For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్నేహానికి ప్రాణమివ్వడం అంటే ఇదే, కర్ణుడిలో ఉన్నఈ గుణాలు నీలో ఉంటే నీకు మించిన స్నేహితుడే లేడు

కర్ణుడు స్నేహానికి మారు పేరు. స్నేహం కోసం ప్రాణాలిచ్చాడు. తన స్నేహితుడు ధర్మం వైపు ఉన్నాడా? అధర్మం వైపు ఉన్నాడా అని కాదు అన్ని వేళలా తన హితుని క్షేమం మాత్రమే కోరిన వాడు కర్ణుడు.

|

కర్ణుడు స్నేహానికి మారు పేరు. స్నేహం కోసం ప్రాణాలిచ్చాడు. తన స్నేహితుడు ధర్మం వైపు ఉన్నాడా? అధర్మం వైపు ఉన్నాడా అని కాదు అన్ని వేళలా తన హితుని క్షేమం మాత్రమే కోరిన వాడు కర్ణుడు. తనను నమ్మని తనకు ఆశ్రయం ఇచ్చిన దుర్యోధనుడి కోసం ప్రాణాలు సైతం ఇచ్చిన మహానుభావుడు కర్ణుడు. స్నేహితుడి కోసం ఎందాకైనా వెళ్లడానికి సిద్ధమైన వీరుడు కర్ణుడు. ఈ కాలంలో కర్ణలాంటి స్నేహితుడు ఒక్కడున్నా చాలు.

మనకోసం ఏదైనా చేసే వాడే ఫ్రెండ్

మనకోసం ఏదైనా చేసే వాడే ఫ్రెండ్

ఈ ప్రపంచంలో ఏ బంధం లేకుండా మనకోసం ఏదైనా చేసే వాడే ఫ్రెండ్. అలాంటి ఫ్రెండ్ షిప్ ఇప్పుడే కాదు పురాతన కాలం నుంచి ఉంది. దేవుళ్లలోనూ కొందరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక కర్ణుడు, దుర్యోధనుడి ఫ్రెండ్ షిప్ చరిత్రలో ఎప్పిటకీ నిలిచిపోతుంది. పాండువుల దాడికి ఎదురోడి నిలిచే ధైర్యం లేక కష్టాలతో కలత చెందిన సమయంలో కర్ణుడు నేనున్నానంటూ దుర్యోధనుడికి అండగా నిలిచాడు.

నీకోసం ఏమైనా చేస్తాను

నీకోసం ఏమైనా చేస్తాను

నువ్వు ఆజ్ఞాపిస్తే చాలు నీకోసం ఏమైనా చేస్తాను అని అన్ని వేళలా దుర్యోధనుడిలో ధైర్యం నింపాడు కర్ణుడు. తాను అధర్మం వైపు నిలుస్తున్నానని కర్ణుడికి తెలుసు. కానీ తను అవమానానికి గురైనప్పుడు దుర్యోధనుడే తనకు అండగా నిలిచాడని గుర్తించుకుని ప్రాణం పోయే వరకు దుర్యోధనుడి వెంటే ఉన్నాడు.

పాండవుల వైపు ఉండి పోరాడు

పాండవుల వైపు ఉండి పోరాడు

దుర్యోధనుడిని నమ్మితే తనకు మరణం తప్పదని తెలిసినా స్నేహాన్ని మాత్రం వదల్లేదు కర్ణుడు. మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక రోజు రాత్రి శ్రీకృష్ణుడు కర్ణుడి శిబిరానికి వెళ్తాడు. కర్ణుడికి అతని పుట్టు పూర్వోత్తాలను వివరిస్తాడు. నువ్వు పాండవులకి అన్నవి. యుద్ధంలో పాండవుల వైపు ఉండి పోరాడు అని కోరుతాడు కృష్ణుడు.

కష్ట సమయంలో నా స్నేహితుడిని వదిలేస్తానని ఎలా అనుకున్నావు

కష్ట సమయంలో నా స్నేహితుడిని వదిలేస్తానని ఎలా అనుకున్నావు

హ్హ..హ్హ..హా అంటూ కర్ణుడు నవ్వి.. "నా పుట్టుక గురించి తెలుసు. నేను పడ్డ అవమానాలు తెలుసు. ఈ యుద్ధంలో పాండువులే విజయం సాధిస్తారనీ నాకు తెలుసు. నాకు మరణం తప్పదని తెలుసు. పాండవులు ధర్మాత్ములు. అయినా కష్ట సమయంలో నా స్నేహితుడిని వదిలేసి ఎలా వస్తావని నువ్వు అనుకున్నావు" అని అంటాడు.

