వరలక్ష్మీ వ్రతానికి సంబంధించిన పురాణకథ

Posted By: Deepti
Subscribe to Boldsky

తొలకరి రుతుపవనాలు కేవలం వేసవి దాహాన్ని తీర్చే ఆనందమే కాదు. రుతుపవనాల రాకతో ప్రకృతి అంతా కొత్త రంగులు, ఆశలతో మన చుట్టూ కళకళలాడుతుంది. దీనికి చెందిన ఆషాడమాసం ముఖ్యంగా వరలక్ష్మీవ్రత పండగ కారణంతో ప్రసిద్ధి చెందింది- ఎందుకంటే సంవత్సరం చివరివరకూ సుఖ సంతోషాలను నిలిపే పండగ ఇది.

ఈ పండగను వేసవి తర్వాతనే వచ్చే నెలలు- జూలై ఆగస్టు ప్రాంతంలో, హిందువుల ఆషాఢమాసంలోని ఆఖరి శుక్రవారం నాడు జరుపుకుంటారు.

ఈ పండగ మొదలవుతూనే ఆకర్షించే రంగుల్లో అన్నిచోట్లా పువ్వులు, ముగ్గులతో కొత్త శోభ కన్పిస్తుంది. తోరణాలతో పాటు, శ్రీ మహాలక్ష్మిని బంగారు నగలతో అలంకరించటం వరకూ అంతా మెరిసిపోతుంది.

Varamahalakshmi

వరలక్ష్మీ వ్రతం గురించి శివుడు స్వయంగా పార్వతిదేవికి చెప్పిన కథ ఏంటి..?

వ్యాపారాలు జోరందుకుంటాయి. ప్రతి ఇంట్లో, వ్యాపారాల్లో అందరూ ఆనందంగా ఈ సంపదలిచ్చే అమ్మవారు- శ్రీ మహాలక్ష్మిని ఆహ్వానించటానికి తయారవుతారు.

చిన్నాపెద్దా తేడాలేకుండా అందరూ ఉత్సాహంగా ఈ పండగలో పాల్గొంటారు. ముఖ్యంగా స్త్రీలు పవిత్రంగా పూజ చేయటానికి, తమ భర్త,బిడ్డల ఆరోగ్యం, ఇంటి సంపదలకోసం ప్రార్థించటానికి ఈ ముఖ్యమైన రోజు కోసం ఎదురుచూస్తారు.

భారతదేశంలో, దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మరియు ఆంధ్రప్రదేశ్ లలోని ప్రజలు ఈ పండగ జరుపుకుని అమ్మవారి అనుగ్రహం కోసం వ్రతం చేస్తారు.

మహావిష్ణువు ప్రియభార్యలు శ్రీ మహాలక్ష్మి మరియు భూదేవిలు. మహాలక్ష్మి కమలంలో ఆసీనురాలై ఉంటారు. ఆమె పద్మంలో కూర్చున్నతీరే పద్మాసనంగా ప్రసిద్ధి చెందింది.

Varamahalakshmi

అమ్మవారి జననం కథ పద్మపురాణంలో ఉన్నది.రాక్షసుల చేతిలో ఓడిపోయి, దేవతలు నారాయణుడి దగ్గరకు వెళ్ళి రాక్షసులు పెట్టిన కష్టాలకు ఉపశమనం కల్పించమని కోరతారు. అప్పుడు భగవాన్ నారాయణుడు దేవతలకు మంథర పర్వతాన్ని క్షీరసాగరంలో చిలకమని చెప్తాడు.

క్షీరసాగరం రాక్షసులతో పాటు చిలకాలని, మందర పర్వతాన్ని, తను పడుకునే శేషనాగు సాయంతో తాడులాగా చుట్టి చిలకమని సలహా ఇస్తారు. మందర పర్వతాన్ని కూర్మ అనే తాబేలు వీపుపై ఆధారంగా పెడతారు.

అష్టలక్ష్ముల్లో వరమహాలక్ష్మీనే ఎందుకు పూజించాలి..?

దేవతలు తోకవైపు పట్టుకుంటే, రాక్షసులు సర్పం తలను పట్టుకుని చిలకసాగారు. ఆ తాబేలు ఎవరో కాదు- మహావిష్ణువే. చిలకటం ప్రారంభమయ్యాక క్షీరసాగరం నుండి కామధేనువు, వారుణి ( అమృతం), ఐరావతం, పారిజాతం, చంద్రుడు మరియు మహాలక్ష్మి అమ్మవారు బయటకి వచ్చారు.

