For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్రుని మహిమలు, విశిష్టత గురించి మీకు తెలుసా...

|

కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది మంత్రాలయంలో 349వ ఆరాధనోత్సవాలు నామమాత్రంగా జరగనున్నాయి. ఈ ఆరాధన సమయంలో రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి తుంగభద్ర జలాలతో అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేక జలాలనే మరుసటి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మఠంలో భక్తులకు తీర్థంగా ఇచ్చేవారు.

ఈ మఠంలోని బృందావనాన్ని భక్తులందరూ హరి మందిరంగా భావిస్తారు. మరో విశేషమేమిటంటే..ఇక్కడ సాలిగ్రామాలను ప్రతిష్టించారు. దీంతో ఎందరో మహానుభావులు ఇక్కడే కొలువై ఉన్నారని భక్తులు నమ్ముతారు.

తమ జీవితంలో రాఘవేంద్ర స్వామి బృందావనానికి ఒక్కసారి అభిషేకం చేస్తే.. ఎందరో గురువులకు, సాలిగ్రామాలకు అభిషేకాలు చేసినట్టేనని పండితులు చెబుతారు. అంతేకాదు ఈ జలాలు అత్యంత పవిత్రమైనవని.. ఇవి చాలా వ్యాధులను నయం చేస్తాయని పెద్దలు చెబుతారు. ఈ జలాలను భక్తులపై ప్రోక్షణం చేస్తే.. దెయ్యాల వంటి పీడలు కూడా తొలగిపోతాయని చాలా మంది భక్తుల విశ్వాసం. రాఘవేంద్ర స్వామి వారి జీవితం, బృందావనం మాత్రమే కాదు ఈ ఆలయంలోని అనేక విశేషాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి... అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

శ్రీరాఘవేంద్రస్వామి చరిత్ర..

శ్రీరాఘవేంద్రస్వామి చరిత్ర..

శ్రీ గురు రాఘవేంద్రస్వామి చరిత్రను పరిశీలిస్తే.. 1571లో కాంచీపురం సమీపంలోని భువనగిరిలోని నిరుపేద కుటుంబంలో తిమ్మనభట్టు, గోపికాంబ దంపుతలకు జన్మించాడు. తల్లిదండ్రులు ఆయనకు వెంకటనాథుడు అని పేరు పెట్టారు. ఈయన తన బావగారి పెంపకంలో సర్వశాస్త్ర సారంగతుడయ్యాడు. యుక్త వయసు రాగానే సరస్వతి అనే కన్యతో వివాహం అయ్యింది. ఓ బిడ్డకు జన్మ కూడా ఇచ్చారు. అప్పుడే ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. నిస్సహాయ స్థితిలో ఉన్న వెంకటనాథుడు తన కుటుంబంతో కలిసి కుంభకోణం చేరుకున్నాడు. అక్కడ తాత్కాలికంగా సుధీంద్ర తీర్థుల వారి ఆశ్రయం లభించింది.

సరస్వతీ దేవి కలలో..

సరస్వతీ దేవి కలలో..

అక్కడే సుధీంద్రుల వారు ఓ కోరిక కోరుతారు. తనకు సహాయం చేసిన గురువుకు ఏ సహాయం చేయలేకపోతున్నా అని మదనపడుతూ ఉండేవాడు. అయితే ఆరోజు రాత్రి కలలో సరస్వతీ దేవి ప్రత్యక్షమై ‘నాయనా వెంకటనాథా నీవు కారణ జన్ముడవు నీ అద్భుత మేథా శక్తితో సద్గురువువై దారి తప్పిన జనాలకు దారి చూపు.. నీవు నీ గురువు చెప్పినట్టు చెయ్యి ' అని పలికిందట.

సన్యాస దీక్ష..

సన్యాస దీక్ష..

ఆ తర్వాత నిద్ర నుండి మేల్కొని, వెంటనే గురువు సన్నిధికి చేరుకున్నాడు. సుదీంధ్రులు వెంకటనాథునికి తన ఆశ్రమంలో శాస్త్రోక్తంగా సన్యాస దీక్షనిచ్చి పీఠాధిపత్యం అప్పగించారట. అప్పుడే రాఘవేంద్ర స్వామిగా దీక్షానామం చేశారట.

నియమ నిష్టలతో..

నియమ నిష్టలతో..

సన్యాస దీక్ష తీసుకునేనాటికి రాఘవేంద్రుని వయసు 23 సంవత్సరాలు. అనంతరం 40 ఏళ్ల వరకు అతి పవిత్ర జీవనం గడిపి నియమ నిష్టలతో నిత్యం మూలరాముని ఆరాధించాడు. ఈ కాలంలో ఆయన ఎన్నో విజయాలు, మహిమలను సాధించాడు.

