తులసి కథ

By: Deepit
Subscribe to Boldsky

తులసి మొక్క ప్రతి హిందువు ఇంట్లో తప్పనిసరిగా ఉండేది. ప్రతిరోజూ పొద్దున స్త్రీలు ఆ మొక్కకి నీరు, అగరొత్తులు, పువ్వులు వేసి పూజిస్తారు. ప్రతి సాయంత్రం దీపం వెలిగించి ఆ మొక్క ముందు ఉంచుతారు. మీరెప్పుడైనా కేవలం ఈ మొక్కనే ఎందుకు ఇంత ప్రత్యేకంగా పూజిస్తారో అని అనుకున్నారా?

ఎందుకంటే, హిందువులు తులసి మొక్కను దేవతగా భావిస్తారు. విష్ణుమూర్తికి ఆమె చాలా సన్నిహితం. ఏ పూజా తులసి ఆకులు లేకుండా పూర్తవ్వదు. తులసి మొక్కకి అనేక వైద్య, ఆరోగ్యలాభాలు కూడా ఉన్నాయి. జలుబు,దగ్గు వంటి వాటిని నయం చేయడానికి ఆయుర్వేద చికిత్సలో తులసి ముఖ్యమైన మొక్క. ఇది వాతావరణాన్ని కూడా శుద్ధిచేసి, దోమలకు వ్యతిరేకంగా కూడా పనిచేస్తుంది.

వినాయకుని పూజలో తులసి ఎందుకు నిషిద్దము..?

మీకు ఇంకా ఈ అద్భుతమొక్క గూర్చి తెలుసుకోవాలని ఉందా? అయితే, చదవండి.

తులసి అంకితభావం కల భార్య

తులసి అంకితభావం కల భార్య

హిందూ పురాణాలలో తులసిని వృందగా పిలుస్తారు. ఈమె కాలనేమి అనే రాక్షసుడి అందమైన కూతురు, యువరాణి. జలంధర్ ను ఆమె పెళ్ళాడుతుంది. శివుని మూడోకన్ను లోంచి పుట్టిన అగ్నిలోంచి పుట్టడం వలన జలంధర్ కి అపారశక్తి ఉన్నది. జలంధర్ ఎంతో భక్తురాలైన స్త్రీ అయిన యువరాణి వృందను ప్రేమిస్తాడు.

తులసి

తులసి

వృంద మహావిష్ణువు పరమభక్తురాలు, జలంధర్ ఏమో అందరు దేవుళ్ళను అసహ్యించుకునేవాడు. కానీ విధి వల్ల ఇద్దరూ పెళ్ళాడతారు. నిజానికి ఆమెతో పెళ్ళయ్యాక ఆమె భక్తి, పవిత్రత వల్ల అతని శక్తి మరింత పెరిగిపోయింది. పరమశివుడు కూడా జలంధర్ ను ఓడించలేకపోతాడు. అతని మూర్ఖత్వం పెరిగిపోయి పరమశివునే ఓడించి విశ్వానికి అధిపతి కావాలనుకుంటాడు.

ఒక దురదృష్ట దేవత

ఒక దురదృష్ట దేవత

దేవతలు జలంధర్ శక్తులను చూసి భయపడతారు. వారు విష్ణుమూర్తి వద్దకు సాయం కోసం వెళ్తారు. విష్ణుమూర్తి, వృంద తన భక్తురాలు కావటంతో, ఆమెకు జరగబోయే అన్యాయం వల్ల సందిగ్థంలో పడతాడు. కానీ జలంధర్ వల్ల జరిగే నష్టం వల్ల మహావిష్ణువు ఒక మాయ చేయాలని నిర్ణయించుకుంటాడు.

ఒక దురదృష్ట దేవత

ఒక దురదృష్ట దేవత

జలంధర్ పరమశివునితో యుద్ధంలో ఉండగా, విష్ణువు వృంద వద్దకు జలంధర్ రూపంలో వస్తాడు. వృంద అతన్ని గుర్తుపట్టలేక అతన్ని జలంధర్ అనే భావిస్తుంది. మహావిష్ణువు తాకగానే ఆమె తన భర్త కాదని గ్రహిస్తుంది. ఆమె పతివ్రత నిష్ట భగ్నం అయి, జలంధర్ బలహీనుడవుతాడు. తన తప్పు తెలుసుకుని, వృంద మహావిష్ణువు నిజరూపాన్ని కోరుతుంది. ఆమె తను పూజించిన దేవుడే తనని మాయ చేసాడని తెలిసి బాధపడుతుంది.

వృంద శాపం

వృంద శాపం

మహావిష్ణువు మారురూపం తెలుసుకుని, తన పవిత్రతపై జరిగిన మోసానికి వృంద మహావిష్ణువుని శపిస్తుంది. అతన్ని రాయికమ్మని శపిస్తుంది. విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండక నది వద్ద సాలిగ్రామ శిలగా మారతాడు. దీని తర్వాత, జలంధర్ పరమశివుని చేతిలో హతుడవుతాడు. వృంద కృంగిపోయి, తన జీవితాన్ని కూడా ముగించాలనుకుంటుంది.

విష్ణుమూర్తి వరం

విష్ణుమూర్తి వరం

వృంద చనిపోయే ముందు, విష్ణుమూర్తి ఆమె తులసిగా పిలవబడి, తనతో పాటు పూజించబడుతుందని వరం ఇస్తాడు. ఆయనను తులసి ఆకు లేకుండా చేసే పూజ ఎప్పటికీ పూర్తవ్వదు. అందుకే హిందూ ఆచారాలలో తులసి విడదీయలేని భాగం అయిపోయింది. ఈ దురదృష్ట దేవత ఆఖరికి వరంగా మారి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ అందరినీ మంచి ఆరోగ్యం ఇచ్చి దీవెనలందిస్తుంది.

English summary

Story Of Tulsi: The Unfortunate Goddess

Would you like to know about the story of the wonder plant, Tulsi? Then, read on.
Story first published: Saturday, July 8, 2017, 18:00 [IST]
Subscribe Newsletter