For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంటి ప్రధాన ద్వారం ఇంటి యజమాని వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేస్తుందని తెలుసా ?

|

ఒక ప్రదేశం, లేదా గృహంలో ఉండే వ్యక్తుల యొక్క ఆలోచనా విధానాలను, వ్యక్తిత్వాన్ని వాస్తు శాస్త్రం ప్రభావితం చేయగలదనే విషయం, మనం తరచుగా వింటూ ఉంటాం. చాలా వరకు ఇది నిజమని వాస్తు శాస్త్ర నిపుణులు ఘంటాపధంగా చెప్తుంటారు. అనగా ఇంటి వాస్తును అధ్యయనం చేయడం ద్వారా, అక్కడ ఉంటున్న వ్యక్తుల గురించి ఎక్కువగా అంచనా వేయవచ్చునని చెప్పబడింది.

The main door of a house

ఒక నిర్దిష్ట నిర్మాణంలో ఉన్న కట్టడం, మనిషి మానసిక స్థితిగతులలో మార్పులకు కారణమయ్యే అవకాశాలు లేకపోలేదు. ఒకరి ప్రవర్తనను ముందుగా కొంత అంచనా వేయడం ద్వారా, వారితో వ్యవహరించునప్పుడు ప్రయోజనకరంగా ఉంటుంది. క్రమంగా దీని గురించి ఇక్కడ చర్చించబోతున్నాము. ఇంటి యొక్క ప్రధాన ద్వారం, లేదా ప్రధాన తలుపుల నిర్మాణం ద్వారా, యజమాని స్వభావాన్ని మరియు ప్రవర్తనను తెలుసుకునే విధానాల గురించిన సమగ్ర వివరణను ఇక్కడ పొందుపరచబడింది.

ఇంటి ప్రధాన ద్వారం ఇంటి యజమాని వ్యక్తిత్వాన్ని ఏవిధంగా బహిర్గతం చేస్తుందో తెలుసుకోండి ...

 ఈశాన్య దిశ:

ఈశాన్య దిశ:

ప్రధాన ద్వారం ఈశాన్య దిక్కున ఉన్న ఎడల, యజమాని, తాను ఎన్ని విజయాలు సాధించినా కూడా ఏమాత్రం భేషజాలు లేనివాడై నలుగురితో ఉన్నతంగా మసలే వ్యక్తిత్వ లక్షణాలను కనపరచేవారిలా ఉంటారు. అధిక దుబారా కూడా వారికి ఇష్టం ఉండకపోవచ్చు. ఆర్ధికపరమైన అంశాలనందు ప్రత్యేక దృష్టిని కలిగి ఉంటారు. క్రమంగా వీరి ఇంట ఆర్ధిక భారం అనేది తక్కువగా ఉంటుంది.

ఈశాన్య దిశగా తలుపు ఉన్న ఎడల, ఇంటి యజమాని దయగల మనస్కునిగా ,అలాగే ఆధ్యాత్మికత మరియు మతపరమైన వ్యవహారాలనందు నిర్దిష్టమైన శ్రద్ధ తీసుకునేవారిగా ఉంటారని చెప్పబడింది. అంతేకాకుండా, సాహిత్యపరమైన అంశాలనందు కూడా ప్రత్యేక దృష్టి కలిగిన వారిగా మరియు ధైర్యవంతునిగా ఉంటారని చెప్పబడింది. క్రమంగా తన ఇంటికి ఒక రక్షణ కవచం వలె యజమాని వ్యవహరిస్తాడని చెప్పబడింది.

తూర్పు దిక్కు:

తూర్పు దిక్కు:

ఇంటి యొక్క ప్రధాన ద్వారం తూర్పు దిక్కున ఉన్నప్పుడు, అనగా ఇంటి తూర్పు గోడకు మధ్యలో ప్రధాన ద్వారం ఉన్న ఎడల, ఇంటిలోని సభ్యులందరూ ఒకే రకమైన లక్షణాలను కలిగి ఉంటారు, వీరందరూ ఒకే లక్ష్య సాధన కోసం తపనపడే వారిగా ఉంటారు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే పట్టుదల వీరిలో అధికంగా ఉంటుంది. వీరికి కలలు కనడం కన్నా, వాటిని సాధించడం మీదనేఎక్కువ దృష్టి ఉంటుంది.

