For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏలినాటి శని ప్రభావాలతో సతమతమవుతూ ఉన్నారా? అయితే శ్రావణ శనివారాలలో అచరించవలసిన విషయాలను తెలుసుకోండి.

|

జీవితంలో బాల్య, కౌమార, యవ్వన లేదా వృద్దాప్య దశలలో జన్మకుండలి ఆధారితంగా పలుమార్లు వచ్చే ఏలినాటి శని, కొన్ని ఇతర కారణాల వలన కొందరికి పెద్దగా సమస్యలు కలిగించకపోయినా, కొందరి జీవితాల్లో మాత్రం ఒక్కోసారి తీవ్రమైన ప్రభావాలనే చూపించవచ్చు. చరిత్ర ప్రకారం ఈ ప్రభావంతో రాజ్యాలు, ప్రాణాలు సైతం పోగొట్టుకున్నవారు కోకొల్లలుగా ఉన్నారు.

శ్రావణ మాసం ప్రధానంగా శివునికి నిర్దేశించబడింది. మరియు శ్రావణమాసంలో ప్రధాన దేవునిగా శివుడు కొలువుదీరి ఉంటాడు. ఈ మాసంలో స్త్రీలు సౌభాగ్యంకోసం శివుని ఆరాధిస్తుంటారు., అవివాహిత మహిళలకు మంచి భర్త కొరకు మరియు వివాహితులకు సంతోషం మరియు ఆరోగ్యకరమైన కుటుంబజీవనం కొరకు పూజలను సంకల్పిస్తుంటారు. శివుడు తన భక్తులను వృత్తిపరమైన విజయంతో ఆశీర్వదిస్తాడని నమ్మకం. పురుషులు కన్వర్ యాత్ర అని పిలిచే తీర్థయాత్రకు సంకల్పిస్తుండగా, మహిళలు శ్రావణసోమవార వ్రతం అని ఉపవాసం పాటిస్తుంటారు. కానీ శనిదేవుడు కూడా శివుని పూజించాడని మీకు తెలుసా?

ఏలినాటి శని ప్రభావాలతో సతమతమవుతూ ఉన్నారా? అయితే శ్రావణ శనివారాలలో అచరించవలసిన విషయాలను తెలుసుకోండి.

Suffering From Saade Sati? Do These Things On Shravana Saturdays

ఈసారి శ్రావణ మాసం జూలై 28న శనివారం నుండి ప్రారంభమవుతుంది మరియు ఇలా శనివారం ప్రారంభమవడం అరుదైన సంఘటనగా చెప్పబడినది. ప్రతి శనివారం శని దేవునికి ప్రార్ధనలు జరుపుకోవడానికి పవిత్రంగా ఉంటుంది. శని దేవుడు, వారుచేసే తప్పులకు ప్రజలను క్షమించడని చెప్పబడింది. కానీ శివుని యొక్క ఇష్టమైన నెల శ్రావణమాసంలో చేసే పవిత్రమైన పూజల ద్వారా, శివుని అనుగ్రహం ఆ సంవత్సరమంతా తోడుగా ఉండి, అనేక ప్రతికూల ప్రభావిత పరిస్థితుల నుండి బయటపడవేయగలదని పండితులు సూచిస్తుంటారు.

ఏలినాటి శని ప్రభావం ఉన్నవారు?

ఏలినాటి శని ప్రభావం ఉన్నవారు?

శనిగ్రహం ప్రతి రాశిచక్రంలో, జన్మకుండలిని ప్రకారం ఒక విడతకు కనీసం ఏడు సంవత్సరాల ఏలినాటి శని ప్రభావం చూపుతుందని చెప్పబడింది. ఈకాలంలో, వ్యక్తి జీవితంలో అనేక ప్రతికూల ప్రభావాలను సృష్టించే అవకాశాలు ఉండగా, కొంతమంది మాత్రమే పెద్ద ప్రభావాలు లేకుండా బయటపడే అవకాశాలు ఉంటాయి. వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలు మరియు ఆర్ధిక సమస్యలు ఏలినాటిశని కాలంలో ముఖ్యంగా ప్రభావితం చూపిస్తాయి. అనేక సందర్భాలలో ఇవి ఆర్ధిక సంబంధిత అంశాలతో ముడిపడి, జీవితం అస్తవ్యస్తంగా గోచరిస్తుంటుంది.

