For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కలియుగం ; శ్రీ కృష్ణుడి మాటల్లో

కలియుగం ; శ్రీ కృష్ణుడి మాటల్లో

|

హిందూ మత నమ్మకం ఇప్పటి మనుషులు అంధకారంలో ఉన్నారని. ఈ సమయాన్ని కలియుగమని అంటారు. కలియుగంలో ప్రపంచం మొత్తం పాపం, అవినీతి, కష్టాలు, దుర్మార్గాలతో నిండి వుంటుంది.

హనుమంతుడు ఒకసారి మూడవ పాండవుడైన భీముడికి వివిధ యుగాల గురించి వివరించాడు. అన్ని యుగాల కన్నా సత్యయుగం లేదా కృతయుగం అందమైన సమయం అని చెప్పాడు. అక్కడ మతం ఉండదు, ప్రతి ఒక్కరూ రుషులే.

వారు ఎంత పవిత్రులంటే మోక్షం కోసం మతాచారాలు కూడా పాటించాల్సిన అవసరం వచ్చేదికాదు. ఎవరూ ధనవంతులూ కాదు, పేదవారూ కాదు. ఎవరూ బాధపడేవారు కాదు ఎందుకంటే తమ మనోబలంతో అన్నిటినీ పొందేవారు. దుర్మార్గం, ద్వేషం, దుఃఖం లేదా భయం ఏవీ ఉండేవి కాదు.

కృష్ణుడు వివరించిన కలియుగం

కృష్ణుడు వివరించిన కలియుగం

త్రేతాయుగంలో పవిత్రత, ధర్మం తగ్గాయి .ప్రజలు మత ఉత్సవాలు,పండగలు జరుపుకుని, చేయటం, ఇవ్వటం ద్వారా తమకి కావాల్సినవి పొందేవారు. ద్వాపరయుగంలో ధర్మం మరింత తగ్గింది. వేదాలు విభజించబడ్డాయి. వేదాల గురించి తెలిసినవారు తక్కువయ్యారు. కోరిక, జబ్బులు, అల్లకల్లోలాలు మనుషులపై రాజ్యం చేయటం మొదలుపెట్టాయి.

కలియుగంలో, కృష్ణుడు చెప్పినదాని ప్రకారం, ప్రపంచంలో ధర్మం అనేది నశిస్తుంది, ప్రజలు అవినీతిపరులుగా మారిపోయి రోజువారీగా కూడా దుర్మార్గాలు, దారుణాలు చేస్తుంటారు. ప్రతి ఒక్కరినీ రోగాలు, జబ్బులు కబళిస్తాయి. ఎవరికీ వేదాలు వాటి అసలు అర్థం, భావం తెలియవు. ప్రజలు చిన్న,పిచ్చి విషయాలైన మతం, భూమి వంటి వాటికోసం తగవులాడుకుంటారు. కష్టపడి పనిచేసినా ఫలితాలు దక్కవు, కానీ తప్పులు చేసినవారు మాత్రం సమాజంలో అందలం ఎక్కుతారు.

ఉద్ధవగీతలో, శ్రీకృష్ణుడు చిన్నప్పటి పాండవులకి కలియుగం ఎలా ఉంటుందో చెప్పే కథ ఉంది. ఆ కథ ఏంటో తెలుసుకోటానికి కింద చదవండి.

-పాండవుల ప్రశ్న

-పాండవుల ప్రశ్న

ఒకసారి, నలుగురు పాండవులైన –అర్జునుడు, భీముడు, సహదేవుడు ఇంకా నకులుడు శ్రీకృష్ణుడి దగ్గరకి వెళ్ళారు (మహారాజు యుధిష్టిరుడు ఆ సమయంలో లేడు. వారు ఇలా అడిగారు, “ఓ శ్రీకృష్ణా! కలియుగం త్వరలో వస్తోంది కాబట్టి దాని గురించి మాకు కొంచెం చెప్పు.” శ్రీకృష్ణుడు ఇలా జవాబిచ్చాడు ,” నేను మీకు రాబోయే యుగం కలియుగం గురించి చెప్తాను,కానీ మీరు దానికన్నా ముందు ఒకటి చేయాలి. నేను నాలుగు బాణాలను నాలుగు దిక్కుల్లో సంధిస్తాను. మీరు ఒక్కొక్కరూ ఆ దిశలో వెళ్ళి బాణాన్ని నాకోసం వెతికి తేవాలి. ఆ బాణం దొరికిన చోటులో మీరేం చూసారో చెప్పాలి.” ఇలా అన్నాక శ్రీకృష్ణుడు లేచి వేగంగా నాలుగు వైపులా నాలుగు బాణాలు వేసాడు. నలుగురు పాండవులు తమ బాణాలు వెతకడం కోసం బయల్దేరారు.

-మొదటి బాణం

-మొదటి బాణం

అర్జునుడు మొదటి బాణం వెనుక వేగంగా పరిగెత్తాడు. తొందరగానే అతనికి బాణం దొరికింది. అది తీసుకోగానే అతనికి ఒక తియ్యని పాట వినిపించింది. అదెక్కడనుండి వస్తోందా అని వెతికితే పవిత్రంగా భావించే ఒక కోయిల పాడుతోంది. కోయిల గొంతు మధురంగానే ఉంది కానీ దాని కాళ్ళ కింద బ్రతికున్న కుందేలు నలిగిపోతోంది. పాట మధ్యలో కోయిల కుందేలును గుచ్చి దాని మాంసాన్ని తింటోంది. కుందేలు బ్రతికేవుంది కానీ తీవ్రమైన బాధలో ఉంది. అర్జునుడు ఈ దృశ్యం చూసి బాధపడి, శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళాడు.

