For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  శ్రీకృష్ణుని కథలలో ఆధ్యాత్మికత: జన్మాష్టమి స్పెషల్

  By Deepthi
  |

  చాలామందికి శ్రీకృష్ణుడు అంటే పరమభక్తి. మహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన కృష్ణుడు తన భక్తులను, మంచిని ప్రేమించే వ్యక్తి. కృష్ణుడి ప్రేమ ఎంత అమితమైనదంటే ఒకవేళ భక్తుడు తనని మర్చిపోయినా, వారు గుర్తుచేసుకునేంతవరకూ తల్లిలాగా ఎదురుచూస్తూనే ఉంటాడట.

  కృష్ణుడు ఇతర హిందూ దేవతలకన్నా ఎంతో భిన్నం. మిగతావారు తమ ప్రత్యేక లక్షణాలు,శక్తులతో ప్రసిద్ధులు కానీ కృష్ణుడు అనేక కళలున్న వాడు, అతన్ని నిర్వచించలేం.

  అతని కథలో ప్రతి అంశం ఏదో ఒక కొత్త విషయం నేర్పిస్తూనే ఉంటుంది. ఆయన కథ, వ్యక్తిత్వాన్ని దగ్గరగా గమనిస్తే, అనేక ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవచ్చు. ఈరోజు మేము మీకు శ్రీకృష్ణుని కథలలోని ఆధ్యాత్మిక రహస్యాలు పరిచయం చేయబోతున్నాం.

  భక్తి కేవలం ఒకరకమైనది కాదు

  భక్తి కేవలం ఒకరకమైనది కాదు

  గతంలోని ప్రముఖ భక్తులను గమనిస్తే, భక్తి చాలా రకాలని అర్థమవుతుంది. పురాణాలలో గోపికలు కృష్ణున్ని ప్రేమించారు. సుదాముడికి అతను స్నేహితుడు. ద్రౌపదికి నమ్మకస్తుడు, మిత్రుడు, సోదరుడు మరియు రక్షకుడు.

  ఇంకా ఇటీవలి కాలాలకు వస్తే, మీరాబాయి కృష్ణుడిని ఎంతో ప్రేమించి, కుటుంబాన్ని కూడా అతని కోసం వదిలేసింది. కేరళకి చెందిన కురూర్ అమ్మ తన బిడ్డను పెంచినట్లే స్వామిని తిట్టి అరిచేది. ఒక ముస్లిం భక్తుడికి శ్రీకృష్ణుడు ఎద్దులా కూడా కన్పించాడని నమ్ముతారు.

  దీని ప్రకారం భక్తికి రూపాల్లేవని అర్థమవుతున్నది. ఆయన్ని ఎలా అయినా పూజించండి, ఎప్పుడూ కృష్ణుడు మీతోనే ఉంటాడు.

  శ్రీకృష్ణుడికి ఇష్టమైన విషయాలు ఏంటి

  కృష్ణావతారం ఉద్దేశం

  కృష్ణావతారం ఉద్దేశం

  అవతారం అన్న పదం రెండు సంస్కృత పదాలు- ‘అవ' అంటే రాక మరియు ‘తార' అనగా నక్షత్రం నుంచి పుట్టింది. అతను చాలా కల్లోల పరిస్థితుల్లో జన్మించాడు. ఆ సమయంలో కల్లోలానికి, దుష్టత్వానికి రూపం కంసుడు.

  కంసుడు కృష్ణ తల్లిదండ్రులను జైలులో బంధించాడు. ఆ జైలులో అనేక తలుపుల లోపల ఎక్కడో పెట్టి, పైగా గొలుసులతో కట్టి, కాపలా వారుకూడా ఉండేవారు.

  తల్లిదండ్రులు ఆత్మకి రూపాలు. మధ్య తలుపులు, ఇతర అవరోధాలు మనకి దేవుడి నుంచి దూరం చేసే, జ్ఞానం పొందటానికి అడ్డుపడే అవరోధాలు.

  అవరోధాలు ఎంత శక్తివంతమైనా, దేవుడు జైలుగదిలో జన్మించాడు. కాపలాభటులు, గొలుసులు, ఇనుప కడ్డీలు శ్రీకృష్ణుడి చైతన్యాన్ని ప్రపంచంలోకి దూసుకెళ్ళకుండా ఆపలేకపోయింది.

  తప్పించుకున్న శ్రీకృష్ణుని ఆరుగురు సోదరులు

  తప్పించుకున్న శ్రీకృష్ణుని ఆరుగురు సోదరులు

  మనకి తెలిసిన పురాణకథల ప్రకారం కంసుడు శ్రీకృష్ణుని ఆరుగురు సోదరులను చంపేసాడు. ఇక్కడ కూడా సంజ్ఞ ఉంది.

  దేవకి ఒకసారి కృష్ణుడిని తన చనిపోయిన పిల్లలను చూడాలని ఉన్నది, తెమ్మని కోరిందట. వారి పేర్లు స్మార, ఉడ్గిత, పరిస్వంగ, పతంగ, క్షుద్రభృత్ మరియు ఘృని. వీరు మానవ జ్ఞానేంద్రియాలకు ప్రతీకలు. స్మర అంటే జ్ఞాపకం, ఉడ్గిత అంటే మాట, పరిస్వంగ అంటే వినటం మొదలైనవి.

