For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వామి రామకృష్ణ పరమహంస, ఆధ్యాత్మికంగా ప్రేరణ కలిగించే స్టోరీ

|

6 ఏళ్ల వయసున్న పిల్లవాడు, వరి పొలాల వెంట నడుస్తూ, చీకటి మేఘాల గుండా ఎగురుతున్న కొంగల మందను చూస్తూ బాహ్య ప్రపంచాన్ని పక్కనపెట్టి గంటల తరబడి సమయాన్ని వెచ్చించేవాడు. కానీ, ఈ పిల్లవాడు, భారతదేశం ఎప్పటికీ గుర్తుపెట్టుకోగలిగే ఒక గొప్ప ఆధ్యాత్మిక వేత్తగా మారగలడని ఎవరికి మాత్రం తెలుసు. ఆయన మరెవరో కాదు, స్వామి వివేకానంద గురువు గారైన స్వామి రామకృష్ణ పరమహంస,.

ఖుదిరామ్ ఛటోపాధ్యాయ మరియు చంద్రమణీ దేవిలకు జన్మించిన స్వామి రామకృష్ణ పరమహంస అసలు పేరు గదాధర్ ఛటోపాధ్యాయ. ఇతని జన్మదిన వార్షికోత్సవాన్ని హిందూ కాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం శుక్ల పక్షము సందర్భంగా విదియ తిథి నాడు జరుపుకుంటారు (ఈ సారి 8 మార్చి 2019). గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా పుట్టిన తేదీ ఫిబ్రవరి 18, 1836.

Swami Ramakrishna

స్వామి రామకృష్ణ పరమహంస తన జీవితానికి గల పరమార్ధం గురించి తెలుసుకున్నాడు..

పైన చెప్పినట్లే, స్వామి రామకృష్ణ పరమహంస తరచుగా అటువంటి అనుభవాలను ఎదుర్కొన్నాడు, అనగా తరచుగా బయట ప్రపంచంతో సంబంధాలను పక్కనపెట్టి ప్రకృతిని ఆస్వాదిస్తూ గడిపేవాడు. రామకృష్ణ పరమ హంస తన పన్నెండు సంవత్సరాల వయసు వరకు, పాఠశాలకు వెళ్ళి 6 వ తరగతి వరకు మాత్రమే చదివాడు. ఆయన తన జీవితములో ఆహార సంపాదనకు మాత్రమే విద్య అనునది లక్ష్యము కాదని గ్రహించాడు. జ్ఞానాన్ని స౦పాది౦చడానికి, మానవ ఉనికికి స౦బ౦ధి౦చిన అంశాల గురి౦చి తెలుసుకోవాలని పరితపించాడు. క్రమంగా ఆయన తన జీవితానికి గల పరమార్ధాన్ని అర్ధం చేసుకున్నాడు. తాను ఏమి కోరుకుంటున్నాడో ఆ దిశగా అడుగులు వేసి చివరికి ఫలితం సాధించాడు.

ఆలయ బాధ్యతల స్వీకరణ :

రామకృష్ణ పరమ హంస సోదరుడు బెంగాల్లో ఒక పాఠశాలను ప్రారంభించి, అదే సమయంలో ఏకకాలంలో మహంకాళి అమ్మవారి దేవాలయంలో పూజారిగా కూడా పనిచేయడం ప్రారంభించాడు. తరువాత రామకృష్ణ పరమ హంసను కూడా అతనికి సహాయంగా పిలిచాడు. సోదరుడు పరమపదించిన తర్వాత, రామకృష్ణ ఆ ఆలయ భాద్యతను తీసుకున్నాడు. క్రమంగా ఆలయ దేవత అయిన మహాకాళీని విశ్వమాతగా పరిగణించాడు.

Swami Ramakrishna

స్వామి రామకృష్ణ పరమ హంస భార్య కూడా ఆయన శిష్యురాలిగా మారింది :

కొంతకాలం తర్వాత శారదామణి ముఖోపాధ్యాయతో వివాహం జరిగింది. తర్వాతి కాలంలో, ఆమే తన శిష్యురాలిగా మారింది. అ౦తేకాకుండా, వివాహ౦ చేసుకున్న సమయంలో ఆమె వయసు కేవలం ఐదు స౦వత్సరాలుగా ఉన్న కారణాన, ఆమె మొదట్లో తల్లిద౦డ్రుల ఇ౦ట్లోనే ఉండవలసి వచ్చింది. కానీ తర్వాతి కాలంలో, రామకృష్ణతో కలిసి జీవించడానికి వచ్చిన తర్వాత తన గృహస్థ జీవితాన్ని వదులుకుని సన్యాసం తీసుకుని, రామకృష్ణ పరమ హంసకు శిష్యురాలిగా మారిపోయింది.