-రెండవ బాణం

-రెండవ బాణం

భీముడు రెండవ బాణం వెతకడానికి వెళ్ళాడు. అతను బాణం ఐదు బావులున్న చోట పడిందని చూసాడు. ఒక బావి మధ్యలో ఉంటే మిగతా నాలుగు చుట్టూతా ఉన్నాయి. బయటకి వున్న నాలుగు బావుల్లో తియ్యటి నీరు పొంగి ప్రవహిస్తోంది కానీ మధ్యలో బావి ఖాళీగా ఉంది. భీముడు ఆశ్చర్యపోయి బాణంతో కృష్ణుడి దగ్గరకి వెళ్ళాడు.

-మూడవ బాణం

-మూడవ బాణం

నకులుడు మూడవబాణం వెతకడానికి వెళ్ళాడు. బాణం తీసుకొంటుండగా, అక్కడ ఎవరో గుంపుగా ఉండటం కన్పించింది. ఏంటా ఆ హడావిడి అని చూడటానికి వెళ్తే అతను అక్కడ ఒక ఆవు తనకి అప్పుడే పుట్టిన దూడను నాకుతూ కన్పించింది. దూడ పూర్తిగా శుభ్రంగానే ఉన్నా ఆవు నాకటం ఆపలేదు

-నాలుగవ బాణం

-నాలుగవ బాణం

సహదేవుడు ఆఖరి బాణం వెతకడానికి వెళ్ళాడు. బాణం ఒక పర్వతం దగ్గర పడింది. అతను చూస్తుండగా కొండ మీద పెద్ద రాయి దొర్లుకుంటూ రాసాగింది. వస్తూ వస్తూ పెద్ద చెట్లను కూడా కూలగొట్టింది కానీ ఒక చిన్న,బలహీనమైన మొక్కకి తగిలి ఆగిపోయింది. సహదేవుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే కృష్ణుడ్ని అడుగుదామని వెనక్కి వెళ్ళాడు.

-మళ్ళీ శ్రీకృష్ణుడి దగ్గరకి

-మళ్ళీ శ్రీకృష్ణుడి దగ్గరకి

-నలుగురు పాండవులు కృష్ణుడి దగ్గరకి బాణాలతో తిరిగివచ్చారు. ఆ బాణాలను కృష్ణుడి పాదాల దగ్గర పెట్టి ఆయన్ని తాము చూసినవాటికి అర్థాలు చెప్పమన్నారు. కృష్ణుడు నవ్వి వివరించటం మొదలుపెట్టాడు.

-మొదటి దృశ్యం అర్థం

-మొదటి దృశ్యం అర్థం

కృష్ణుడిలా చెప్పాడు, “కలియుగంలో పవిత్రులైన వ్యక్తులు, రుషులు కోయిలలాగా ఉంటారు.వారి దగ్గర అన్ని తియ్యని మాటలు ఉంటాయి కానీ, వారు వాటిని వాడుకుంటూ తమని అనుసరించేవారికి కోయిల పాపం ఆ కుందేలుకి చేసినట్లుగా బాధను కలిగిస్తారు.”

-రెండవ దృశ్యానికి అర్థం

-రెండవ దృశ్యానికి అర్థం

కృష్ణుడు కొనసాగిస్తూ, “కలియుగంలో పేదవారు, ధనికులు ఒకే ప్రాంతంలో నివసిస్తారు. ధనికులు తమ అదృష్టం పొంగిపొర్లటం చూస్తుంటారు, కానీ ఒక్క నాణెం కూడా పేదవారికి ఇవ్వరు, ఎలా అయితే ఎండిపోయిన బావి ఒక్క చుక్క నీటిని పక్కన పొంగిపొర్లుతున్న బావుల నుంచి పొందలేకపోయిందో అలాగ.” అన్నాడు.

-మూడవ దృశ్యం అర్థం

-మూడవ దృశ్యం అర్థం

శ్రీకృష్ణుడు నకులుడి వైపు చూస్తూ చెప్పాడు ,”కలియుగంలో తల్లిదండ్రులు పిల్లలని ఎక్కువగా ప్రేమించి వారిని గారాబంతో పాడుచేస్తారు. ఆవు ఎలా అయితే దూడను నాకుతూ పోయిందో తల్లిదండ్రులు తమ పిల్లల జీవితాలను ఎక్కువ ప్రేమతో పాడుచేస్తారు.”

-నాలుగవ దృశ్యం అర్థం

-నాలుగవ దృశ్యం అర్థం

సహదేవుడితో కృష్ణుడు ఇలా చెప్పాడు, “కలియుగంలో ప్రజలు తమ నాశనానికి నువ్వు చూసిన రాయిలాగా దొర్లుకుంటూ వేగంగా వెళ్తారు. పెద్ద చెట్లు జీవితంలో మంచికి గుర్తు అయిన బంధువులు, కుటుంబం,స్నేహితులు, సంపద వంటివి. ఇవేవీ నాశనం సమయంలో సాయం చేయలేవు. చిన్న మొక్క దేవుడికి ప్రతిరూపం. బలహీనపడినా, నమ్మకంతో దేవున్ని స్మరిస్తే ఈ నాశనం నుంచి తప్పించుకోవచ్చు.”

English summary

The Kaliyuga- as explained by Lord Krishna

Krishna has explained that the best of the era was the Satyayuga. In Kaliyug, the world will lose all its righteousness; people will be corrupt and perform evil on a daily basis. Krishna also explains that no one will know the vedas in its entirety and in its true essence. People will fight over petty things like religion and land.
Story first published:Wednesday, May 23, 2018, 17:57 [IST]
Desktop Bottom Promotion