 ఆగ్నేయ దిశ:

ఆగ్నేయ దిశ:

దక్షిణ దిశను అంత మంచిగా పరిగణించరు మరియు సాధారణంగా ఇంటి ప్రధాన ద్వారానికి సూచించబడదు. దక్షిణ దిక్కున ప్రధాన ద్వారం ఉన్న ఎడల, ఇంటిలో దొంగతనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పబడింది. అంతేకాకుండా, ఇంటి యజమాని ఆలోచనా విధానాలలో కూడా ప్రతికూల మార్పులు చోటుచేసుకుంటాయి.

నైరుతి దిశ:

నైరుతి దిశ:

నైరుతి దిశలో ఇంటి ప్రధాన ద్వారం ఉన్న ఎడల, ఇంటి యజమానికి అనవసర ఒత్తిడి, ఆందోళనలు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లోని మహిళల ఆరోగ్యం కూడా సక్రమంగా ఉండకపోవచ్చు. క్రమంగా తరచుగా అనారోగ్యాలకు గురవడం జరుగుతుంటుంది. అంతేకాకుండా అధిక ఒత్తిడి కారణంగా వీరి మానసిక స్థాయిలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతాయని చెప్పబడింది. ప్రధాన ద్వారం ఎక్కువగా పశ్చిమ దిశ వైపుకి సాగుతున్నప్పుడు, ఆ ఇంటి యజమాని అనేక రకాల తీవ్రమైన వ్యాధుల బారినపడే అవకాశాలు ఉంటాయి. సోమరిగా మారి అనారోగ్య లక్షణాలు లేదా వ్యసనాల బారిన పడే అవకాశాలూ లేకపోలేదు.

పశ్చిమ దిశ:

పశ్చిమ దిశ:

పశ్చిమాన ఇంటి ప్రధాన ముఖ ద్వారం ఉన్న ఎడల, యజమాని సరళమైన జీవితాన్ని కలిగి ఉంటూ, గంభీరమైన వ్యక్తిగా ఉంటారని చెప్పబడింది. అంతేకాకుండా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అధికమైన ఆలోచనలతో ముందుచూపు కలిగిన వానిగా ఉంటాడని చెప్పబడింది. .

 వాయవ్య దిశ:

వాయవ్య దిశ:

వాయవ్య దిశకు అనుబంధంగా ప్రధాన ముఖ ద్వారాన్ని కలిగిన ఇంటి యజమాని, ప్రయాణాలను, తీర్ధయాత్రలను, కొత్త ప్రదేశాలను అధికంగా ఇష్టపడుతారని చెప్పబడింది. అంతేకాకుండా సాటి వ్యక్తులతో ఉత్తమమైన సాన్నిహిత్యాన్ని కలిగి ఉంటారు. కానీ, వీరి భావోద్వేగాలు వీరి అపజయాలకు కారణమయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈ ద్వారం, ఉత్తర దిక్కు వైపు అధికంగా ఉన్న ఎడల, అది యజమాని జీవితంలో వ్యక్తిగత మరియు చట్టపరమైన సమస్యలకు కారణం కావచ్చు.

ఉత్తర దిక్కు:

ఉత్తర దిక్కు:

ఉత్తర దిశలో ఉన్న ప్రధాన ద్వారం కలిగిన ఇంటి యజమాని, ఎటువంటి విషయాలనైనా తేలికగా తీసుకునే స్వభావం గల వ్యక్తిగా సూచిస్తుంది. తెలివి తేటలు ఇతని సహజ సిద్దమైన ఆభరణాలుగా ఉంటాయి. మరియు సంఘంలో గౌరవ ప్రతిష్టలు కలిగిన వ్యక్తిగా చెప్పబడుతుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, సౌందర్య, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, మాతృత్వ, శిశు సంబంధ, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

The Mani Door of the house reveals the nature of the owner

The main door of a house can reveal a whole lot about the qualities and nature of the owner of a house. Read more to know how.
Desktop Bottom Promotion