స్వామి రామకృష్ణ ఎదుర్కొన్న ఇతర ఆధ్యాత్మిక సంప్రదాయాల అనుభవాలు ...

స్వామి రామకృష్ణ పరమహంస తన తంత్ర సాధనలో భాగంగా వివిధ గురువుల మార్గదర్శకత్వం క్రింద వాత్సల్య భావ్ (వైష్ణవ భక్తి) గురించి, అద్వైత వేదాంతం గురించి తెలుసుకున్నారు. అంతేకాకుండా, మూడు నాలుగు రోజుల లెక్కన కొన్ని ఇతర మతాలను కూడా ఆచరించాడు. ఈ సమయంలో మతం యొక్క ప్రధాన దైవత్వాన్ని తన దేహంతో విలీనం చేయడాన్ని చూశాడు. క్రమంగా, అన్ని మతాల బోధనలను ప్రేమించాడు.

స్వామి రామకృష్ణ పరమ హంస ఆధ్యాత్మిక సూత్రాలు :

"దేవుడిని తల్లిగా ఆరాధించవలెను ", "సర్వ మత సమానత్వం" , " ప్రతి జీవిలోనూ దైవత్వం" , "అన్ని మతాల సారాంశం ఒక్కటే", "మానవసేవే మాధవ సేవ", "భగవంతుడు ఒక్కడే", "ఐహిక విషయాల నుండి బయటపడిన వాడు దైవత్వాన్ని చూడగలడు", " గమ్యానికి అనేక మార్గాలు ఉన్నట్లే, భగవంతుని చేరేందుకు మతాలు మార్గాలు" వంటి అనేక సూత్రాలు రామ కృష్ణ పరమ హంస చెప్పిన వాటిలో ఉన్నాయి. అనేకమంది యూరోపియన్లు ఆధ్యాత్మికతకు ప్రభావితమై, రామకృష్ణుని అనుసరించారు కూడా. ఒక భారతీయ విద్యార్ధి అయిన నరేంద్రనాధ్ దత్త ఆయనను సందర్శించి, కాలక్రమేణా స్వామి వివేకానందగా ప్రజాదరణ పొందారు.

Swami Ramakrishna

స్వామి రామకృష్ణుని విజ్ఞానం బదిలీ..

తన చివరి రోజుల్లో గొంతు క్యాన్సర్తో బాధపడుతున్న కారణంగా, మౌనంగా ఉండాలని వైద్యులు సూచించారు. అయితే, వైద్యులు చెప్పిన సూచనలను ఖాతరు చేసి, ఎల్లప్పుడూ సందర్శకులతో మౌఖిక చర్చలు చేసేవాడు. శారదా దేవి, అతని శిష్యులు ఆ సమయంలో అతనికి ఎంతో సహాయాన్ని అందించేవారు. తన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తన శిష్యుడైన వివేకానందకు బదిలీ చేశాడని చెప్పారు. అంతేకాకుండా తన ఇతర శిష్యులను తమ నాయకుడిగా, ఉపాధ్యాయునిగా వివేకానందను చూడమని కోరాడు. క్రమంగా, స్వామి వివేకానంద భారతదేశంలోని యువతలో గొప్ప ప్రభావవంతునిగా ఆవిర్భవించారు. ఇప్పటికీ వివేకానంద అనగానే షికాగో ఉపన్యాసం గురించి స్పురిస్తుంది అంటే, అతని వాగ్ధాటి, విజ్ఞానం ఎంత గొప్పదో, అందుకు రామకృష్ణ పరమ హంస ఇచ్చిన ప్రేరణ ఎలాంటిదో తెలుస్తుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, సౌందర్య, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, మాతృత్వ, శిశు సంబంధ, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

Read more about: festivals పండగలు
English summary

Swami Ramakrishna The Spiritual Inspirer

Swami Ramakrishna Paramahamsa was a Hindu mystic and saint. He was the Guru of Swami Vivekananda. His birth anniversary will be observed on 8th March 2019. Read out the motivational story.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more