పిల్లలు లేని వారు సుబ్రమణ్యస్వామిని ఎందుకు పూజిస్తారు?

Posted By:
Subscribe to Boldsky

కుమారస్వామి జన్మించిన విధానాన్నిబట్టి ఆయనకి అనేక నామాలు ఏర్పడ్డాయి. ఈ కారణంగానే కుమారస్వామి జన్మించిన మార్గశిర శుద్ధ షష్ఠి ... కుమార షష్ఠిగా ... సుబ్రహ్మణ్య షష్ఠిగా ... స్కంద షష్ఠిగా ... కార్తికేయ షష్ఠిగా పిలవబడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ప్రధాన దైవంగా అనుగ్రహించే స్వామి, మరికొన్ని ప్రాంతాల్లో పరివార దేవతగా కొలువుదీరి కనిపిస్తూ ఉంటాడు.

కొన్నిచోట్ల శక్తి ఆయుధాన్ని ధరించి బాలుడి రూపంలో దర్శనమిస్తాడు. మరికొన్ని చోట్ల సర్పరూపంలో పూజలందుకుంటూ ఉంటాడు. సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వలన సర్పదోషం తొలగిపోయి సంతానం కలుగుతుందని చెప్పబడుతోంది. అందువలన ఈ స్వామి ఆలయాలు మహిళా భక్తులతో సందడిగా కనిపిస్తూ ఉంటాయి. అందుకు ఒక కథ కూడా ఉన్నది.

శ్రీ సుబ్రమణ్య స్వామి అష్టకం

పిల్లలు లేని వారు సుబ్రమణ్యస్వామిని ఎందుకు పూజిస్తారు?

ఒక రోజు పార్వతి, పరమేశ్వరులను దర్శించడానికి అనేక మంది తాపసులు కైలసానికి వస్తారు. అందులో దిగంబర ఋషులు ఉండటంతో సుబ్రమణ్యస్వామి హేళనగా నవ్వాడు. దానికి పార్వతిదేవి పుత్రుని మందలించి, మర్మాంగాలు సృష్టి వృద్ధి కోసం సృష్ణ్తిచినవి, జాతికి జన్మస్థానాలు అని తెలియచెప్పింది.

పిల్లలు లేని వారు సుబ్రమణ్యస్వామిని ఎందుకు పూజిస్తారు?

తల్లి జ్ఞాన భోధతో సుబ్రమణ్యస్వామి సర్పరూపం దాల్చాడు కొంతకాలం. జీవకణాలు పాముల్లా ఉంటాయని మనకు తెల్సిందే. ఆ తర్వాత వాటికి అధిపతి అయాడు. అందువల్లే జీవకణాల అధిపతి అయిన సుబ్రమణ్యస్వామిని పూజిస్తే పిల్లలు పుట్టని దంపతులకు సంతానం కలుగుతుంది చాలా మంది నమ్మకం.

కాలసర్ప దోషం అంటే ఏమి? 'కాళహస్తిలో ' పూజ చేయిస్తే సరిపోతుందా?

పిల్లలు లేని వారు సుబ్రమణ్యస్వామిని ఎందుకు పూజిస్తారు?

సుబ్రహ్మణ్యస్వామి జన్మించిన రోజున ఉపవాస దీక్షను చేపట్టి అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామిని ఆరాధిస్తారు. ఆలయానికి వెళ్లి స్వామివారికి పూజాభిషేకాలు జరిపిస్తారు.

పిల్లలు లేని వారు సుబ్రమణ్యస్వామిని ఎందుకు పూజిస్తారు?

పుట్టలో పాలుపోసి ... బెల్లం ... అరటిపండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. సంతానం కోసం సుబ్రహ్మణ్యషష్టి రోజున సుబ్రహ్మణ్యస్వామిని తప్పకుండా స్తుతించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

English summary

The Significance of Subramania Shashti

Lord Kartikeya is a well known figure in Hindu mythology. He addressed by different names such as Murugan, Subramaniam, Sanmukha, Skanda and Guha. He is most popular as Lord Murugan in the southern states of India. A number of temples dedicated to the deity can be spotted all over the South India.The Legend Of Lord Kartikeya Or Murugan
Story first published: Thursday, July 20, 2017, 18:32 [IST]
Subscribe Newsletter