మృత్తిక విశిష్టత..

మృత్తిక విశిష్టత..

రాఘవేంద్ర స్వామి బృందావనంపై ఉంచే మృత్తిక ఎంతో విశిష్టమైనది. దీని వెనుక పెద్ద కథే ఉందని పండితులు చెబుతారు. చరిత్రను పరిశీలిస్తే.. రాఘవేంద్రుల బృందావన ప్రవేశానికి ముందు మంత్రాలయంలో ఉన్న సమయంలో ఓ బ్రాహ్మణ భక్తుడు స్వామి దగ్గరకు వెళ్లి నా కుమారుడి ఉపనయనానికి కొంత సొమ్ము కావాలని అడిగాడు. ఆ సమయంలో గురువు తుంగభద్ర నది ఒడ్డును స్నానం కోసం తయారవుతున్నాడు.

దెయ్యం సంహరణ..

దెయ్యం సంహరణ..

ప్రతిరోజూ అదే మృత్తికతో స్నానం చేసే స్వామి తుంగభద్ర తీరంలోని ఆ మట్టినే భక్తుడికి ఇచ్చారు. దానిని తీసుకున్న భక్తుడు దారితప్పి మరో ఊరికి చేరుకున్నాడు. అక్కడ గురు రాఘవేంద్ర స్వామి ఇచ్చిన మృత్తిక సాయంతో ఓ ధనవంతుడి సంతానాన్ని హరిస్తున్న దెయ్యాన్ని సంహరిస్తాడు.

పేద భక్తుడి ఇంట్లో ఉపనయనం..

పేద భక్తుడి ఇంట్లో ఉపనయనం..

ఆ సమయంలో సంతోషించిన ధనవంతుడు ఆ పేద భక్తుడి ఇంట్లో ఉపనయమన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అంతటి మహిమ ఉన్న ఆ మృత్తికను నేటికీ మంత్రాలయంలో పూజిస్తున్నారు. రాఘవేంద్ర స్వామి తాకిన ఆ ప్రదేశంలో ఇప్పుడు తులసి వనం మనకు కనిపిస్తుంది.

గురు పౌర్ణమి రోజు..

గురు పౌర్ణమి రోజు..

ప్రతి సంవత్సరం హిందూ క్యాలెండర్ ప్రకారం వచ్చే ఆషాఢమాసంలో గురు పౌర్ణమి రోజున స్వామి ఉత్సవమూర్తిని తీసుకెల్లి అక్కడి మృత్తికకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపుతో వచ్చి స్వామి మూల బ్రుందావనంపై ఉంచుతారు. అంతేకాదు ఇతర చోట్ల రాఘవేంద్రస్వామి ఆలయాల స్థాపనకు ఈ మృత్తికను ఉపయోగిస్తారు. భక్తులు కూడా ఈ మృత్తికను తీసుకెళ్లి ఇంట్లో ఉంచుకుంటారు.

యతీంద్రులు వాడిన పాత్రలోనే..

యతీంద్రులు వాడిన పాత్రలోనే..

రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్న అనంతరం భక్తులు పీఠాధిపతి ఇచ్చే మంత్రాక్షితాల కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తారు. ఈ అక్షింతల్లో పసుపు, సున్నం కలుపుతారు. అందుకే అవి ఎర్రగా మారతాయి. రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతిగా ఎవరున్నా భక్తులకు అక్షింతలను ఇచ్చే సంప్రదాయం రాఘవేంద్రస్వామి కాలం నుండి కొనసాగుతోంది. ఆనాడు యతీంద్రులు వాడిన పాత్రలోనే నేటికీ వాటిని తయారు చేసి భక్తులకు ఇవ్వడం అనేది విశేషం. ఇప్పటికీ మఠంలో ఆ పాత్ర పవిత్రతను కాపాడుకుంటూ వస్తున్నారు.

మంచాలమ్మ దర్శనం..

మంచాలమ్మ దర్శనం..

రాఘవేంద్ర స్వామిని దర్శించుకునే ప్రతి ఒక్క భక్తుడు ముందుగా మఠం ముందు ఉండే గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుంటారు. రాఘవేంద్రస్వామి మంత్రాలయంలో బృందావనంలో ప్రవేశించే ముందు అమ్మవారిని దర్శించకుంటారు. అమ్మవారు ఇక్కడే కొలువై ఉంటారు. ముందుగా అమ్మకు నైవేద్యం, దర్శనం తర్వాతే నా బృందావనాన్ని భక్తులు దర్శించుకుంటారని స్వామి వారు చెప్పినట్లు పండితులు చెబుతారు.

English summary

Sri Raghavendra Swamy History and Significance in Telugu

Here we talking about sri raghavendra swamy history and significance. Read on