజున వచ్చాయి. ఇలాంటి సంఘనటలు చాలా అరుదైన సందర్భాల్లో వస్తుంటాయి. ఈ పవిత్రమైన రోజు పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తే కచ్చితంగా శివుని అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈ సందర్భంగా ఈ పవిత్రమైన రోజున చేయాల్సిన ముఖ్యమైన పనులేంటి? ఎలాంటి పనులను అస్సలు చేయకూడదనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

శనిదేవుని అనుగ్రహం సులభంగా పొందాలంటే? శని జయంతి నాడు మీ రాశి ప్రకారం ఇలా చేయండి...

సోమవతి శుభ సమయం..

సోమవతి శుభ సమయం..

జ్యేష్ట మాసంలో అమావాస్య ఆదివారం 29 మే 2022 మధ్యాహ్నం 2:54 గంటలకు ప్రారంభమై 30 మే 20 సాయంత్రం 4:59 గంటలకు ముగుస్తుంది. అయితే మే 30వ తేదీన అంటే సోమవారం ఉదయం నాడు తిథి రావడంతో ఇదే రోజున అమావాస్య జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండే వారు గొప్ప ఫలితాలను పొందుతారు.

Planet Transit in June 2022 :జూన్ నెలలో 5 గ్రహాల సంచారం.. ఈ రాశులకు ధన లాభం...!

పూజా విధానం..

పూజా విధానం..

సోమవతి అమావాస్య వంటి పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి సూర్యోదయం కంటే స్నానం చేయాలి. పూజకు ముందు కొన్ని నీళ్లను చేతిలో తీసుకుని వ్రత సంకల్పం చేసుకుని, సూర్యదేవునికి సమర్పించాలి. ఈరోజున మీ పూర్వీకులను స్మరించుకుంటూ మీ సామర్థ్యం దానం చేస్తే మంచి లాభాలొస్తాయి. సోమవతి అమావాస్య రోజున పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేయాలి. అదేవిధంగా లక్ష్మీదేవి పూజను చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. ఇదే రోజున వివాహిత స్త్రీలు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఈరోజున ఉపవాసం ఉండి పూజలు చేస్తే శుభఫలితాలొస్తాయి.

చేయాల్సిన పనులు..

చేయాల్సిన పనులు..

* సోమవతి అమావాస్య రోజున రావిచెట్టుకు ప్రత్యేక పూజలు చేయాలి. అలాగే పసుపు రంగు దారాన్ని 108సార్లు చెట్టుకు చుట్టాలి.

* ఈరోజున పూర్వీకులను స్మరించుకోవాలి. అదేవిధంగా అవసరమైన వారికి వస్త్రాలను దానం చేయాలి.

* సోమవతి అమావాస్య రోజున పూర్వీకులను స్మరించుకుంటూ నువ్వులను సమర్పించాలి.

* ఈ పవిత్రమైన రోజున రావి మొక్కను నాటండి మరియు ఈ మొక్కను నిరంతరం సేవించండి. ఇలా చేయడం వల్ల తల్లిదండ్రులు మరియు పూర్వీకులు చాలా సంతోషిస్తారు.

ఇవి అస్సలు చేయొద్దు..

ఇవి అస్సలు చేయొద్దు..

* సోమవతి అమావాస్య రోజున మాంసం, మద్యం జోలికి వెళ్లొద్దు.

* ఈరోజు జుట్టు, గోళ్లు కత్తిరించొద్దు.

* రావిచెట్టును పూజించేంటప్పుడు ఆ చెట్టును తాకొద్దు.

* ఈరోజున ఎవ్వరినీ దూషించకూడదు. చెడు మాటలు మాట్లాడొద్దు.

గమనిక: ఈ సమాచారం ఆన్ లైనులో అందుబాటులో ఉన్న ఊహాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ఈ కథనంపై బోల్డ్ స్కై తెలుగు ఎలాంటి హామీ ఇవ్వదు. మీరు ఈ సమాచారాన్ని, ఊహాలను పరిగణనలోకి తీసుకునే ముందు దయచేసి సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.

2022లో సోమవతి అమావాస్య ఎప్పుడొచ్చింది?

హిందూ మత విశ్వాసాల ప్రకారం, ప్రతి అమావాస్యకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అమావాస్య ప్రతి మాసంలో ఒకసారి వస్తుంది. అయితే జ్యేష్ట మాసంలో వచ్చే అమవాస్యకు ఎంతో విశిష్టత ఉంది. ఈ అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు. ఈ ఏడాది మే 30వ తేదీన అంటే సోమవారం నాడు సోమవతి అమావాస్య వచ్చింది. ఇదే రోజున శని జయంతి, సావిత్రి వ్రతం కూడా రావడం విశేషం. సుమారు 30 సంవత్సరాల తర్వాత ఇలా మూడు పండుగలు ఒకేరోజున వచ్చాయి. ఇలాంటి సంఘనటలు చాలా అరుదైన సందర్భాల్లో వస్తుంటాయి.

English summary

Somavati Amavasya 2022 Date, Puja Vidhi, Significance, Do’s and Don’ts in Telugu

Somvati Amavasya 2022: Here We are talking about Date, Puja Vidhi, Significance, Dos and Donts of Somvati Amavasya in Telugu.
Desktop Bottom Promotion