రుద్రాభిషేకం చేయడం మంచిది:

రుద్రాభిషేకం చేయడం మంచిది:

శివుడిని ఆరాధిస్తూ, రుద్రాభిషేకం(ఒక పురాతన పూజావిధానం) చేయడం ద్వారా ఏలినాటి శని ప్రభావాలకు గురైన భక్తులు కొంతమేర ప్రభావాల నుండి బయటపడగలరని చెప్పబడింది. జ్యోతిష్కులు శని దేవుని న్యాయ దేవతగా మరియు శివుని భోళాశంకరునిగా(కోరిన కోర్కెలను కాదనలేని సున్నిత స్వభావం కలిగిన) పేర్కొంటారు. కావున శని దేవునితో పాటుగా, శివుని పూజించడం ద్వారా కూడా కొన్ని ప్రతికూల సమస్యల నుండి బయటపడవచ్చునన్న అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు పండితులు.

రుద్రాభిషేకంతో పాటు, భక్తులు మహమృత్యుంజయ మంత్రాన్ని పఠిoచడం మంచిదిగా సూచిస్తుంటారు.

సాంకేతిక రంగాలలో పనిచేసేవారికి ముఖ్యమైన సమయం:

సాంకేతిక రంగాలలో పనిచేసేవారికి ముఖ్యమైన సమయం:

సాంకేతిక రంగాలలో పని చేసేవారు సమస్యలను తొలగించుకోవడం మరియు వృత్తిపరమైన విజయం కోసం ఖచ్చితంగా మహమృత్యుంజయ మంత్రాన్ని పఠిoచడం మంచిదిగా సూచించడమైనది. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో బీజ మంత్రాన్ని పఠించడం ద్వారా కూడా శనిదేవుని ప్రతికూల ప్రభావాల నుండి విముక్తిని ప్రసాదించగలదని చెప్పబడింది. శ్రావణ శనివారాలలో శని శాంతి పూజలు నిర్వహించడం కూడా పరిపాటిగా వస్తుంది. మహారాష్ట్రలోని శనిశింగ్నాపూర్ ఆలయంలో కూడా ఈ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

మహారాష్ట్రలో, అశ్వతా(చెట్టు) పూజ కూడా జరుగుతుంది మరియు శ్రావణ శనివారం నాడు హనుమంతుని కూడా పూజిస్తారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, వెంకటేశ్వర స్వామి వ్రతం కూడా ప్రధానంగా జరుపబడుతుంది.

అమావస్యంత్ పంచాంగం ప్రకారం, శ్రావణ మాస శనివారాలు ఆగష్టు 18, ఆగష్టు 25, సెప్టెంబరు 1 మరియు సెప్టెంబరు 8 తేదీలలో వస్తాయి. పూర్ణిమంత్ క్యాలెండర్ ప్రకారం, జూలై 28, ఆగష్టు 4, ఆగస్టు 11, ఆగస్ట్ 18 మరియు ఆగస్ట్ 25 తేదీలలో వస్తాయని చెప్పబడింది.

మహా మృత్యుంజయ మంత్రం మరియు బీజ మంత్రం :

మహా మృత్యుంజయ మంత్రం మరియు బీజ మంత్రం :

మహా మృత్యుంజయ మంత్రం:

ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్ఠి వర్ధనం!

ఉర్వారుకమివ భంధనాన్, మృత్యోర్మోక్షీయ మామృతాత్!!

శని బీజ మంత్రం:

శని బీజ మంత్రం:

ఓం ప్రాం ప్రీం ప్రౌం షాః!

శనీస్చరాయే నమః !!

ఈ మంత్రాన్ని 1, 3, 9, 27 లేదా 108 సార్లు పఠిoచవలసి ఉంటుంది.

ఈ మంత్రాన్ని 1, 3, 9, 27 లేదా 108 సార్లు పఠిoచవలసి ఉంటుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Suffering From Saade Sati? Do These Things On Shravana Saturdays

Shravana month is dedicated to Lord Shiva. But did you know that Shiva is worshipped by Shani Dev as well? That is why Shravana is considered to be an auspicious time to worship Shani Dev. Rudrabishekam should be performed if one is suffering from Saade Sati. Shravana Saturdays are important for the people working in technical fields as well.
Story first published: Friday, August 3, 2018, 15:45 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more