For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒక్కరే: నవరాత్రి స్పెషల్

|

శక్తి స్వరూపిణి దుర్గామాత ప్రాధాన్యతను చాటే నవరాత్రి ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. దసరా పండుగకు 9రోజుల ముందు నుంచి ఆరంభమయ్యే ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. నవ అంటే తొమ్మిది. సంస్కత బాషలో నవానం రాత్రీనాం సమహార: నవరాత్రి. అంటే నవరాత్రి తొమ్మిది రాత్రుల సమహారమని. ఈ తొమ్మిది రాత్రులు అమ్మావారిని ఆరాధించాలి కనుక దేవి నవరాత్రులన్నారు. నవ సంఖ్య పరిపూర్ణతకు చిహ్నం. ఈ నవరాత్రులు మనిషికి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తాయి. ఈ నవరాత్రులలో దేవి భాగవతం చదవడంకానీ, వినడం కానీ చేస్తారు.

దసరా అంటే దన్+హరా అని; అంటే సీతాపహరణ గావించిన రావణాసురుని శ్రీరాముడు పదితలలను నరికి సంహరించిన సందర్భంగా జరుపుకునే విజయోత్సవంగా కూడా దీనిని వ్యవహరిస్తూ ఉంటారు. సరిగా వానిని ఆశ్వీయుజమాసం నవమి తిధినాడు సంహరించినాడు. అందువల్ల దీనిని "దసరా వైభవం" గా దశమినాడు జరుపుతూ ఉంటారు. ఇక దేవినవరాత్రి పూజలు చేయుట, అనునది అనాదికాలంగా వస్తున్న శాస్త్రవిధి. "అశ్వనీ" నక్షత్రంలో కలసివచ్చిన పూర్ణిమమాసమే "ఆశ్వీయుజమాసం" అవుతుంది. ఈ మాసమందు 'దేవీనవరాత్రుల'ను శరన్నవరాత్రులని పిలుస్తూ శుద్ధపాడ్యమి తిథితో ప్రారంభించి తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు వైభవంగా చేస్తారు.

మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒకరే! అలంకారాలు వేరైనా అమ్మదయ అందరిపట్ల ఒకటే! హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో వైభవంగా నిర్వహించే పండుగలలో ఈ "దసరావైభవం" ఒకటి. ఇది పదిరోజులు పండుగ అయినప్పటికి దేవిని రోజుకో అవతారంగా అలంకరించి అమ్మవారికి అర్చనలుచేసి, నవవిధ పిండివంటలతో నివేదనలుచేస్తూ విశేష పూజలతో పాటు శ్రీలలితా సహస్రనామ పారాయణ నిత్యము గావిస్తూ "శరన్నవరాత్రులు" గా వ్యవహరిస్తారు. మరి అమ్మను 9 రోజుల పాటు వివిధ రూపాలలో, వివిధ అలంకరణలతో పూజిస్తారు. మరి 9 రోజుల పాటు దేవిని ఎలా ప్రసన్నం చేసుకుంటారో. ఏవిధంగా అలంకరిస్తారో క్రింద వివరించబడినది.

The Nine Goddesses Of Navratri

1. ప్రథమ శైలపుత్రి దేవి: మొదటి రోజు అమ్మవారు ప్రథమ శైలపుత్రిగా అంటే శ్రీబాలా త్రిపురసుందరి దేవిగా అలంకారముగా అవతరిస్తుంది. నవరాత్రులలో మొదటి రోజు అమ్మ దుర్గాదేవికి సమర్పించుకొనే నైవేద్యం కట్టె పొంగలి రెండువ పద్ధతి నవరాత్రి దుర్గా దేవికి కట్టె పొంగలి నైవేద్యంగా పెడతారు.
2. బ్రహ్మ చారిణి దేవి: రెండవ రోజు అమ్మవారిని ఉమ లేదా బ్రహ్మ చారిణి అనగా శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. తరువాత నైవేద్యం రూపంలో పులిహోర మరియు నిమ్మకాయ పులిహోర భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించుకుంటారు.

3. చంద్రఘంటా దేవి: మూడవ రోజు అమ్మవారిని చంద్రఘంటా అనగా గాయత్రీ శ్రీదేవి రూపంముగా అలంకరిస్తారు. నైవేద్యంగా కొబ్బరి అన్నం మరియు కొబ్బరి పాయసం సమర్పించుకుంటారు.


4. కూష్మాండ శ్రీ మహాలక్ష్మి దేవి:
ఈ ఉత్సవాలలో నాలుగువ రోజు అమ్మవారిని కూష్మాండ శ్రీ మహాలక్ష్మి దేవి రూపంముగా అలంకరిస్తారు. సింహాం మీద కూర్చొని, ఎడురకాల ఆయుధాలను ఆమె ఎనిమిది చేతుల్లో ఉన్నట్లు అవతరిస్తుంది. ఆ రోజు నైవేద్యంగా మినప గారెలు లేదా మొక్కజొన్న గారెలు లేదా మసాలా మినప గారెలు మరియు పెసర గారెలు భక్తిశ్రద్ధలతో పెడతారు.

5. స్కంధమాత: ఐదవ రోజు దుర్గాదేవిని స్కంధమాత సరస్వతి దేవిగా అలంకరిస్తారు. ఆరోజు అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నంను సమర్పించుకుంటారు.

6. కాత్యాయనీ మాత: ఆరవ రోజు దుర్గా దేవిని కాత్యాయనీ శ్రీలలితాదేవి రూపముగా అలంకరిస్తారు ఆరోజు అమ్మవారికి నైవేద్యంగా కేసరిని ప్రసాదంగా పెడుతారు.

7.కాళరాత్రి మాత: ఏడవ రోజు అమ్మవారిని కాళరాత్రి శ్రీ దుర్గాదేవి రూపముగా అలంకరణ చేస్తారు కనకదుర్గ దేవికి నైవేద్యంగా శాకాన్నం లేదా కలగూర పులుసు ను ప్రసాదంగా పెడుతారు.

8. మహాగౌరీ మాత: ఎనిమిదవ రోజు అమ్మవారిని మహాగౌరి శ్రీ మహిషాసుర మర్దనీ దేవిగా అలంకరణ చేస్తారు నైవేద్యంగా రవ్వతో చక్రపొంగలి మరియు చక్కర పొంగల్ ని పెడుతారు.

9. సిద్ధిరాత్రి మాత: తొమ్మిదవ రోజు దుర్గాదేవిని సిద్ధిరాత్రి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు ఆరోజు నైవేద్యంగా సేమ్య పాయసం లేదా క్యారెట్ పాయసం లేదా కొబ్బరి గసగసాల పాయసం లేదా అన్నం పరవాన్నం లేదా పెసరపప్పు పాయసం లేదా కొబ్బరి పాల పాయసంను భక్తులు ప్రసాదంగా పెడుతారు.

English summary

The Nine Goddesses Of Navratri

Navratri is a festival of Goddess Durga. This nine day festival honours the nine goddess of Navratri. Each of the nine goddesses of Navratri is an avatar of Shakti. Navratri is a festival that marks Maa Durga's fight with the deviant asura, Mahishasura and her glorious victory. It comes twice every year.
Desktop Bottom Promotion