For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవమి నాడే శ్రీ సీతారాములోరి కళ్యాణం జరిగిందా?

|

రామ అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని భారతీయుడు లేడంటే అతిశయోక్తి కాదు. శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన రోజుగా భావించి దేశవ్యాప్తంగా శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం అనేది ప్రతి ఏటా సంప్రదాయంగా వస్తోంది.

ఈ పండుగను హిందువులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీరాముడు త్రేతా యుగంలో వసంత కాలంలో ఛైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహుర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడు.

ఆ మహోన్నతమైన వ్యక్తి పుట్టినరోజునే భారతీయులంతా పండుగగా జరుపుకుంటారు. పద్నాలుగేళ్లు వనవాసం, రావణుడిని మట్టుబెట్టి అనంతరం శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యలో పట్టాభిషేకం పొందాడు. ఈ శుభ సమయం కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని చాలా మంది ప్రజలు నమ్ముతారు. అంతేకాదు శ్రీ సీతారాములోరి కళ్యాణం కూడా ఈరోజే జరిగిందని చాలా మంది నమ్మకం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భద్రాద్రి, కడప జిల్లాలోని ఒంటిమిట్టలో ప్రతి సంవత్సరం రాములోరి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు.

దశరథుడి యాగం..

దశరథుడి యాగం..

రామాయణం ప్రకారం కోసల దేశానికి రాజైన దశరథుడికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే ముగ్గురు భార్యలు ఉండేవారు. వారికి సంతానం లేకపోవడంతో వశిష్ట మహర్షి సలహాతో పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించిన దశరథుడికి అగ్నిదేవుడు ప్రసన్నమై ఓ పాయసం ఉండే పాత్రను అందజేస్తాడు. దశరథుడు తన ముగ్గురి భార్యలకు ఈ పాయసాన్ని ఇచ్చిన కొద్దికాలానికే వారు గర్భం దాల్చారు.

రాముడి జననం..

రాముడి జననం..

ఛైత్ర మాసంలో తొమ్మిదో రోజైన నవమి రోజున మధ్యాహ్నం సమయంలో కౌసల్యకు జన్మించాడు. ఆ తర్వాత కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ, శత్రఘ్నలు జన్మించారు. ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు ఏడో అవతారమే రాముడు. లంకాధిపతి రావణ సంహారం కోసమే రాముడు అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల ప్రకారం శ్రీరాముడు క్రీస్తు పూర్వం 51114 నుండి జనవరి 10వ తేదీన జన్మించి ఉంటారని భావిస్తున్నారు.

రామ రాజ్యంలో..

రామ రాజ్యంలో..

శ్రీరాముని రాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి మార్చి లేదా ఏప్రిల్ మాసాలలో వస్తుంది. శ్రీరాముడు పుట్టిన సమయం మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే చాలా మంది ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతంలో శ్రీరాములోరి శోభాయాత్రను ఘనంగా నిర్వహిస్తారు.

సూర్యవంశానికి ఆరాధ్యుడిగా..

సూర్యవంశానికి ఆరాధ్యుడిగా..

శ్రీరామ నవమి వేసవి కాలంలో ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు. అందుకే రాముడిని సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు. ఈ వంశానికీ చెందిన ప్రముఖులు దిలీపుడు, రఘు. వీరిలో రఘు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధి గాంచాడు.

14 ఏళ్లు వనవాసం..

14 ఏళ్లు వనవాసం..

వారిద్దరిలో రఘు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధి గాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడచి తండ్రి మాట కోసం పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు. మాట మీద నిలబడ్డ వ్యక్తి కాబట్టే రాముడిని రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు తదితర పేర్లతో పిలుస్తారు.

ఈ శ్లోకం మూడుసార్లు స్మరిస్తే..

ఈ శ్లోకం మూడుసార్లు స్మరిస్తే..

‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే‘ అనే శ్లోకాన్ని మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ, శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని చాలా మంది నమ్మకం. దుష్ట శిక్షణ, శిష్ట రకషణ కోసం ఛైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీ మహా విష్ణువే కౌసల్య పుత్రుడిగా ఈ భూమిపై జన్మించాడని నమ్ముతూ శ్రీరామ నవమిగా జరుపుకుంటారు.

రామ నామం జపిస్తే..

రామ నామం జపిస్తే..

రామ నామాన్ని ఉచ్ఛరించేటప్పుడు మన నోరు తెరచుకుని లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్ని జ్వాలలో పడి దహించుకునిపోతాయట. రామ అనే రెండక్షరాల్లో ‘మ‘ అనే అక్షరం ఉచ్చరించినపుడు మన పెదవులు మూసుకుంటాయి. కాబట్టి బయట మనకు కనిపించే పాపాలు లోనికి ప్రవేశించలేవట. అందుకే చాలా మంది హిందువులు రామ నామ స్మరణ చేసి ఎక్కువ మేధో సంపదను పొందుతారట.

అంతా రామ మయం..

అంతా రామ మయం..

శ్రీరామ నవమి పండుగను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క హిందువు పరమ పవిత్రంగా భావిస్తారు. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. నేటికి భ్రధ్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూవుంటుంది. భధ్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవ దేవుడి ఆశీస్సులు పొందుతారు. అలాగే కడపలోని ఒంటిమిట్టలోనూ శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు.

2022లో శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది?

హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవవత్సరం ఛైత్ర మాసంలో ఉగాది పండుగ తర్వాత సరిగ్గా తొమ్మిది రోజుల తర్వాత శ్రీరామ నవమిని జరుపుకుంటారు. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 10వ తేదీన ఆదివారం నాడు వచ్చింది. ఈ పవిత్రమైన రోజున దేశవ్యాప్తంగా చాలా ఆలయాల్లో సీతారాములోరి కళ్యాణం జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలం, కడప జిల్లాలోని ఒంటిమిట్టలో శ్రీసీతారాముల కళ్యాాణ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.

English summary

Sri Ram Navami History in Telugu

Sri Rama Navami, one of the most important Hindu festivals, is celebrated across the country to commemorate the birth of Lord Sri Rama.
Desktop Bottom Promotion