అమ్మవారు తన అద్వితీయ సౌందర్యంతో ప్రకాశిస్తూ పద్మాసనంలో కమలం పువ్వుపై కూర్చుని పైకి వచ్చారు. దేవతలు శ్రీసూక్తంతో స్తుతిస్తుండగా ఆమె తన ప్రాణనాథుడైన నారాయణుడు లేదా విష్ణుమూర్తి హృదయంలోకి చేరారు. రాక్షసులు ఓడిపోయి దేవతలు కోల్పోయినదంతా తిరిగి పొందారు.

Varamahalakshmi

వరమహాలక్ష్మి – ఒక చారిత్రక సత్యం

వర అంటే “మంచి,ఉత్తమ కోరికలు” మరియు మహాలక్ష్మి, అష్టలక్ష్మి అవతారం. అందుకని వరమహాలక్ష్మి వ్రతం జరుపుకోవటం అనేది ఎనిమిది మంది లక్ష్ములను ఇంట్లోకి ఆహ్వానించి వారు అక్కడే కొలువై ఉండేట్లుగా ఉంచటాన్ని సూచిస్తుంది. సంతోషసమృద్ధులను జీవితంలో సాధించటానికి ఈ పండగను అందరూ జరుపుకుంటారు.

అష్టలక్ష్మి రూపాలు

మహాలక్ష్మి యొక్క ఎనిమిది అద్భుత రూపాలు ఏవనగా

ఆదిలక్ష్మి – ముఖ్యరూపం

ధాన్యలక్ష్మి – ధాన్యానికి దేవత

ధైర్య లక్ష్మి – ధైర్యానికి అధీన దేవత

గజలక్ష్మి – శక్తి, అధికారానికి చెందిన దేవత

సంతాన లక్ష్మి – జంటలకు సంతానాన్ని ప్రసాదించే దేవత

విజయలక్ష్మి –విజయానికి చెందిన దేవత

విద్యాలక్ష్మి – జ్ఞానానికి అధీన దేవత

ధనలక్ష్మి – సంపదలనిచ్చే దేవత

పండగ పురాణకథ

వరలక్ష్మీ పండుగ విశిష్టత మరియు వత్రం చేయు విధానం

పార్వతీపరమేశ్వరులు ఆనందంగా జూదమాడుకుంటున్న సమయంలో ఎవరు గెలిచారన్నదానిపై చిన్న గొడవ వచ్చింది. నిజాయితీపరుడైన బ్రాహ్మణుడని పేరున్న చిత్రనేమిని న్యాయం చెప్పమని కోరగా ఆయన పరమశివుడే విజేత అని తెలిపారు.

దాంతో ఆగ్రహించిన పార్వతీదేవి చిత్రనేమిని కుష్టురోగంతో బాధపడమని శపించింది. శివుడు శాపనివృత్తి కోసం ఆమెను బ్రతిమిలాడగా, అతని శాపవిమోచనం వరలక్ష్మి పూజ పర్వదినం నాడు జరుగుతుందని పార్వతి చెప్పింది.

ఆషాఢమాసంలో ఆఖరి శుక్రవారం నాడు స్త్రీలు వ్రతమాచరించి అమ్మవారిని తమ ఇళ్ళకి ఆహ్వానించగా, చిత్రనేమి శాపవిమోచనం జరిగింది. మరో కథ ప్రకారం, మరాఠా రాజ్యంలో చారుమతి అనే స్త్రీ ధర్మంగా, పవిత్రంగా జీవించేది. ఆమె తన కర్తవ్యాలు నిర్వహిస్తూ అత్తమామలను, అత్తింటివారిని శ్రద్ధ గౌరవాలతో చూసుకునేది.

భర్తాబిడ్డలను కూడా ప్రేమతో,ఆప్యాయతతో సంరక్షించేది. ఈ లౌకిక బంధాలే కాక, మహాలక్ష్మి అమ్మవారికి పరమభక్తురాలు కూడా. ఒకరాత్రి, అమ్మవారు ఆమె కలలో కన్పించి వరమహాలక్ష్మి వ్రతం చేయమని చెప్పింది. చారుమతి తన కలను భర్త, ఇంట్లో వారితో పంచుకుని, గ్రామంలోని ఇతర స్త్రీలతో కలిసి అమ్మవారి ఆశీస్సుల కోసం ఈ వ్రతం చేసుకున్నారు.

అదే కథ, చారిత్రక ఆచారాన్ని కొనసాగిస్తూ, మనం కూడా ఈ పవిత్ర దినం నాడు మహాలక్ష్మి అమ్మవారిని మన ఇళ్ళలోకి వ్రతం చేసి ఆహ్వానించి, అమ్మవారి అష్టరూపాలను మనతో అన్నివేళలా ఉంచుకుందాం.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    The Legend Associated With The Varamahalakshmi Vrata

    Take a look at the legend that is associated with the celebration of the varamahalakshmi vrata.
    Story first published: Wednesday, August 2, 2017, 18:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more