  వారందరూ చనిపోయాక, కృష్ణుడు పుట్టాడు. ఈ కథ ప్రకారం అన్ని ఇంద్రియాలు పోయాక, అన్నిటినీ మనస్సు జయించాకనే కృష్ణుడు జన్మించాడని అర్థం.

  నల్లశరీరం, పసుపు బట్టలు

  నల్లశరీరం, పసుపు బట్టలు

  శ్రీకృష్ణుడు నీలిమేఘ రంగు శరీరం కలవాడని అంటారు. ఈ రంగు విశ్వానికి ప్రతీక. పసుపు రంగు భూమికి ప్రతీక. ఈ రెండిటి కలయిక, నీలి శరీరం, పసుపు బట్టలు స్వామి ఆకాశం, భూమి రెండూ అని సూచిస్తున్నాయి. ఆయన విశ్వరూపం ఇలా కూడా వ్యక్తమవుతుంది.

  వస్త్రాపహరణం

  వస్త్రాపహరణం

  వస్త్రహరణం కథ ప్రకారం కృష్ణుడు గోపికలు స్నానం చేస్తున్నప్పుడు వారి వస్త్రాలను దొంగిలిస్తాడు. దాని అర్థం కృష్ణుడు తన భక్తుల అహంకారాన్ని తొలగిస్తున్నాడని. వారు శరణువేడాక మాత్రమే వారికి వారి బట్టలు తిరిగి ఇచ్చాడు.

  గోపికలతో ప్రేమాయణం

  గోపికలతో ప్రేమాయణం

  గోపికల ప్రేమ ప్రత్యేకం. చాలా గాఢమైనది మరియు శారీరక ప్రేమలో దాగిఉన్న భక్తి. కానీ గోపికలకు పెళ్ళిళ్లయిపోయి సంసార బాధ్యతలున్నాయి. వారు ఇంకొకరికి తల్లులు, కూతుళ్ళు, అక్కచెల్లెళ్ళు మరియు భార్యలు. రోజంతా స్వామిని తలుచుకుంటూ రోజువారీ పనులు నిర్వర్తించేవారు.

  ఈ కథలో నేర్చుకోవాల్సింది మనం మన స్వామిని ప్రేమించాలంటే అన్నీ త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మిక ప్రయాణంలో రోజూవారీ బాధ్యతలు బంధనాలు కానక్కర్లేదు.

  యువరాణిని కిడ్నాప్ చేసిన చిలిపి కృష్ణుడి.. ఆసక్తికర లవ్ స్టోరీ..!

  రాధాకృష్ణుల ప్రేమ

  రాధాకృష్ణుల ప్రేమ

  రాధ ఆత్మకు రూపమైతే, స్వామి పరమాత్మ. రాధ కృష్ణునికై పడే తపన ఆత్మ పరమాత్మ కోసం తపించడంతో సమానమైనది. వారిద్దరూ విడిగా ఉన్నా అనుక్షణం మరొకరి గురించి ఆలోచిస్తూనే ఉంటారు.

  విడిగా ఉన్నప్పుడు, ఆత్మ తన జీవన బాధ్యతలు నిర్వర్తించి పరమాత్మను కలిసే రోజు కోసం నిరీక్షిస్తుంది. కానీ నిజానికి, కృష్ణుడు, రాధ ఒకరు లేకపోతే మరొకరు అసంపూర్ణం.అలాగే ఆత్మ, పరమాత్మ కూడా.

  కృష్ణుడు మహాభారత యుద్ధంలో పాల్గొనలేదు.

  కృష్ణుడు మహాభారత యుద్ధంలో పాల్గొనలేదు.

  కృష్ణుడు మహాభారత యుద్ధంలో పాల్గొనలేదని అందరికీ తెలిసిన విషయమే. అర్జునుడికి రథం తోలేవాడిలా ఉండటాన్ని ఎంచుకున్నాడు. బార్బైకుడు చెప్పినట్లు నిజానికి యుద్ధం అంతా, చివరకి కూడా కేవలం కృష్ణుడే. అతను చూసిన ప్రతిఒక్కరిలో కృష్ణుడే కన్పించాడు. చనిపోయినవారూ కృష్ణుడే, చంపినది కూడా అతనే. ప్రతి వ్యూహం అతను రచించినదే.

  దీన్ని బట్టి శ్రీకృష్ణుడు మన జీవితాలని నేరుగా మార్చకపోవచ్చు

  దీన్ని బట్టి శ్రీకృష్ణుడు మన జీవితాలని నేరుగా మార్చకపోవచ్చు

  దీన్ని బట్టి శ్రీకృష్ణుడు మన జీవితాలని నేరుగా మార్చకపోవచ్చు, కానీ ఆయన అన్నిచోట్లా, అంతటా ఉన్నాడు. మన జీవితాలను కూడా అర్జునుడి రథం లాగా ముందుకి తనే నడిపిస్తాడు. కర్మ ప్రకారం, దుష్టులకి శిక్షకుడు, శిష్టులకి రక్షకుడు.

  English summary

  Spiritual Symbolism of Lord Sri Krishna’s Tales

  Each aspect of his story teaches us something new. If we look closer at his story and personality, there are a lot of spiritual lessons that can be learnt. Today, we bring you some of the hidden signs and secrets of Lord Sri Krishna's tales.
  Story first published: Monday, August 14, 2017, 18:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more