For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు దెయ్యాలున్నాయని నమ్ముతారా? అయితే ఈ దేవుడిని దర్శించుకుంటే దెయ్యం పారిపోతుందట...

ఈ ఆలయంలో పెద్ద పెద్ద కళ్లతో కోపంగా చూస్తున్నట్లుగా ఉండే హనుమంతుని విగ్రహాన్ని చూడగానే దెయ్యాలు పారిపోతాయని చాలా మంది భక్తులు నమ్ముతారు. చాలా మందికి గుడికి వెళ్తే మనసు ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుంది.

|

దెయ్యాలంటే ఇప్పటికీ మనుషులు చాలా భయపడతారు. ఇప్పటివరకు దెయ్యాలను నిజంగా ఎవ్వరూ చూడనప్పటికీ దెయ్యాల ఆత్మలు మనుషుల శరీరంలోకి ప్రవేశించి వింత ప్రవర్తనలు చేస్తుంటాయి. అప్పుడే చాలా మంది దెయ్యం పట్టిందని లేదా ఏదో భూతం దూరిందని, గాలి సోకిందని చెబుతుంటారు. అయితే ఈ దెయ్యాలకు ఆ గుడిలో గంట శబ్దం అయితే వాటిలో గుండె దడ మొదలవుతుందట.

The only witch temple for exorcism of ghosts in India

అందుకే ఆ దేవాలయంలో దేవుడి పేరు కంటే దెయ్యాలను వదిలించే దేవాలయం అనే పేరుతోనే ఎక్కువగా ప్రసిద్ధి గాంచింది. ఆ దేవాలయం మన దేశంలోని రాజస్థాన్ జిల్లాలో ఉంది. ఆ దేవాలయం పేరు ఏంటంటే మెహందీపూర్ బాాలాజీ దేవాలయం. బాలాజీ అంటే సాధారణంగా వెంకటేశ్వరస్వామి అని అనుకుంటారు. కానీ అక్కడ ఉండేది హనుమంతుడు. అక్కడ బాలాజీ అంటే ఆంజనేయస్వామి. అయితే ఈ గుడిలోకి వెళ్లాలంటే చాలా మందికి వెన్నులో వణుకు పుడుతుంది. అక్కడ బాలాజీ అంటే ఆంజనేయస్వామి. అయితే ఈ గుడిలోకి వెళ్లాలంటే చాలా మందికి వెన్నులో వణుకు పుడుతుంది. ఇంతకీ ఆ దేవాలయం ఎక్కడుంది? ఎందుకు అందరూ అక్కడికి వెళ్లడానికి భయపడతారు అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆ దేవాలయం ప్రత్యేకం..

ఆ దేవాలయం ప్రత్యేకం..

రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలో మెహందీపూర్ బాలాజీ దేవాలయం అన్ని దేవాలయాల కంటే చాలా ప్రత్యేకమైనది. ఏ హిందూ దేవాలయాన్ని చూసినా సరే చాలా ప్రశాంతంగా దేవుని యొక్క స్తోత్రాలతో, దేవుని యొక్క పాటలతో, భక్తులతో మనసుకు అత్యంత ప్రశాంతతను చూస్తు ఉంటాం.

పేరు హనుమ.. కానీ రూపం వేరు..

పేరు హనుమ.. కానీ రూపం వేరు..

ఈ ఆలయంలోని హనుమంతుడి రూపం విభిన్నంగా ఉంటుంది. సాధారణ ఆలయాల్లో ఆంజనేయస్వామి రూపం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.

దెయ్యాలు పరార్..

దెయ్యాలు పరార్..

ఈ ఆలయంలో పెద్ద పెద్ద కళ్లతో కోపంగా చూస్తున్నట్లుగా ఉండే హనుమంతుని విగ్రహాన్ని చూడగానే దెయ్యాలు పారిపోతాయని చాలా మంది భక్తులు నమ్ముతారు. చాలా మందికి గుడికి వెళ్తే మనసు ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుంది. కానీ, ఆ ఆలయంలో అడుగు పెడితే మాత్రం కాళ్లు, చేతులు వణుకుతాయి. గుడిలో గంట శబ్దం వినబడితే గుండెల్లో గుబులు మొదలవుతుంది.

అరుపులు... కేకలు..

అరుపులు... కేకలు..

అంతే కాదు ఆ ఆలయంలో ఎక్కువగా అరుపులు, కేకలు, పూనకాలతో ఊగిపోయే జనాలతో పాటు ఇంకా ఎన్నో వింతలు కనిపిస్తాయి. ప్రపంచంలో ఏ దేవాలయంలో కనిపించని భయంకరమైన వాతావరణం అక్కడ ఉంటుంది.

వింతైన అనుభూతి...

వింతైన అనుభూతి...

ఈ ఆలయంలోకి సామాన్య భక్తులు అడుగుపెడితే వింతైన అనుభూతి కలుగుతుంది. తమలో ఉన్న దుష్టశక్తులను వదిలించుకోవడానికి భక్తులు ప్రతిరోజూ అక్కడికి వెళ్తుంటారు. ఎంతో మహిమ ఉన్న ఆంజనేయ స్వామి స్వయంగా ఇక్కడ భూత వైద్యం చేసే ఆశ్చర్యకరమైన ఘటనలు మనకు అక్కడ కనబడతాయి.

అంతుచిక్కని రహస్యం...

అంతుచిక్కని రహస్యం...

దీనిపై దేశ, విదేశాలకు చెందిన అనేక మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ ఈ ఆలయంలో ఉన్న శక్తి యొక్క రహస్యం ఎవ్వరికీ అంతు చిక్కలేదు.

ఎందుకు భయపడతారంటే..

ఎందుకు భయపడతారంటే..

కొంతమంది భక్తులు దెయ్యం పట్టినప్పుడు వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. అయితే వారంతా ఈ ఆలయం దగ్గరకు రాగా సాధారణ స్థితికి చేరుకుంటారు. దీంతో కులమతాలకు అతీతంగా భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. అయితే సామాన్య భక్తులు మాత్రం ఈ గుడికి వెళ్లడానికి భయపడుతుంటారు. ఎందుకంటే వారిని వదిలే దెయ్యాలు ఎక్కడ తమని పట్టుకుంటాయోననే ఆందోళన కూడా వారిని వెంటాడుతుంది.

మంగళ, శని వారాల్లో..

మంగళ, శని వారాల్లో..

అయితే ఈ ఆలయంలో దెయ్యాలు వదిలించే పూజలు ఎప్పుడు పడితే అప్పుడు చేయరు. వారంలో కేవలం రెండురోజులు అంటే మంగళవారం, శనివారం మాత్రమే చేస్తారు. ఈ రెండురోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. భూతాలను, దెయ్యాలను వదిలించుకునే భక్తులు ఈ బాలాజీ దేవుడికి ఆరోజీ, స్వామణి, ధరకష్ట్, బుంది అనే కానుకలు సమర్పించుకుంటారు. ఆలయం లోపల భైరవ బాబాను దర్శించుకుని అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే ఆ గుడిలో ఇచ్చే ప్రసాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ ఇంటికి తీసుకెళ్లకూడదు. అలా చేస్తే వారికి కీడు జరుగుతుందని భక్తుల విశ్వాసం.

English summary

The only witch temple for exorcism of ghosts in India

Do you believe in ghosts? Do you think a human being can be possessed by a harmful spirit? Do you even think the spirits exist? Let us visit a temple in Rajasthan where they have answers for all these questions.
Desktop Bottom Promotion