ప్రాణాలైనా విడుస్తానుగానీ

ప్రాణాలైనా విడుస్తానుగానీ

"దుర్యోధనుడికి ఈ ప్రపంచంలో ఎవ్వరిపైనా నమ్మకం లేదు. నన్ను మాత్రమే నమ్ముతాడు. నేను ఉన్నాననే బలంతోనే తాను రణరంగంలోకి దిగాడు. ఇప్పుడు నేను పాండవులు వైపు వెళితే నా ప్రాణ మిత్రుడికి ద్రోహం చేసినట్లే. నా స్నేహితుడి కోసం ప్రాణాలైనా విడుస్తానుగానీ అతనికి ద్రోహం మాత్రం చెయ్యను." అని కర్ణుడు శ్రీకృష్ణుడితో అంటాడు.

ఇద్దరూ చదరంగం ఆడుతూ కూర్చొన్నారు

ఇద్దరూ చదరంగం ఆడుతూ కూర్చొన్నారు

ఇక దుర్యోధ‌నుడికి కూడా కర్ణుడు అంటే అపారమైన నమ్మకం. దుర్యోధనుడి భార్య భానుమ‌తితో కూడా కర్ణుడు బాగా కలిసి మెలిసి ఉండేవాడు. ఒక రోజు క‌ర్ణుడు, భానుమ‌తి ఇద్దరూ చదరంగం ఆడుతూ కూర్చొన్నారు. అయితే ఆ ఆటలో కర్ణుడు విజయం సాధించే దశకు చేరుకుంటాడు. భానుమతి ఇక నీకు ఓటమి తప్పదు అంటాడు కర్ణుడు.

ఆమె చెయ్యి పట్టుకుని లాగుతాడు

ఆమె చెయ్యి పట్టుకుని లాగుతాడు

భానుమతి కర్ణుడిపై గెలిచేందుకు ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో దుర్యోధనుడు వస్తాడు. అతన్ని చూసి భానుమతి లేచి వెళ్తుంటుంది. అయితే కర్ణుడు దుర్యోధనుడి రాకను గమనించక ఆమె ఓడిపోతుంది కాబట్టే పారిపోతుందనుకుని ఆమె చెయ్యి పట్టుకుని లాగుతాడు. దీంతో ఆమె నడుముకు ఉన్న ముత్యాల వడ్డానానికి కర్ణుడి చెయ్యి తగిలి ఆ ముత్యాలన్నీ కిందపడతాయి.

ముత్యాలను ఏరడం మొదలుపెడతాడు

ముత్యాలను ఏరడం మొదలుపెడతాడు

ఇదంతా దుర్యోధనుడు గమనిస్తాడు. తర్వాత కర్ణుడు దుర్యోధనుడు వచ్చినందుకే భానుమతి లేచి వెళ్తుందని తెలుసుకుంటాడు. వారిద్దరూ దుర్యోధనుడి వైపు ఆందోళనగా చూస్తారు. తర్వాత దుర్యోధనుడు కింద పడిన ముత్యాలను ఏరడం మొదలుపెడతాడు.

అంత నమ్మకం కర్ణుడంటే

అంత నమ్మకం కర్ణుడంటే

ఏంటీ మీరిద్దరూ నన్ను చూస్తూనే ఉంటారా ముత్యాలు ఏరరా అని హాస్యం చేస్తాడు. అంత నమ్మకం కర్ణుడంటే దుర్యోధనుడికి. కర్ణుడు ఎప్పుడూ తనకు మోసం చెయ్యడు అది ఏ విషయంలోనైనా అని నమ్మిన వాడే దుర్యోధనుడు. అందుకే కర్ణ, దుర్యోధనుల స్నేహం ఈ జగత్తు ఉన్నంత కాలం చిరస్థాయిగా ఉంటుంది.

Imagecredit

English summary

The Greatest friendship in Mahabharata Karna friendship with duryodhana

The Greatest friendship in Mahabharata Karna friendship with duryodhana
Story first published:Saturday, August 4, 2018, 12:46 [IST]
Desktop Bottom Promotion